Realme P3 Lite 5G : అద్భుతమైన ఫోన్ భయ్యా.. రియల్‌మి P3 లైట్ 5జీ ఫోన్ భలే ఉంది.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఆగలేరు!

Realme P3 Lite 5G : రియల్‌మి కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? రూ. 11వేల లోపు ధరలో 120Hz డిస్‌ప్లేతో 6000mAh భారీ బ్యాటరీతో రియల్‌మి P3 లైట్ 5జీ ఫోన్ కొనేసుకోవచ్చు.

Realme P3 Lite 5G : అద్భుతమైన ఫోన్ భయ్యా.. రియల్‌మి P3 లైట్ 5జీ ఫోన్ భలే ఉంది.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఆగలేరు!

Realme P3 Lite 5G

Updated On : October 25, 2025 / 8:17 PM IST

Realme P3 Lite 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? మీరు రూ. 11వేల బడ్జెట్ లోపు 5G స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తుంటే రియల్‌మి P3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ రియల్‌మి ఫోన్ లాంగ్ బ్యాటరీతో 6000mAh కలిగి ఉంది. 45W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. మీరు 32MP ప్రైమరీ కెమెరా సెటప్‌ పొందవచ్చు.

పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమన్షిటీ 6300 ప్రాసెసర్‌తో (Realme P3 Lite 5G) కూడా వస్తుంది. 6.67-అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే కూడా పొందుతుంది. ముఖ్యంగా, ఈ స్మార్ట్‌ఫోన్ అనేక ఈఎంఐ ఆప్షన్లతో కూడా అందుబాటులో ఉంది. రియల్‌మి P3 లైట్ 5G ఫోన్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

రియల్‌మి P3 లైట్ 5జీ ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
భారత మార్కెట్లో సెప్టెంబర్ 22, 2025న రియల్‌మి P3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ ప్లస్ 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,999కి లాంచ్ అయింది. 19శాతం ధర తగ్గింపుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.10,499కి కొనుగోలు చేయవచ్చు. మీరు యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్‌కార్ట్ డెబిట్ కార్డ్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌పై 5శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

అంతేకాకుండా, ఈ స్మార్ట్‌ఫోన్‌ ఈఎంఐ ఆప్షన్‌తో కొనుగోలు చేస్తే.. ఈఎంఐ కేవలం రూ. 516 నుంచి ప్రారంభమవుతుంది. మీరు ఎస్బీఐ, ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంకు, ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ వంటి అనేక బ్యాంక్ ఆప్షన్‌లను పొందవచ్చు.

Read Also : PM Kisan 21st installment : పీఎం కిసాన్ 21వ విడతపై బిగ్ అప్‌డేట్.. ఈ రైతులకు మాత్రం రూ. 2వేలు పడవు.. మీరు అర్హులేనా? చెక్ చేసుకోండి!

డిస్‌ప్లే, డిజైన్ :
రియల్‌మి P3 లైట్ 5జీ ఫోన్ 6.67-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్, 625 నిట్స్ గరిష్ట ప్రకాశంతో వస్తుంది. 197 గ్రాముల బరువు, 7.94 మిమీ స్లిమ్ ప్రొఫైల్‌తో ఆకర్షణీయమైన డిజైన్‌ కూడా కలిగి ఉంది. ఈ రియల్‌మి స్ప్లాష్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్‌ కూడా కలిగి ఉంది. మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ కోసం వెరిఫై అయింది.

కెమెరా సెటప్, బ్యాటరీ ప్యాక్ :

రియల్‌మి P3 లైట్ 5G ఫోన్ బ్యాక్ సైడ్ అద్భుతమైన ఫొటోల కోసం ఎఫ్/1.8 ఎపర్చర్‌తో 32MP ప్రైమరీ సెన్సార్‌ కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ వీడియో కాల్స్, ఫొటోల కోసం 8MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది. అల్గోరిథం వంటి ఏఐ ఫొటో అప్‌గ్రేడ్స్ కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. 6000mAh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. రెండు రోజుల బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. ఈ ఫోన్ 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఛార్జ్ చేయవచ్చు. 5W రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.

అద్భుతమైన ప్రాసెసర్ :
రియల్‌మి P3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 6300 5G ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 6nm ప్రాసెస్‌, రోజువారీ టాస్కులకు అద్భుతంగా ఉంటుంది. మంచి గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా అందిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రియల్‌మి యూఐ 6.0పై కూడా రన్ అవుతుంది. 4GB లేదా 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు విస్తరించవచ్చు.