వాహనదారులకు బ్యాడ్ న్యూస్ : ఏప్రిల్ నుంచి పెట్రోల్ రేట్ల పెరుగుదల

వాహనదారులకు బ్యాడ్ న్యూస్. పెట్రోల్ రేట్లు పెరగబోతున్నాయి. ఇప్పటికే పెరుగుతున్న ధరలతో సతమతమౌతుంటే..మళ్లీ ఈ బాదుడేంది ? అంటున్నారా ? కానీ ఇది నిజమే. ఏప్రిల్ 01 నుంచి ధరలు పెరగబోతున్నట్లు వ్యాపారనిపుణులు వెల్లడిస్తున్నారు. కొన్ని రోజులుగా ఏదో తగ్గుతున్న రేట్లు..మరికాస్తా తగ్గుతాయని అనుకుంటే..ఈ చేదు వార్త ఏంటీ అని దిగాలు చెందుతున్నారు కొంతమంది. దీనికంతటికి కారణం BS-6 ఇంధనం.
ప్రస్తుతం యూరో -4 లేదా భారత్ స్టేజ్ (BS-6) ఇంధానాన్ని వాడుతున్నాం. BS-6 వాహనాలు అందుబాటులో వచ్చినప్పటి నుంచి BS-4 గ్రేడ్ పెట్రోల్, డీజిల్ వినియోగించడం జరుగుతోంది. కానీ కాలుష్యం మాత్రం కంట్రోల్ కావడం లేదు. దీంతో మోదీ సర్కార్ ఏప్రిల్ 01 నుంచి దేశ వ్యాప్తంగా BS – 6 ఇంధనాన్ని అందుబాటులోకి రానుంది. ఇధిలా ఉంచితే…BS – 6 ఇంధన ఉత్పత్తి కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీంతో ఏప్రిల్ 01 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలకు మరలా రెక్కలు వస్తాయని, పెరుగుదల లీటర్‌కు 50 పైసల నుంచి ఒక రూపాయి మధ్య ఉండే అవకాశం ఉందని అంచాన వేస్తున్నారు.
శుద్ధి కర్మగారాలను అప్ గ్రేడ్ చేయడానికి ఇప్పటి వరకు దాదాపు రూ. 17 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు IOC కంపెనీ ఛైర్మన్ సంజీవ్ సింగ్ వెల్లడించారు. ప్రభుత్వ శుద్ధి కర్మాగారాలను అప్ గ్రేడ్ చేయడానికి ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలు డబ్బులు ఖర్చు పెట్టాయన్నారు. మార్చి 01వ తేదీ నుంచి కొత్త ఇంధనాలు మాత్రమే సప్లై అవుతాయన్నారు. ధరల పెరుగుదల వినియోగదారులపై అంతగా ఉండదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
యూరో 6 గ్రేడ్ ఇంధనం అత్యంత శుద్ధి చేసింది కావడంతో కాలుష్య కారకాలు ఉత్పన్నం కాబోవని అంచనా. దేశ రాజధాని ఢిల్లీతో పాటు..అన్ని ప్రధాన నగరాల్లో వాహన కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో..BS-6 రాకతో సమస్యకు అడ్డుకట్ట వేసినట్లవుతుంది. అందుకే BS -6 ఇంధన ఉత్పత్తిని ముందుకు తీసుకొచ్చారు.
Read More | Delhi Riots : చిన్న ఆస్పత్రి ఎన్నో ప్రాణాలను నిలబెట్టింది