అప్పుడుంటది మీకు : ఎలక్షన్స్ తర్వాత పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

దేశంలో ఇంధన ధరలు కొన్ని నెలల నుంచి ఎందుకు స్థిరంగా ఉంటున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలకు డిమాండ్ ఉన్నప్పటికీ దేశీయ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి.

  • Published By: sreehari ,Published On : May 7, 2019 / 02:11 PM IST
అప్పుడుంటది మీకు : ఎలక్షన్స్ తర్వాత పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

Updated On : May 7, 2019 / 2:11 PM IST

దేశంలో ఇంధన ధరలు కొన్ని నెలల నుంచి ఎందుకు స్థిరంగా ఉంటున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలకు డిమాండ్ ఉన్నప్పటికీ దేశీయ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి.

దేశంలో ఇంధన ధరలు కొన్ని నెలల నుంచి ఎందుకు స్థిరంగా ఉంటున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలకు డిమాండ్ ఉన్నప్పటికీ దేశీయ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. మార్చి 11, 2019 నుంచి పెట్రోల్ ధరలు చాలా తక్కువ శాతం పెరిగాయి. మార్చి 10కి ముందు రెండు నెలలతో పోలిస్తే 1 శాతం కంటే తక్కువగా పెట్రోల్ ధరలు పెరిగాయి. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఏడు దశల పోలింగ్ షెడ్యూల్ ప్రకటించింది. అప్పటి నుంచి పెట్రోల్ ధరలు సుమారుగా 3.5 శాతం మాత్రమే పెరిగాయి.

ఎందుకో తెలుసా? ఇదంతా లోక్ సభ ఎన్నికల కారణంగానే. లోక్ సభ ఎన్నికల వేళ.. దేశీయ వినియోగదారులకు ఇదొక బంపర్ బోనాంజాగా చెప్పుకోవాలి. సాధారణంగా ఆయిల్ కంపెనీలు తమ నష్టాలను పూడ్చుకోవడం కోసం ఇంధన ధరల్లో మార్పులు చేస్తుంటాయి. లోక్ సభ ఎన్నికల వేళ ఇంధన ధరలు స్థిరంగా ఉండిపోవడంతో వినియోగదారులకు కాస్త రిలీఫ్ దొరికినట్టుయింది. ఇంధన ధరల పెంపు ఆలస్యం కావడంతో ఆయిల్ కంపెనీలు ఎన్నికలు అయ్యేవరకు ఓపిగ్గా ఎదురుచూస్తున్నట్టు కనిపిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన ముందు వరకు రోజువారీ పెంపుతో వినియోగదారుల నడ్డివిరిచిన ఆయిల్ కంపెనీలు మే 19 కోసం ఎదురుచూస్తున్నాయి. 

మే 19 తర్వాత పెట్రో వాత తప్పదా?
లోక్ సభ చివరి దశ ఎన్నికలు మే 19తో ముగియనున్నాయి. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంధన ధరలు అమాంతం పెరిగిపోనున్నాయి. ఇన్నాళ్లు స్థిరంగా కొనసాగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా భగ్గుమనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్నికల సమయంలో స్థిరమైన ఇంధన ధరలతో రిలీఫ్ గా ఉన్న వినియోగదారులకు ఇక నుంచి ధరల మోత మోగనుంది. ఇంధన ధరల పెంపుపై ఆయిల్ కంపెనీలు ఆలస్యం చేయడానికి లోక్ సభ ఎన్నికలే కారణమని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.

ఇంధన పన్ను తగ్గించాలి.. కాంగ్రెస్ డిమాండ్
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తమ సొంత పాలసీతో రోజువారీ ధరల పెంపు పాలసీని ఉల్లంఘించినట్టు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉండేలా ఆయిల్ కంపెనీలకు మోడీ ప్రభుత్వం సూచించడం వల్లే ధరలను రివైజ్ చేయలేదని మండిపడింది. ఎన్నికలు ముగిసిన అనంతరం భారీగా పెరిగే ఇంధన పన్నులను ప్రభుత్వం తగ్గించాలని కాంగ్రెస్ సీనియర్ నేత అఖిలేష్ ప్రతాప్ సింగ్ డిమాండ్ చేశారు. ఇంధన పన్ను తగ్గించకపోతే.. వినియోగదారులు అధిక మొత్తంలో ఇంధన ధరలను చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇలానే :
లోక్ సభ ఎన్నికల్లోనే కాదు.. మే 2018లో జరిగిన కర్ణాటక ఎన్నికలకు ముందు కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMC) ప్రారంభంలో పెట్రోల్, డీజిల్ ధరలను 19 రోజుల పాటు ఫ్రీజ్ చేశాయి. అంతర్జాతీయ ఇంధన ధరలు సుమారుగా 5డాలర్ల పైకి ఎగిసినప్పటికీ.. దేశీయ ముడి చమురు ధరల్లో ఎలాంటి మార్పులేదు. 16 రోజుల పాటు వరుసగా కొనసాగిన ఇంధన ధరలు.. మే 14న ఒక్కసారిగా పెరిగాయి. పెట్రోల్ ధరలు లీటర్ కు రూ.3.8 శాతానికి పెరిగిపోగా.. డీజిల్ ధర లీటర్ కు రూ.3.38 పెరిగింది. 

గుజరాత్.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ : 
డిసెంబర్ 2017లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)ఇంధన సంస్థలు 14రోజుల పాటు ధరలను రీవైజ్డ్ చేయడం నిలిపివేశాయి. నివేదిక ప్రకారం.. 2017, జనవరి 6 మధ్యకాలంలో ఇంధన ధరలను ఐఓసీ ఫ్రీజ్ చేసింది. ఏప్రిల్ 1, 2017లో కూడా ధరలను రీవైజ్ చేయలేదు. ఆ సమయంలో ఐదు రాష్ట్రాలైన పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మణిపూర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.

అంటే.. 2019 ఏడాది సార్వత్రిక ఎన్నికల సమయంలో స్థిరంగా కొనసాగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. మే 19న ఎన్నికలు ముగిశాక.. అమాంతం ఇంధన ధరలు పెరిగిపోయే అవకాశం ఉంది. ఎన్నికల వేడి తగ్గాక.. పెట్రోల్, డీజిల్ ధరల మంటలు పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు ఏ స్థాయిలో పెరుగుతాయో చూడాలి.