Motorola G96 5G : వావ్.. వండర్‌ఫుల్.. మోటోరోలా G96 5G ఫోన్ అతి చౌకైన ధరకే.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
Motorola G96 5G : మోటోరోలా జీ96 5జీ ఫోన్ ఏకంగా రూ. 6వేలు తగ్గింపు అందిస్తోంది. 5500mAh బ్యాటరీతో ఈ 5జీ ఫోన్ ఇలా కొనేసుకోండి.
Motorola G96 5G
Motorola G96 5G : కొత్త మోటోరోలా ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. మోటోరోలా G96 5G స్మార్ట్‌ఫోన్ ధర భారీగా తగ్గింది. పవర్‌ఫుల్ 5,500mAh బ్యాటరీ, 32MP సెల్ఫీ కెమెరాతో ఈ మోటోరోలా జీ96 5జీ ఫోన్ చౌకైన ధరకే లభిస్తోంది. అలాగే, ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ ధర కన్నా రూ.6వేలు తక్కువ ధరకే కొనేసుకోవచ్చు.
మోటోరోలా G96 భారత్ ధర, లభ్యత :
మోటోరోలా G96 5G ఫోన్ (8GB ర్యామ్ + 128GB, 8GB ర్యామ్ + 256GB) రెండు స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది.
8జీబీ + 128జీబీ : తగ్గింపు ధర రూ. 15,999
8జీబీ + 256జీబీ : తగ్గింపు ధర రూ.17,999
ఈ ఫోన్ ఆష్లీ బ్లూ, డ్రెస్డెన్ బ్లూ, ఆర్చిడ్, గ్రీన్ మొత్తం 4 కలర్ ఆప్షన్లలో వస్తుంది.
మోటోరోలా G96 కీలక స్పెసిఫికేషన్లు :
డిస్‌ప్లే : కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో 6.67-అంగుళాల FHD+ 10-బిట్ 3D కర్వ్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ ఆకట్టుకునే పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్టు ఇస్తుంది.
ప్రాసెసర్, స్టోరేజీ : ఈ మోటోరోలా ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జన్ 2 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 8GB వరకు ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది.
సాఫ్ట్‌వేర్, బ్యాటరీ : ఆండ్రాయిడ్ 15 ఆధారిత హలో యూఐపై రన్ అవుతుంది. మోటోరోలా ఫోన్ 3 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తుంది. ఈ ఫోన్‌కు పవర్ కోసం 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీ కలిగి
ఉంది. IP68 రేటింగ్ కూడా కలిగి ఉంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కూడా అందిస్తుంది.
కెమెరా ఫీచర్లు :
బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్
మెయిన్ కెమెరా : OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్)కు సపోర్టుతో 50MP సోనీ లిటియా 700C సెన్సార్.
సెకండరీ కెమెరా : 8MP సెన్సార్.
ఫ్రంట్ కెమెరా : సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరా
