FASTag లేకుంటే..ఆ రాయితీ రాదు

FASTag లేదా..అయితే..మీకు ఆ రాయితీ వర్తించదంటున్నారు కేంద్రం. ఎందుకంటే..ఫాస్టాగ్ వైపు కొంతమంది వాహనదారులు మళ్లకపోవడంతో పలు చర్యలకు దిగుతోంది. ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు వైపు మళ్లించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒత్తిడి తెచ్చి మరీ ఫాస్టాగ్స్ కొనిపించాలని నిర్ణయించారు. ఫాస్టాగ్ విధానం సంక్రాంతి నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్‌కు లైన్లు కేటాయించారు. టోల్ గేట్ దాటిని వెళ్లి..24 గంటల్లో తిరిగి వస్తే..రిటర్న్ టోల్ ఫీజులో సగం రాయితీ విధానం అమల్లో ఉంది. ఈ విధానాన్ని ఇప్పుడు ఎత్తివేయనున్నారు. కేవలం ఫాస్టాగ్ ఉన్న వాహనాలకు మాత్రమే ఈ రాయితీని వర్తింప చేయనున్నారు. నగదు రూపంలో చెల్లించే వారి వాహనాలకు ఇది వర్తించదు. 24 గంటల్లో తిరిగి వచ్చినా..మొత్తం టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాదు..ఫాస్టాగ్ లేకుంటే..నెలవారీ పాస్ రాయితీ ఉండదు. టోల్ గేట్లకు 10 కి.మీ. పరిధిలో ఉండే వాహనదారులకు అమలు చేస్తున్న ప్రత్యేక రాయితీ పాస్ కేవలం ఫాస్టాగ్ వారికి మాత్రమే వర్తించేలా మార్చేశారు.
నేషనల్ హైవేపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద 25 శాతం లేన్లు నగదు చెల్లింపునకు వీలుగా ఉండేది. వీటిల్లో ఫాస్టాగ్ వాహనాలతో పాటు..నగదు చెల్లించే వాహనాలు వెళ్లేవి. 2020, జనవరి 14వ తేదీ అర్దరాత్రితో దీని గడువు ముగిసింది. 2020, జనవరి 15వ తేదీ నుంచి టోల్ ప్లాజాల వద్ద ఒక్కో వైపు ఒక్కో లైన్ మాత్రమే నగదు చెల్లింపునకు కేటాయించారు. రాష్ట్రంలో 17 ప్రాంతాల్లో ఉన్న టోల్ ప్లాజాలో 15 చోట్ల ఇదే విధానం అమల్లోకి వచ్చింది. పంతంగి టోల్ ప్లాజా, రాయికల్ టోల్ ప్లాజాలను దీని నుంచి మినహాయించారు.
Read More : వారికి మాత్రమే : ఒక్క ప్రోటీన్ సప్లిమెంట్ తీసుకొంటే చాలు