Apple MacBook Air M4 : వారెవ్వా.. కిర్రాక్ డిస్కౌంట్.. ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 భారీగా తగ్గిందోచ్.. స్టూడెంట్స్, కంటెంట్ క్రియేటర్లు కొనేసుకోవచ్చు!
Apple MacBook Air M4 : ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ల్యాప్‌టాప్ చౌకైన ధరకే లభిస్తోంది. స్టూడెంట్స్, క్రియేటర్ల కోసం సరసమైన ధరకే లభిస్తోంది.
Apple MacBook Air M4
Apple MacBook Air M4 : మీరు బెస్ట్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? స్టూడెంట్ లేదా కంటెంట్ క్రియేటర్ అయితే ఇది మీకోసమే. ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ల్యాప్‌టాప్ అతి తక్కువ ధరకే కొనేసుకోవచ్చు. ఈ మ్యాక్‌బుక్ పర్ఫార్మెన్స్ పరంగా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ల్యాప్‌టాప్ రూ. 11,910 తగ్గింపుతో లభిస్తోంది.
ఈ ల్యాప్‌టాప్ 18 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ లేదా 15 గంటల వైర్‌లెస్ (Apple MacBook Air M4) వెబ్‌తో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో 12MP సెంటర్ స్టేజ్ కెమెరా, అనేక ఏఐ కెపాసిటీ కూడా కలిగి ఉంది. మ్యాక్‌బుక్ ఎయిర్ M4 లేటెస్ట్ డిస్కౌంట్ ధరకే ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
సరసమైన ధరకే మ్యాక్‌బుక్ ఎయిర్ M4 :
భారత మార్కెట్లో మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ల్యాప్‌టాప్ రూ. 99,900 ధరకు లాంచ్ అయింది. కానీ, ఫ్లిప్‌కార్ట్ లైవ్ సేల్‌లో 11శాతం తగ్గింపు తర్వాత ఈ ల్యాప్‌టాప్‌ను కేవలం రూ. 87,990కి కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు.. యాక్సస్ బ్యాంక్ ఫ్లిప్‌కార్ట్ డెబిట్ కార్డ్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌పై 5శాతం వరకు సేవ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, మీరు “Buy with Exchange” ఆప్షన్‌తో రూ. 53,010 వరకు తగ్గింపు పొందవచ్చు. మీ పాత ల్యాప్‌టాప్‌ను ఈ ల్యాప్‌టాప్‌తో ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు.
డిస్‌ప్లే, డిజైన్ :
ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ల్యాప్‌టాప్ 13.6-అంగుళాలు, 15.3-అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లేలతో వస్తుంది. గరిష్ట ప్రకాశంతో 500 నిట్స్ కలిగి ఉంది. ఈజీ పోర్టబుల్ అల్యూమినియం యూనిబాడీ ఎన్‌క్లోజర్‌ను కలిగి ఉంది. సైలెంట్ ఆపరేషన్ కోసం ఫ్యాన్‌లెస్ డిజైన్‌తో వస్తుంది.
ఈ ల్యాప్‌టాప్ కొత్త స్కై బ్లూ కలర్‌లో మిడ్‌నైట్, స్టార్‌లైట్, సిల్వర్ కలర్ ఆప్షన్‌లతో పాటు అందుబాటులో ఉంది. మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ల్యాప్‌టాప్ పవర్‌ఫుల్ 10-కోర్ సీపీయూ, 10-కోర్ జీపీయూతో ఆపిల్ M4 చిప్‌తో రన్ అవుతుంది. M1 మోడల్ కన్నా రెండు రెట్లు వేగంగా రన్ అవుతుంది.
ఈ ల్యాప్‌టాప్ అనేక ఏఐ కెపాసిటీ కలిగి ఉంది. ఏఐ ఆధారిత టాస్కుల కోసం ఆప్టిమైజ్ అయింది. ఆపిల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంది. ఈ ల్యాప్‌టాప్ (macOS Sequoia)లో రన్ అవుతుంది. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం టచ్ ఐడీతో అడ్వాన్స్ సెక్యూరిటీ కలిగి ఉంది. 32GB వరకు మెమరీకి సపోర్టు ఇస్తుంది. వివిధ SSD స్టోరేజీ ఆప్షన్లతో వస్తుంది.
కెమెరా సెటప్, బ్యాటరీ ప్యాక్ :
మాక్‌బుక్ ఎయిర్ M4 ల్యాప్‌టాప్‌లో హై క్వాలిటీ వీడియో కాల్స్ కోసం 12 MP సెంటర్ స్టేజ్ కెమెరా ఉంటుంది. స్పేషియల్ ఆడియోకు సపోర్టుతో సౌండ్ సిస్టమ్, మెరుగైన ఆడియో క్లారిటీ కోసం 3-మైక్ రేంజ్ కలిగి ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ 18 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ లేదా 15 గంటల వైర్‌లెస్ వెబ్ వినియోగంతో లాంగ్ బ్యాటరీ బ్యాకప్‌ను కూడా అందిస్తుంది. మాగ్‌సేఫ్ ఛార్జింగ్, హై-వాటేజ్ అడాప్టర్‌తో ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో వస్తుంది.
