PPBL Deadline : పేటీఎం యూజర్లకు అలర్ట్.. మార్చి 15 నుంచి ఏది పనిచేయదు? ఏది చేయొచ్చు? ఫాస్ట్‌ట్యాగ్స్, యూపీఐ, వ్యాలెట్ల పరిస్థితి ఏంటి?

Paytm Payments Bank : పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ డెడ్‌లైన్ దగ్గరపడింది. ఈ నెల 15 నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంకు సర్వీసులు నిలిచిపోనున్నాయి. అయితే, ఇందులో కస్టమర్ అకౌంట్లు, వ్యాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, డిపాజిట్లు లేదా టాప్-అప్‌లను అంగీకరించదు.

PPBL Deadline : పేటీఎం యూజర్లకు అలర్ట్.. మార్చి 15 నుంచి ఏది పనిచేయదు? ఏది చేయొచ్చు? ఫాస్ట్‌ట్యాగ్స్, యూపీఐ, వ్యాలెట్ల పరిస్థితి ఏంటి?

Paytm Payments Bank closes on March 15: What will work and what won't, what about FASTags, UPI and wallet?

Paytm Payments Bank : పేటీఎం పేమెంట్స్ బ్యాంకు యూజర్లకు అలర్ట్.. పేటీఎం సర్వీసులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విధించిన డెడ్‌లైన్ మార్చి 15తో ముగియనుంది. అయితే, పేటీఎం యూజర్లు తమ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (PPBL) డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు, ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్‌ల వంటి సర్వీసుల నుంచి మార్చి 15 నుంచి వినియోగించలేరు. నిబంధనలను పాటించకపోవడం, పర్యవేక్షక సమస్యలే నిషేధానికి కారణమని ఆర్‌బీఐ పేర్కొంది. గడువు ముగిసిన అనంతరం పీటీఎం సర్వీసుల్లో ఏయే సర్వీసులు పనిచేస్తాయి? ఏవి పనిచేయవు? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాష్ డిపాజిట్ : మార్చి 15 నుంచి పేటీఎం యూజర్లు తమ పీపీబీఎల్ అకౌంట్లలో క్యాష్ డిపాజిట్ చేయలేరు. మీ అకౌంట్ ఉపయోగించి శాలరీ క్రెడిట్‌లు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సాక్షన్స్ లేదా సబ్సిడీలు కూడా నిలిచిపోతాయి.

యూపీఐ సర్వీసులు : మార్చి 15 నుంచి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)ని ఉపయోగించలేరు.

Read Also : Paytm FAQs : పేటీఎం యూజర్లకు అలర్ట్.. మార్చి 15 తర్వాత ఏ సర్వీసు పనిచేస్తుంది? ఏది పనిచేయదంటే? అన్ని ప్రశ్నలకు సమాధానాలివే!

ఐఎమ్‌పీఎస్ : మార్చి 15 నుంచి పేటీఎం కస్టమర్‌లు తమ పీపీబీఎల్ అకౌంట్ల ద్వారా ఇన్‌స్టంట్ పేమెంట్ సర్వీసు (IMPS) ఫంక్షన్‌ను కూడా ఉపయోగించలేరు.

విత్ డ్రా, మనీ ట్రాన్స్‌ఫర్ : పార్టనర్ బ్యాంకుల నుంచి రీఫండ్‌లు, క్యాష్‌బ్యాక్‌లు ప్రాసెస్ చేయొచ్చు. మీరు పీపీబీఎల్ అకౌంట్ల నుంచి డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. ఆపై ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.

పేటీఎం వ్యాలెట్ : మార్చి 15 తర్వాత పీపీబీఎల్ వ్యాలెట్లను టాప్-అప్, లావాదేవీల కోసం ఉపయోగించలేరు. మీ పేటీఎం వ్యాలెట్లలో ఇప్పటికే జమ చేసిన నగదును లావాదేవీలు, చెల్లింపుల కోసం ఉపయోగించవచ్చు.

ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్ : పీపీబీఎల్ జారీ చేసిన ఫాస్ట్‌ట్యాగ్‌లను రీఛార్జ్ చేయలేరు. మరో బ్యాంక్ జారీ చేసిన కొత్త ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అడ్వైజరీలో పేర్కొంది.

ఎన్‌సీఎంసీ కార్డ్‌లు : పీపీబీఎల్ ద్వారా జారీ చేసిన నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్‌లలో (NCMC) కార్డుల ద్వారా గడువు తేదీ తర్వాత ఎలాంటి లావాదేవీలను జరుపలేరు. అందులో ప్రధానంగా మొబైల్ రీఛార్జ్ లేదా ఇతర టాప్-అప్ ఫండ్‌లను కూడా యాడ్ చేయలేరు.

మర్చంట్స్ లావాదేవీల కోసం : పేటీఎం (Paytm QR) కోడ్, పేటీఎం సౌండ్‌బాక్స్ లేదా పేటీఎం PoS (పాయింట్-ఆఫ్-సేల్) టెర్మినల్‌ని ఉపయోగించి చెల్లింపులను అంగీకరించే వ్యాపారులు లేదా మర్చంట్స్ మార్చి 15 తర్వాత కూడా పీపీబీల్ బ్యాంకు అకౌంట్ మినహా ఇతర బ్యాంక్ అకౌంట్లకు లింక్ చేసి ఉంటే నగదు బదిలీలను ఎప్పటిలానే ఉపయోగించవచ్చు.

ఫాస్ట్ ట్యాగ్ జారీ చేసే అధీకృత బ్యాంకులివే :
అయితే, మొత్తం 39 బ్యాంకుల్లో ఎన్‌బీఎఫ్‌సీలను కలిగిన ఫాస్ట్‌ట్యాగ్‌లను జారీ చేయగల అధీకృత బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (NBFC) జాబితాను ఎన్‌హెచ్ఏఐ అప్‌డేట్ చేసింది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్, బంధన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యెస్ బ్యాంక్‌లు ఈ జాబితాలో ఉన్నాయి.

పెట్టుబడిదారులతో బీఎస్ఈ చెప్పిందంటి? :
పీపీబీఎల్ అకౌంట్‌కు బదులుగా ఇతర బ్యాంకుల్లో ఓపెన్ చేసిన అకౌంట్లతో రిజిస్టర్ చేసుకోవాలని బీఎస్ఈ పెట్టుబడిదారులకు తెలిపింది. ఈ పరిమితులు కేవలం పీపీబీఎల్ బ్యాంకు అకౌంట్లను మాత్రమే రిజిస్టర్ చేసుకున్న ఇన్వెస్టర్ల సెక్యూరిటీల మార్కెట్ లావాదేవీలపై ప్రభావం ఉంటుందని పెట్టుబడిదారులకు తెలియజేసింది.

Read Also : Samsung Galaxy A Series 5G : శాంసంగ్ నుంచి రెండు సరికొత్త A సిరీస్ 5జీ ఫోన్లు.. ఫీచర్లు అదుర్స్.. ఏ ఫోన్ ధర ఎంతంటే?