National Pension System : ఎన్‌పీఎస్ ఖాతాదారుడు మరణిస్తే నామినీకి పెన్షన్ వస్తుందా? లేదా? ఈ రూల్స్ తప్పక తెలుసుకోండి!
National Pension System : ఎన్‌పీఎస్ ఖాతాదారుడు మరణిస్తే.. ఆ మొత్తాన్ని నామినీకి చెల్లిస్తారు. ఎన్పీఎస్ కార్పస్‌లో 100 శాతం చెల్లింపు ఉంటుంది. నామినీ కోరుకుంటే, ఒకేసారి డబ్బులను తీసుకోవచ్చు లేదా పెన్షన్ రూపంలో కూడా పొందవచ్చు.

National Pension System
National Pension System : పదవీ విరమణ తర్వాత ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. ఇందుకోసం ఉద్యోగం చేస్తున్న సమయంలోనే పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి. ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ పెన్షన్ పథకం (National Pension System)లో పెట్టుబడి పెట్టడం ద్వారా రిటైర్మెంట్ ప్లాన్ చేయవచ్చు.
Read Also : SIP చేస్తున్నారా? చేద్దామనుకుంటున్నారా? ఎంతకాలం చేయాలో తెలుసుకోండి..!
ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2004 సంవత్సరంలో ప్రారంభించింది. అయితే, ఎన్‌పీఎస్ పథకం కింద పెట్టుబడి పెట్టిన ఖాతాదారులు ఎవరైనా మరణిస్తే ఆ మొత్తానికి సంబంధించి పెన్షన్ నామినీకి లబిస్తుందా? లేదా అనేది అందరిలో డౌట్ ఉంటుంది. నామినీ ఎంతవరకు లభిస్తుంది? అందుకు ఏం చేయాలి? నామినీ లేకపోతే ఏ విధంగా డబ్బు మొత్తాన్ని పొందవచ్చు అనేది వివరంగా తెలుసుకుందాం.
పెట్టుబడి ఆప్షన్లు ఇవే :
ఎన్‌పీఎస్‌లో రెండు విధాలుగా పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో మొదటిది టైర్-1 ఆప్షన్. ఇది రిటైర్మెంట్ అకౌంట్. అదేవిధంగా, మరొకటి టైర్-2 ఇది స్వచ్ఛంద అకౌంట్. మొత్తం పెట్టుబడి మొత్తంలో దాదాపు 60 శాతం పదవీ విరమణ తర్వాత అంటే.. 60 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత ఉపయోగించుకోవచ్చు. మిగిలిన 40 శాతం యాన్యుటీగా ఉపయోగించవచ్చు.
ఎన్ పీఎస్ ఖాతాదారుడు మరణిస్తే ఏం చేయాలి? :
ఒకవేళ ఎన్‌పీఎస్ ఖాతాదారుడు పదవీ విరమణకు ముందే మరణిస్తే ఏమి జరుగుతుంది? చట్టబద్ధమైన వారసుడికి పెన్షన్ ప్రయోజనం లభిస్తుందా? ఖాతాదారుడు ఎవరినీ నామినీగా చేయకపోతే ఏమి జరుగుతుంది? అంటే.. ఎన్‌పీఎస్ కింద నిష్క్రమణ, ఉపసంహరణ కింద ఎన్‌పీఎస్ ఖాతాదారుడు మరణిస్తే.. ఆ మొత్తాన్ని నామినీకి చెల్లిస్తారు.
అంటే.. ఎన్‌పీఎస్ కార్పస్‌లో 100శాతం చెల్లిస్తారు. నామినీ కోరుకుంటే.. ఒకేసారి డబ్బులను తీసుకోవచ్చు లేదా పెన్షన్ రూపంలో కూడా పొందవచ్చు. ఇలాంటి పరిస్థితిలో, నామినీ యాన్యుటీ సర్వీస్ ప్రొవైడర్ డెత్ విత్‌డ్రాయల్ ఫారమ్‌ను నింపి యాన్యుటీ సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంచుకోవాలి.
నామినీ లేకపోతే ఏం చేయాలి? :
ఎన్‌పీఎస్ ఖాతాదారుడు తన నామినీని ఇంకా నియమించకపోతే, ఇలాంటి పరిస్థితిలో అకౌంట్లో జమ చేసిన మొత్తాన్ని చట్టపరమైన వారసుడికి లేదా కుటుంబంలోని ఏ సభ్యునికి అయినా ఇవ్వడం జరుగుతుంది.
ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి :
ఎన్‌పీఎస్ (NPS) అకౌంటులో నామినీ లేకపోతే, కుటుంబ సభ్యులు వారసత్వ ధృవీకరణ పత్రాన్ని చూపించాలి. ఆ తరువాత, ఈ సర్టిఫికెట్‌ను రెవెన్యూ శాఖకు సమర్పించాలి. ధృవీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఖాతాలో జమ చేసిన మొత్తం చట్టపరమైన వారసులకు అందుతుంది.
వారసుడు తన కుటుంబ సభ్యులలో ఎవరికైనా (NPS) అకౌంట్ నుంచి డబ్బును ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంటే, అతను/ఆమె మరణ ఉపసంహరణ ఫారమ్‌ను నింపాలి. ఈ ఫారమ్ అధికారిక వెబ్‌సైట్ (www.npscra.nsdl.co.in) నుంచి అందుబాటులో ఉంటుంది. ఫారమ్ నింపడానికి వారసుడి ధృవీకరణ పత్రం, కేవైసీ డాక్యుమెంట్లు, మరణ ధృవీకరణ పత్రం, బ్యాంక్ అకౌంట్ ప్రూఫ్ మొదలైన డాక్యుమెంట్లు అవసరం.