Oppo Find X8 Mini : ఒప్పో ఫైండ్ X8 మినీ స్పెషిఫికేషన్లు లీక్..!
Oppo Find X8 Mini : అధికారిక లాంచ్‌కు ముందే ఒప్పో ఫైండ్ ఎక్స్8 మినీ ఫోన్ స్పెసిఫికేషన్‌లను లీక్ చేసింది. ట్రిపుల్ రియర్ కెమెరాని కలిగి ఉంది.

Oppo Find X8 Mini Specifications Leaked
Oppo Find X8 Mini Specifications Leak : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? గ్లోబల్ మార్కెట్లోకి గత ఏడాది నవంబర్‌లో ఒప్పో ఫైండ్ ఎక్స్8, ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో లాంచ్ అయ్యాయి. ఇప్పుడు, వివో ఎక్స్200ప్రో మినీ మాదిరిగా ఒప్పో ఫైండ్ ఎక్స్8 మినీని కంపెనీ ఫైండ్ ఎక్స్8 సిరీస్‌లో మూడో ఫోన్ లాంచ్ అయ్యేందుకు కంపెనీ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.
అధికారిక లాంచ్‌కు ముందే చైనీస్ టిప్‌స్టర్ ఈ ఫోన్ ముఖ్య స్పెసిఫికేషన్‌లను రివీల్ చేసింది. ఒప్పో ఫైండ్ ఎక్స్8 మినీ ఒక మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌లో రన్ అవుతుందని అంచనా. 6.31-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి.
Read Also : Moto G05 : కొత్త మోటో జీ05 ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?
ఒప్పో ఫైండ్ ఎక్స్8 మినీ స్పెసిఫికేషన్‌లు (లీక్) :
టిప్‌స్టర్ ప్రకారం.. ఒప్పో ఫైండ్ ఎక్స్8 మినీ స్పెసిఫికేషన్‌లను షేర్ చేసింది. పోస్ట్ ప్రకారం.. ఈ హ్యాండ్‌సెట్ 1.5కె రిజల్యూషన్‌తో 6.31-అంగుళాల ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. హుడ్ కింద మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ఎస్ఓసీతో వస్తుంది. ఇదే చిప్‌సెట్ ఇప్పటికే ఉన్న ఫైండ్ ఎక్స్8, ఫైండ్ ఎక్స్8 ప్రో మోడల్‌లకు పవర్ అందిస్తుంది.
ఒప్పో ఎక్స్8 మినీ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ని కలిగి ఉంది. ఇందులో సోనీ ఐఎమ్ఎక్స్9 సిరీస్ ప్రైమరీ సెన్సార్ కూడా ఉంది. 50ఎంపీ ‘హై-క్వాలిటీ’ పెరిస్కోప్ జూమ్ కెమెరా, అథెంటికేషన్ కోసం ఆప్టికల్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. రాబోయే ఫోన్ మెటల్ మిడిల్ ఫ్రేమ్, గ్లాస్ బాడీని కలిగి ఉంటుందని చెబుతున్నారు. వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు కూడా అందించనుంది.

Oppo Find X8 Mini Specification
ఒప్పో ఫైండ్ ఎక్స్8 మిని ఫైండ్ ఎక్స్8 అల్ట్రాతో పాటు మార్చిలో రావొచ్చునని గత లీక్‌లు సూచించాయి. ఒప్పో చైనా-ప్రత్యేకమైన వివో ఎక్స్200 ప్రో మినీకి ప్రత్యక్ష పోటీదారుగా హ్యాండ్‌సెట్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.
ఒప్పో ఫైండ్ ఎక్స్8, ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో ఇప్పటికే నవంబర్ 2024 నుంచి భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ ప్రారంభ ధర వరుసగా రూ. 69,999 రూ. 99,999 కు అందుబాటులో ఉన్నాయి.
ఆండ్రాయిడ్ 15-ఆధారిత కలర్ఓఎస్ 15పై రన్ అవుతాయి. 16జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 ఇన్‌బిల్ట్ స్టోరేజీని కలిగి ఉంటాయి. ఎల్టీపీఓ అమోల్డ్ స్క్రీన్‌లను కలిగి ఉండొచ్చు.
వనిల్లా ఒప్పో ఫైండ్ ఎక్స్8 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ-700 సెన్సార్ నేతృత్వంలోని ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇంతలో, ఒప్పో ఫైండ్ ఎక్స్8ప్రో 50ఎంపీ ఎల్‌వైటీ-808 సెన్సార్‌తో కూడిన క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
Read Also : iOS 18.2.1 Update : ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. ఐఓఎస్ 18.2.1 రిలీజ్