New Rules : బిగ్ అలర్ట్.. జూన్ 1 నుంచి 6 కొత్త రూల్స్.. ఏయే మార్పులు ఉంటాయంటే? ఫుల్ డిటెయిల్స్..!

New Rules : వచ్చే నెల నుంచి 6 కొత్త మార్పులు రాబోతున్నాయి. బ్యాంకింగ్ నుంచి గ్యాస్ సిలిండర్ వరకు ఏయే మార్పులు ఉండనున్నాయంటే?

New Rules : బిగ్ అలర్ట్.. జూన్ 1 నుంచి 6 కొత్త రూల్స్.. ఏయే మార్పులు ఉంటాయంటే? ఫుల్ డిటెయిల్స్..!

New Rules

Updated On : May 27, 2025 / 11:13 PM IST

New Rules : బిగ్ అలర్ట్.. జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులతో ఆర్థికపరంగా (New Rules) భారం పడే అవకాశం ఉంది.

రాబోయే మార్పులలో ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ ధర నుంచి బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు ఛార్జీలు, జీఎస్టీ వరకు అనేక కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఇంతకీ రాబోయే 6 కొత్త నిబంధనలేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం.

Read Also : Motorola Razr 60 : మోటోరోలా మడతబెట్టే ఫోన్ కావాలా? ఈ వారమే లాంచ్.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చంటే?

1. ఈపీఎఫ్ఓ సర్వీసులు సులభతరం :
జూన్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓ కొత్త వెర్షన్ 3.0 ప్రవేశపెట్టనుంది. పీఎఫ్ డబ్బును విత్ డ్రా చేయడం, క్లెయిమ్ చేయడం లేదా వివరాలను అప్‌డేట్ చేయడం వంటి PF సంబంధిత సర్వీసులు గతంలో కన్నా సులభంగా ఉంటాయి. ఏటీఎం లాంటి కార్డుతో పీఎఫ్ అకౌంట్ నుంచి నేరుగా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.

2. క్రెడిట్ కార్డ్ వాడకంపై అదనపు ఛార్జీలు :
క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు కఠినమైన రూల్స్.. ఆటో-డెబిట్ ఫెయిల్ అయితే 2శాతం వరకు జరిమానా ఛార్జ్ చెల్లించాల్సి రావచ్చు. యుటిలిటీ బిల్లు లేదా ఫ్యూయల్ కోసం కార్డును వాడితే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి రావచ్చు. అంతర్జాతీయ లావాదేవీలపై అదనపు ఛార్జీలు, రివార్డ్ పాయింట్లు తగ్గించవచ్చు.

3. ఏటీఎం నుంచి డ్రా చేస్తే ఛార్జీలు :
జూన్ 1 నుంచి ఏటీఎంలో డబ్బును విత్‌డ్రా చేస్తే భారీగా ఛార్జీలు పడతాయి. ఇప్పుడు పరిమిత ఫ్రీ ట్రాన్సాక్షన్ల లావాదేవీల తర్వాత ప్రతి లావాదేవీకి ఛార్జీ విధిస్తారు. ఏటీఎం నుంచి ఎక్కువ సార్లు డబ్బులు డ్రా చేయకపోవడమే మంచిది.

4. వంట గ్యాస్ మరింత ప్రియం :
ప్రతి నెలా ఒకటో తేదీన ఎల్‌పీజీ సిలిండర్ ధరలు నిర్ణయిస్తారు. జూన్ 1న గ్యాస్ సిలిండర్ మరింత ఖరీదైనది లేదా చౌకగా మారవచ్చు. మీ బడ్జెట్‌పై ముఖ్యంగా సబ్సిడీ సిలిండర్లను వినియోగించే కుటుంబాలపై నేరుగా ప్రభావం పడనుంది.

5. FD వడ్డీ రేట్లు తగ్గింపు :
జూన్ 6న ఆర్‌బీఐ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఆర్‌బీఐ రెపో రేటును తగ్గించే అవకాశం ఉంది. ఇది జరిగితే.. బ్యాంకులు ఎఫ్‌డీపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించవచ్చు.

ఇటీవల, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ వంటి బ్యాంకులు ఎఫ్‌డీపై వడ్డీని తగ్గించాయి. ఇప్పుడు ఆర్‌బీఐ రెపో రేటును తగ్గిస్తే, బ్యాంకులు మళ్ళీ ఎఫ్‌డీపై వడ్డీని కూడా తగ్గించే అవకాశం ఉంది.

6. GST ఇన్‌వాయిస్ రూల్ :
జూన్ 1 నుంచి ఇన్‌వాయిస్ GSTN నంబర్‌లు ఇకపై కేస్-సెన్సిటివ్‌గా ఉండవు (బిగ్ లెటర్స్ లేదా స్మాల్ లెటర్స్ మధ్య తేడా ఉండదు). abc, ABC లేదా Abc ఈ మూడింటినీ ఒకేలా పరిగణిస్తారు.

Read Also : WhatsApp iPad : పండగ చేస్కోండి.. ఐప్యాడ్ యూజర్ల కోసం వాట్సాప్ వచ్చేసిందోచ్.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..!

ఇది ఫేక్ ఇన్‌వాయిస్ నంబర్‌లను నియంత్రించవచ్చు. అలాగే, జీఎస్టీ ఇన్‌వాయిస్ నంబర్‌లు ఆటోమాటిక్‌గా క్యాపిటల్ లెటర్స్ (UPPERCASE)లోకి మారిపోతాయి.