Oppo Reno 13 5G Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఒప్పో రెనో 13జీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఈ ఫోన్ ధర, స్పెషిఫికేషన్లు ఇవే..!
Oppo Reno 13 5G Launch : ఒప్పో రెనో 13ప్రో 5జీ సిరీస్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, ఒప్పో స్టోర్ ద్వారా జనవరి 11, 12 గంటల నుంచి అమ్మకానికి వస్తాయి.

Oppo Reno 13 5G And Pro 5G
Oppo Reno 13 5G Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారత మార్కెట్లో ఒప్పో రెనో 13 5జీ, ఒప్పో రెనో 13ప్రో 5జీ లాంచ్ అయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్‌లు చైనాలో అరంగేట్రం చేసిన 2 నెలల తర్వాత మార్కెట్లోకి వచ్చాయి. ఈ కొత్త రెనో సిరీస్ హ్యాండ్‌సెట్‌లు మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌తో రన్ అవుతాయి. 50ఎంపీ సెల్ఫీ షూటర్‌లను కలిగి ఉంటాయి.
ఒప్పో రెనో 13ప్రో 5జీ ఫోన్ సోనీ ఐఎమ్ఎక్స్890 ప్రైమరీ కెమెరా నేతృత్వంలోని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అయితే, వనిల్లా మోడల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. 80డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తాయి. సిగ్నల్‌బూస్ట్ ఎక్స్1 చిప్‌తో అమర్చి ఉంటాయి.
Read Also : Oppo Find X8 Mini : ఒప్పో ఫైండ్ X8 మినీ స్పెషిఫికేషన్లు లీక్..!
ఒప్పో రెనో 13 5జీ, రెనో 13ప్రో 5జీ ధర ఎంతంటే? :
ఒప్పో రెనో 13ప్రో 5జీ ఫోన్ 12జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ వెర్షన్ ప్రారంభ ధర రూ. 49,999, 12జీబీ + 512జీబీ వేరియంట్ ధర రూ. 54,999కు పొందవచ్చు. గ్రాఫైట్ గ్రే, మిస్ట్ లావెండర్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఒప్పో రెనో 13 5జీ ఫోన్ బేస్ 8జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ. 37,999, 8జీబీ+ 256జీబీ ఆప్షన్ ధర రూ. 39,999కు పొందవచ్చు. ఈ ఒప్పో ఫోన్ 2 మోడల్‌లు ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఆన్‌లైన్ స్టోర్ ద్వారా జనవరి 11, 12 గంటల నుంచి అమ్మకానికి వస్తాయి.
ఒప్పో రెనో 13 5జీ, ఒప్పో రెనో 13ప్రో 5జీ స్పెసిఫికేషన్లు :
డ్యూయల్ సిమ్ (నానో) ఒప్పో రెనో 13 5జీ సిరీస్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా కలర్ఓఎస్ 15పై రన్ అవుతుంది. ఒప్పో ప్రో మోడల్‌లో 6.83-అంగుళాల 1.5కె (1,272×2,800 పిక్సెల్‌లు) డిస్‌ప్లే 120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్‌తో 450పీపీఐ పిక్సెల్ డెన్స్‌నెస్ 120నిట్ బ్రైట్‌నెస్‌తో ఉంటుంది. స్టాండర్డ్ మోడల్ కొంచెం చిన్న 6.59-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+(1,256×2,760 పిక్సెల్‌లు) అమోల్డ్ స్క్రీన్‌ను 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 460పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1,200నిట్స్ గరిష్ట ప్రకాశంతో వస్తుంది.

Oppo Reno 13 5G Launch
ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్‌ని కలిగి ఉంది. ఒప్పో రెనో 13 5జీ ఫోన్ డ్యూయల్ 4ఎన్ఎమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 12జీబీ ఎల్‌పీపీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 3 స్టోరేజ్‌తో వస్తుంది. రెండు మోడల్స్ 50ఎంపీ సెల్ఫీ కెమెరాను కలిగి ఉన్నాయి. ఒప్పో ప్రో మోడల్ ట్రిపుల్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది.
ఇందులో 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్890 1/1.56-అంగుళాల ప్రైమరీ కెమెరా ఓఐఎస్, 50ఎంపీ జేఎన్5 టెలిఫోటో సెన్సార్ 3.5ఎక్స్ ఆప్టికల్ జూమ్, 120ఎక్స్ వరకు డిజిటల్ జూమ్, ఓఐఎస్, ఓవీ08డీ సెన్సార్ ఉన్నాయి. ప్రామాణిక ఒప్పో రెనో 13 5జీ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఓఐఎస్‌తో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి.
ఒప్పో రెనో 13 5జీ సిరీస్‌లోని కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.4, జీపీఎస్ యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ66+ఐపీ68+ఐపీ69 రేటింగ్‌లను కలిగి ఉంది. ఒప్పో X1 నెట్‌వర్క్ చిప్‌ను కలిగి ఉంది.
మెరుగైన సిగ్నల్ కవరేజీని అందిస్తుంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఒప్పో రెనో 13ప్రో 80డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,800mAh బ్యాటరీని కలిగి ఉంది. కొలతలు పరంగా 162.73×776.55×7.55ఎమ్ఎమ్, 195 గ్రాముల బరువు ఉంటుంది. వెనిలా మోడల్ 5,600mAh బ్యాటరీని 80డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది.
Read Also : OnePlus 13 First Sale : వన్‌ప్లస్ 13 ఫస్ట్ సేల్ మొదలైంది.. భారత్‌లో ఈ ఫోన్ ధర ఎంతంటే?