ఇండియాలో అపర కుబేరుడిగా ముఖేశ్ అంబానీ
ఇండియాలో అత్యంత ధనికుడిగా మరోసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు.

ఇండియాలో అత్యంత ధనికుడిగా మరోసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు.
ఇండియాలో అత్యంత ధనికుడిగా మరోసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. IIFL వెల్త్ హ్యురన్ ఇండియా విడుదల చేసిన 2019 సంపన్నుల జాబితాలో రూ.3.8 లక్షల కోట్లతో ముఖేశ్ అంబానీ వరుసగా 8వ సారి చోటు దక్కించుకున్నారు. ప్రపంచంలో ముఖేశ్ 8వ అత్యంత ధనికుడిగా నిలిచారు. అంబానీ తర్వాత లండన్ ఆధారిత కంపెనీ హిందుజా గ్రూపు ఆఫ్ కంపెనీ చైర్మన్ గా ఉన్న SP హిందుజా అండ్ ఫ్యామిలీ రూ.1.86 లక్షల కోట్లతో రెండో స్థానంలో నిలిచింది.
ఆ తర్వాతి స్థానాల్లో టెక్నాలజీ మొగల్ అజిమ్ ప్రేమ్ జీ రూ.1.17 లక్షల కోట్లతో మూడో స్థానం, ఎల్ ఎన్ మిట్టల్ అండ్ ఫ్యామిలీ, చైర్మన్, సీఈఓ అర్సెలర్ మిట్టల్ సంపన్నుల జాబితాలో రూ.1.07 లక్షల కోట్లతో నాల్గో స్థానంలో నిలిచినట్టు ఐఐఎఫ్ఎల్ రిపోర్టు తెలిపింది. IIFL రిపోర్ట్ ప్రకారం.. హ్యురన్ ఇండియా సంపన్నుల జాబితాలో మొత్తం 953 మంది వ్యక్తిగత సంపన్నులుగా రూ.వెయ్యి కోట్ల సంపద కలిగి ఉన్నారు. 2018 ఏడాదితో పోలిస్తే 15శాతానికిపైగా పెరగగా.. వ్యక్తిగతంగా 122 మంది సంపన్నులుగా నిలిచారు.
2018లో వ్యక్తిగత సంపన్నుల జాబితాలో 831 మంది ఉన్నారు. 2016 హ్యురన్ ఇండియా ధనవంతుల జాబితా నుంచి వ్యక్తిగత సంపన్నుల జాబితాలో 181 శాతానికి పెరిగింది. హ్యురన్ రిపోర్టు ఇండియా ఎండీ, చీఫ్ రీసెర్చర్, అనాస్ రెహ్మాన్ జునైద్ మాట్లాడుతూ.. 2019 సంపన్నుల జాబితాలో మొత్తం 63 నగరాలు ఉండగా.. ముంబై నుంచి అత్యధికంగా 246 మంది పోటీదారులు ఉన్నారని ఆయన చెప్పారు.