Flipkart Smartphone Sale : ఈ 5 స్మార్ట్‌ఫోన్ల ధరలు మళ్లీ తగ్గాయోచ్.. మీకు నచ్చిన ఫోన్ ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!
Flipkart Smartphone Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో టాప్ 5 స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన డీల్స్ పొందవచ్చు. ఏయే ఫోన్లపై ఎంత డిస్కౌంట్ అందుబాటులో ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

Flipkart Gadgets Sale
Flipkart Smartphone Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ఇదే సరైన సమయం. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. వాస్తవానికి, ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart Sale Offers) మరోసారి కొత్త ఆఫర్లను తీసుకొచ్చింది.
ప్రత్యేకించి స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. గూగుల్‌తో సహా వివిధ బ్రాండ్‌ల నుంచి టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని వెంటనే కొనేసుకోండి. ఆఫర్ల గురించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
నథింగ్ ఫోన్ (2a) :
కొత్త నథింగ్ ఫోన్ (3a) త్వరలో లాంచ్ కానుంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు ముందు నథింగ్ ఫోన్ (2a) ధర తక్కువగా ఉండేది. ఈ ఫోన్‌ను మొదట కంపెనీ రూ. 25,999కు లాంచ్ చేసింది. కానీ, ఇప్పుడు కేవలం రూ. 21,999కు అందుబాటులో ఉంది. ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్లతో మీరు ఫోన్ ద్వారా రూ. 2వేల వరకు ఆదా చేసుకోవచ్చు. తద్వారా ఈ ఫోన్ ధరను మరింత తగ్గించవచ్చు.
గూగుల్ పిక్సెల్ 8 :
గూగుల్ పిక్సెల్ 8 ఫోన్ ఇప్పుడు రూ.26వేల వద్ద తక్కువ ధరకు అమ్మకానికి ఉంది. ఈ జాబితాలో గూగుల్ ఫోన్ రెండోది. ఈ పిక్సెల్ 8 ఫోన్ మొదట రూ.75,999కు లాంచ్ అయింది. కానీ, ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.49,999 మాత్రమే. అదనంగా, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్ రూ.3వేలు సేవ్ చేయొచ్చు. అదనంగా, మీ పాత ఫోన్ క్వాలిటీని బట్టి ప్రత్యేక ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో రూ.10వేల వరకు ఆదా చేసుకోవచ్చు.
రెడ్‌మి నోట్ 13 ప్రో 5జీ :
ఫ్లిప్‌కార్ట్ గాడ్జెట్ డిస్కౌంట్లలో రెడ్‌మి ఫోన్‌లపై కూడా భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ 5జీ ఫోన్ మొదట రూ.30,999 ధరకు మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఫోన్ రూ.21,999కే అందుబాటులో ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. మీరు ఫోన్ ద్వారా నేరుగా రూ.9వేల తగ్గింపు పొందవచ్చు. మీ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకుంటే ఫోన్ ద్వారా 5శాతం వరకు అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
Read Also : Resume Tips : మీ రెజ్యూమ్ ఇలా రెడీ చేయండి.. మీకు జాబ్ పక్కా.. కానీ, ఈ 6 మిస్టేక్స్ అసలు చేయొద్దు..!
ఒప్పో K12x 5జీ :
ఫ్లిప్‌కార్ట్ ఒప్పో ఫోన్‌లపై డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ఈ ఫోన్‌ను మొదట కంపెనీ రూ.16,999కి లాంచ్ చేసింది. కానీ, ఇప్పుడు ఈ ఫోన్ కేవలం రూ.12,999కే అందుబాటులో ఉంది. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్‌ను ఎంచుకుంటే రూ.1200 వరకు డబ్బులు ఆదా చేసుకోవచ్చు. మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్ బట్టి ఎక్స్ఛేంజ్‌పై మీరు అద్భుతమైన డీల్‌ను కూడా పొందవచ్చు.
రియల్‌మి P2 ప్రో 5జీ :
రియల్‌మి 5జీ ఫోన్ కొత్త మోడల్‌ను కంపెనీ త్వరలో లాంచ్ చేయబోతుంది. అయితే, ప్రస్తుతం ఈ P2 ప్రో 5జీ ఫోన్‌పై డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఫోన్‌ను మొదట కంపెనీ రూ. 27,999 లాంచ్ చేసింది. కానీ, ఇప్పుడు ఈ ఫోన్ కేవలం రూ. 19,999కు అందుబాటులో ఉంది. మీరు ఒకవేళ Buy More, Save More అనే ఆప్షన్ ఎంచుకుంటే మీరు అదనంగా వెయ్యి రూపాయలు తగ్గింపును పొందవచ్చు.