OnePlus 13R Price : వావ్.. క్రేజీ డీల్ గురూ.. భారీగా తగ్గిన వన్‌ప్లస్ 13R ఫోన్.. ఈ స్పెషల్ డీల్ డోంట్ మిస్..!

OnePlus 13R Price : అతి తక్కువ ధరకు వన్‌ప్లస్ 13R ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్.. ఇన్‌స్టామార్ట్‌లో రూ.38,999కి లభ్యమవుతోంది.

OnePlus 13R Price : వావ్.. క్రేజీ డీల్ గురూ.. భారీగా తగ్గిన వన్‌ప్లస్ 13R ఫోన్.. ఈ స్పెషల్ డీల్ డోంట్ మిస్..!

OnePlus 13R Price

Updated On : June 20, 2025 / 11:11 PM IST

OnePlus 13R Price : సరసమైన ధరలో కొత్త ఫోన్ కావాలా? మీ బడ్జెట్‌ ధరలోనే ఫ్లాగ్‌షిప్ లెవల్ ఫీచర్లతో (OnePlus 13R Price) కొనేసుకోవచ్చు. వన్‌ప్లస్ 13R అతి తక్కువ ధరకే లభ్యమవుతోంది.

ఈ ఏడాది ప్రారంభంలో వన్‌ప్లస్ 13తో పాటు వన్‌ప్లస్ 13R ఫోన్ లాంచ్ అయింది. ప్రీమియం డిజైన్, ఫాస్ట్ పర్ఫార్మెన్స్, ఆకర్షణీయమైన కెమెరా సెటప్‌తో ఆకట్టుకుంటోంది. ఇప్పుడు, స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్‌ ద్వారా స్పెషల్ డీల్ అందిస్తోంది.

Read Also : PM Kisan : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. 20 విడత డబ్బులు పడాలంటే ఆధార్‌తో e-KYC ఇలా చేయండి..!

వన్‌ప్లస్ 13Rపై భారీ డిస్కౌంట్ :
వన్‌ప్లస్ 13R ఫోన్ (12GB ర్యామ్ + 256GB స్టోరేజ్) నెబ్యులా నోయిర్ వేరియంట్‌లో రూ.44,999 ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం ఇన్‌స్టామార్ట్‌లో ఈ ఫోన్ రూ.6వేలు తగ్గింపుతో రూ.38,999 ధరకు లిస్ట్ అయింది.

ఆర్బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలుదారులు అదనంగా రూ.5వేలు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. దాంతో ధర కేవలం రూ.33,999కి తగ్గుతుంది. మొత్తం రూ. 11వేలు ఆదా అవుతుంది.

వన్‌ప్లస్ 13R స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ 13R ఫోన్ (OnePlus 13R Price) 6.78-అంగుళాల 1.5K LTPO 4.1 అమోల్డ్ డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 2 వైపులా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7iతో ప్రొటెక్షన్ అందిస్తుంది.

వన్‌ప్లస్ 13R ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌తో వస్తుంది. గేమింగ్ చేస్తున్నా, మల్టీ టాస్కింగ్ చేస్తున్నా లేదా వీడియోలను ఎడిట్ చేస్తున్నా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. వన్‌ప్లస్ 13R 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ 50MP మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్, 50MP టెలిఫోటో లెన్స్‌ కలిగి ఉంది. అన్ని లైటింగ్ కండిషన్లలో అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు.

Read Also : Samsung Galaxy S23 Ultra 5G : అమెజాన్ ఆఫర్ అదుర్స్.. ఈ శాంసంగ్ 5G ఫోన్ ధర భారీగా తగ్గిందోచ్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

సెల్ఫీ ప్రియుల కోసం 16MP ఫ్రంట్ షూటర్‌ కలిగి ఉంది. పోర్ట్రెయిట్‌లు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 15పై వన్‌ప్లస్ 13R ఫోన్ 4 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ అందిస్తుంది. IP65 రేటింగ్ కలిగి ఉంది.