Xiaomi 14 Ultra Launch : అద్భుతమైన కెమెరాలతో షావోమీ 14 అల్ట్రా ఫోన్ లాంచ్.. గ్లోబల్ మార్కెట్లో ఈ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ధర ఎంతంటే?

Xiaomi 14 Ultra Launch : ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ మార్కెట్లోకి షావోమీ 14 అల్ట్రాను షావోమీ కంపెనీ లాంచ్ చేసింది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024లో షావోమీ ఈ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ప్రవేశఫెట్టింది. ఈ సిరీస్‌లో ఇదే సరికొత్తది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Xiaomi 14 Ultra Launch : అద్భుతమైన కెమెరాలతో షావోమీ 14 అల్ట్రా ఫోన్ లాంచ్.. గ్లోబల్ మార్కెట్లో ఈ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ధర ఎంతంటే?

MWC 2024 : Xiaomi 14 Ultra with quad 50MP camera setup launched

Xiaomi 14 Ultra Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ ఇటీవలే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024లో లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను ఆవిష్కరించింది. అదే.. షావోమీ 14 అల్ట్రా మోడల్. కొన్ని రోజుల క్రితమే చైనాలో లాంచ్ అయిన ఈ అల్ట్రా ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 చిప్‌సెట్‌ను అందిస్తుంది. డిజైన్ పరంగా చూస్తే.. షావోమీ 14 అల్ట్రా ఫోన్ గత వెర్షన్ల మాదిరిగానే కనిపిస్తుంది. అయితే, కంపెనీ అన్ని వైపులా కర్వడ్ డిస్‌ప్లేను విస్తరించినట్లు కనిపిస్తోంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా హైపర్‌ఓఎస్‌లో రన్ అవుతుంది. లైకా సమ్మిలెక్స్ ట్యూన్డ్ లెన్స్‌లతో వస్తుంది.

Read Also : Realme 12 Pro Plus 5G Launch : ట్రిపుల్ రియర్ కెమెరాలతో రియల్‌మి 12 ప్రో ప్లస్ 5జీ ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

ఆకర్షణీయమైన కెమెరా ఫీచర్లు :
వనిల్లా షావోమీ 14తో పోలిస్తే.. అల్ట్రా మోడల్ 3,000నిట్స్ గరిష్ట ప్రకాశంతో 6.73-అంగుళాల 120హెచ్‌జెడ్ క్యూహెచ్‌డీ + ఎల్‌టీపీఓ అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. వెనుకవైపు, 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ 900 ప్రైమరీ కెమెరాను అందిస్తోంది. 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్858 టెలిఫోటో లెన్స్ 3.2ఎక్స్ ఆప్టికల్ జూమ్, 50ఎంపీ పెరిస్కోప్ లెన్స్‌తో 5ఎక్స్ ఆప్టికల్ జూమ్, అల్ట్రావైడ్ 50ఎంపీ సెన్సార్‌ను అందిస్తుంది. 32ఎంపీ సెల్ఫీ షూటర్‌, సెంటర్ పంచ్-హోల్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

షావోమీ కంపెనీ ప్రవేశపెట్టిన కొత్త షావోమీ 14 అల్ట్రా మోడల్‌లో ఫొటోగ్రఫీ కిట్‌ను మళ్లీ తీసుకొస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ ఫోన్‌లో ప్రత్యేక కెమెరా గ్రిప్, డెడికేటెడ్ షట్టర్ రిలీజ్ బటన్‌ను కనెక్ట్ అయ్యేలా యూజర్లను అనుమతిస్తుంది. యూఎస్‌బీ-సి ద్వారా గ్రిప్ ఫోన్‌కి అందిస్తుంది. వినియోగదారులు షట్టర్ స్పీడ్, ఐఎస్ఓ, ఎపర్చరును ఎడ్జెస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా 1,500ఎంఎహెచ్ బ్యాటరీని ప్యాక్, కస్టమైజడ్ కంట్రోల్స్ అందిస్తుంది.

షావోమీ 14 అల్ట్రా ధర ఎంతంటే? :
షావోమీ సిరీస్‌లోని ఇతర వేరియంట్‌లతో పోలిస్తే.. షావోమీ 14 అల్ట్రా 90డబ్ల్యూ ఛార్జ్ చేయగల పెద్ద 5,300ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. షావోమీ 14 ప్రో మోడల్ 120డబ్ల్యూ ఛార్జింగ్ కన్నా కొంచెం స్లోగా ఉంటుంది. 80డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఈ సిరీస్‌లోని ఇతర మోడళ్ల మాదిరిగా కాకుండా షావోమీ 14 అల్ట్రా మోడల్ 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజీని అందించే ఒక వేరియంట్‌లో మాత్రమే వస్తుంది. ప్రస్తుతం ఈ కొత్త అల్ట్రా మోడ్ ఈయూఆర్ 1,499 (దాదాపు రూ. 1,34,500)కి అందుబాటులో ఉంది.

Read Also : iQoo Z9 5G India Launch : భారత్‌కు ఐక్యూ Z9 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. మార్చి 12నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?