Re.Wi.Re: భువనేశ్వర్‌లో అత్యాధునిక రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి తుకుని సాహు

Odisha: ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో భారతదేశపు ప్రముఖ వాహన తయారీసంస్థ అయిన టాటా మోటార్స్ తన రెండవ రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ(RVSF)ని టాటా మోటర్స్ ప్రారంభించింది. ‘Re.Wi.Re – రీసైకిల్ విత్ రెస్పెక్ట్’ అని పేరు పెట్టబడిన ఈ అధునాతన కేంద్రాన్ని ఒడిశా ప్రభుత్వ జలవనరులు, వాణిజ్యం & రవాణా శాఖ మంత్రి తుకుని సాహు ప్రారంభించారు.
ఈ అత్యాధునిక కేంద్రం పర్యావరణ అనుకూల ప్రక్రియలను ఉపయోగిస్తుంది. ప్రతి సంవత్సరం 10,000 దాకా కాలం చెల్లిన వాహనాలను సురక్షితంగా, సుస్థిరదాయకంగా విడదీయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఆర్వీఎస్ఎఫ్ అన్ని బ్రాండ్‌లకు చెందిన కాలం చెల్లిన ప్యాసింజర్, వాణిజ్య వాహనాలను స్క్రాప్ చేయడానికి వీలుగా టాటా మోటార్స్ భాగస్వామి ఎంప్రెయో ప్రీమియం ద్వారా అభివృద్ధి చేయబడి, నిర్వహించబడుతోంది. ఈ ప్రయోగం రాజస్థాన్‌లోని జైపూర్‌లోని మొదటి కేంద్రం విజయవంతంగా కొనసాగుతుండడంతో రెండవ కేంద్రాన్ని ఒడిశాలో ప్రారంభించింది.
ఒడిశాలో టాటా మోటార్స్ Re.Wi.Re ఆర్వీఎస్ఎఫ్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి శ్రీమతి తుకుని సాహు మాట్లాడుతూ “ఈ రోజు ఒడిశాలో సుస్థిరదాయకమైన అభివృద్ధి కోసం జరుగుతున్న మా ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఈ కొత్త స్క్రాపేజ్ కేంద్రం ద్వారా రవాణా రంగపు పర్యావరణ ప్రభావాన్ని తగ్గించే దిశగా కీలకమైన కొత్త అడుగు వేస్తున్నాం. ఈ కేంద్రం పాత వాహనాలను తుక్కుగా మార్చేందుకు సానుకూలమైన, సురక్షితమైన మార్గాన్ని అందించడమే కాకుండా పరిశుద్ధమైన, మరింత సమర్థవంతమైన రవాణా విధానాలను కూడా ప్రోత్సహిస్తుంది. పరిశుభ్రమైన, పచ్చటి భవిష్యత్తు కోసం మాతో కలిసి ఉండాలని మా పౌరులను కోరుతూ ఈ ప్రాజెక్ట్ ను ఫలవంతం చేయడంలో పాల్గొన్న టాటా మోటార్స్, అన్ని సంస్థల నిబద్ధతను మేం అభినందిస్తున్నాం’’ అని అన్నారు.