అదిరిపోయే ఫీచర్లు : Oppo Reno 2 సిరీస్ ప్రీ-ఆర్డర్ సేల్ 

  • Published By: sreehari ,Published On : August 29, 2019 / 01:51 PM IST
అదిరిపోయే ఫీచర్లు : Oppo Reno 2 సిరీస్ ప్రీ-ఆర్డర్ సేల్ 

Updated On : August 29, 2019 / 1:51 PM IST

చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ ఒప్పో నుంచి రెనో 2 సిరీస్ మోడల్ స్మార్ట్ ఫోన్లపై ప్రీ ఆర్డర్ సేల్ మొదలైంది. ఆగస్టు 28న ఇండియన్ మార్కెట్లో ఒప్పో ఈ మూడు కొత్త రెనో 2 సిరీస్ స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఒప్పో రెనో 2, ఒప్పో రెనో 2Z, ఒప్పో రెనో 2ZF. ఒప్పో కంపెనీ అందించే సరికొత్త స్మార్ట్ ఫోన్లలో రెనో 2Z స్మార్ట్ ఫోన్ ఒకటి.

దీని ధర రూ.29వేల 990గా ఉంది. ఈ ఫోన్ 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్. ఇది స్కై వైట్, ల్యుమినస్ బ్లాక్ రెండు కలర్లలో లభిస్తోంది. ఒప్పో రెనో 2Z స్మార్ట్ ఫోన్ ప్రీ ఆర్డర్ సేల్ ఈ కామర్స్ వెబ్ పోర్టల్స్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్, పేటీఎం మాల్, స్నాప్ డీల్ సహా ఇతర ఆన్ లైన్ స్టోర్లలో లభ్యం కానుంది. 

ఒప్పో రెనో 2z ఫీచర్లలో 6.53 అంగుళాల Full HD+ (1080×2340 ఫిక్సల్స్) డిస్‌ప్లేతో పాటు క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా 48MP IMX586 సెన్సార్ కూడా ఉంది. 119 డిగ్రీల 8MP సెన్సార్ సపోర్ట్ చేసేలా ఉంది. ప్రొర్టరైట్ ఫొటోగ్రఫీకి 2MP పెయిర్ సెన్సార్లు ఉన్నాయి.

ఈ ఫోన్‌లో MediaTek Helio P90 SoCతో పాటు 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్ ఉంది. ఒప్పో రెనో 2z, ఒప్పో రెనో 2 మాదిరిగా 4000mAh బ్యాటరీతో పాటు VOOC 3.0 ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంది. 

Oppo Reno 2 : 
* ఒప్పో రెనో 2 హై ఎండ్ వెర్షన్. 
* 6.55 అంగుళాల AMOLED నాచ్ లెస్ డిస్ ప్లే 
* స్నాప్ డ్రాగన్ 730G ఆక్టా కోర్ SoC పవర్ 
* 8GB ర్యామ్ 
* 48MP ప్రైమరీ కెమెరా 
* 13MP, 8MP, 2MP సెన్సార్లు 

Oppo Reno 2F :  

* 6.53  అంగుళాల ఫుల్ HD+ (1080×2340 ఫిక్సల్స్)
* 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజీ
* 48MP శాంసంగ్ GM1 సెన్సార్
* 8MP కెమెరా, 119 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ
* 2 డ్యుయల్ 2MP సెన్సార్లు (పోర్టరైట్ ఫొటోగ్రఫీ)