PM Kisan 20th Installment : పీఎం కిసాన్ డబ్బులు పడేది ఎప్పుడు? ఒక రైతు కుటుంబంలో ఎంతమంది అప్లయ్ చేసుకోవచ్చు? ఫుల్ డిటెయిల్స్!

PM Kisan 20th Installment : పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 20వ విడత కోసం రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పథకానికి ఒక రైతు కుటుంబంలో ఎంతమంది దరఖాస్తు చేసుకోవచ్చు? ఎవరు అర్హులు పూర్తి వివరాలు మీకోసం..

PM Kisan 20th Installment : పీఎం కిసాన్ డబ్బులు పడేది ఎప్పుడు? ఒక రైతు కుటుంబంలో ఎంతమంది అప్లయ్ చేసుకోవచ్చు? ఫుల్ డిటెయిల్స్!

PM Kisan Yojana

Updated On : April 5, 2025 / 11:53 AM IST

PM Kisan 20th Installment : ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-Kisan) అనేది భారత ప్రభుత్వం ముఖ్యంగా పేద రైతుల కోసం అందిస్తున్న అద్భుతమైన పథకం. రైతులకు ఆర్థికంగా సాయం అందించాలని 2019 సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష బ్యాంకు బదిలీ (DBT) పథకం. ఈ పథకంలో ప్రతి సంవత్సరం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు రూ.6 వేలు నేరుగా జమ అవుతాయి.

Read Also : iPhone 16 Pro Max : వావ్.. ఈ ఐఫోన్‌పై ఖతర్నాక్ డిస్కౌంట్.. ఇంత తక్కువ ధరకు మళ్లీ జన్మలో రాదు..!

ఈ మొత్తాన్ని ప్రతి 4 నెలలకు రూ. 2వేల చొప్పున 3 వాయిదాలలో విడుదల చేస్తారు. ప్రతి విడతలో ఇచ్చే రూ. 2,000 ద్వారా ప్రభుత్వం చిన్న, ఆర్థికంగా బలహీనమైన రైతులకు సాయం అందిస్తోంది. తద్వారా వ్యవసాయానికి సంబంధించిన అవసరాలను తీర్చుకోగలరు.

ఇప్పటివరకు, కేంద్ర ప్రభుత్వం మొత్తం 19 విడతల పీఎం కిసాన్ సమ్మాన్ డబ్బులను పంపిణీ చేసింది. పీఎం కిసాన్ యోజన ప్రయోజనాలను పొందాలంటే రైతులు కొన్ని అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి. పీఎం కిసాన్ డబ్బులు ఏయే రైతులకు అందుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

పీఎం కిసాన్ యోజన ఏంటి? :
ప్రధానమంత్రి కిసాన్ యోజన అనేది మోదీ ప్రభుత్వం పేద రైతుల సంక్షేమం కోసం అందించే ప్రభుత్వ పథకం. వాయిదాల్లో డబ్బు పొందే లబ్ధిదారుల రైతులు ఆధార్ కార్డును తమ బ్యాంకు ఖాతాకు లింక్ చేసుకోని ఉండాలి. ఈ పథకం ప్రయోజనాల కోసం ఆధార్‌ను eKYC, యాక్టివ్ బ్యాంక్ ఖాతాతో లింక్ చేయడం చాలా ముఖ్యం. ఈ ప్రభుత్వ పథకంలో భూమి ధృవీకరణ కూడా అత్యంత కీలకమైనదిగా గమనించాలి.

పీఎం కిసాన్ 20వ వాయిదా తేదీ :
పీఎం కిసాన్ 19వ విడత ఫిబ్రవరి 2025లో విడుదలైంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా లబ్ధిదారులైన రైతులు 20వ విడత కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రతి 4 నెలలకు ఒకసారి విడుదల చేస్తారు. ఈసారి పీఎం కిసాన్ 20 విడత వచ్చే జూన్‌లో విడుదల కావచ్చు. ప్రధానమంత్రి కిసాన్ 20వ విడత అధికారిక తేదీని ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు.

ఈ ఆర్థిక సాయం 2 హెక్టార్ల వరకు భూమి ఉన్న భారతీయ రైతులకు మాత్రమే వర్తిస్తుంది. eKYC ప్రక్రియను పూర్తి చేసి ఉండాలి. భూమి రికార్డులను వెరిఫై చేయించుకోవాలి. బ్యాంక్ ఖాతాలను ఆధార్, NPCIతో లింక్ చేసుకుని ఉండాలి. వీరికి మాత్రమే పీఎం కిసాన్ వాయిదా డబ్బులు అందుతాయి.

ఒకే కుటుంబంలో అందరూ అప్లయ్ చేయొచ్చా? :
పీఎం కిసాన్ పథకానికి అర్హత గల రైతులే అప్లయ్ చేసుకోవాలి. అయితే, ఒక రైతు కుటుంబంలోని భార్యాభర్తలు ఇద్దరూ లేదా ఇతర సభ్యులు సమ్మన్ నిధి నిధులను పొందగలరా అంటే.. అందరూ అప్లయ్ చేసుకోలేరని గమనించాలి. ఒక కుటుంబంలో భర్త లేదా భార్యలో ఒకరు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ముఖ్యంగా వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్‌లో పేరు ఉన్న వ్యక్తి ఈ ప్రయోజనాలను పొందవచ్చు.

ఒకే కుటుంబంలోని ఎక్కువ మంది సభ్యులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే.. వారి దరఖాస్తులు తిరస్కరిస్తారు. అందువల్ల, కుటుంబ సభ్యులందరూ ఈ పథకం నుంచి ప్రయోజనం పొందలేరు. ప్రధానమంత్రి కిసాన్ యోజన నుంచి ఒక రైతు కుటుంబానికి ఒక వ్యక్తి మాత్రమే ఆర్థిక సాయం పొందగలరని ఇప్పటికే కేంద్రం స్పష్టంచేసింది.

జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేయడం ఎలా? :

  • ముందుగా (pmkisan.gov.in) అధికారిక పీఎం కిసాన్ యోజన వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
  • ఫార్మర్స్ కార్నర్ ఆప్షన్ కోసం కిందికి స్క్రోల్ చేయండి. ‘Beneficiary Status’పై క్లిక్ చేయండి.
  • మీ పీఎం కిసాన్ అకౌంట్ నంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
  • మీ ఫోన్ నంబర్ రిజిస్టర్ కాకపోతే.. రిజిస్టర్ చేసి మీ ఫోన్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేయాలి.
  • ‘Get Data’ పై క్లిక్ చేయండి. అప్పుడు మీరు స్క్రీన్‌పై మీ అకౌంట్ స్టేటస్ చూడొచ్చు.

పీఎం కిసాన్ యోజన మార్గదర్శకాల ప్రకారం.. ఒక రైతు కుటుంబంలోని ఒక సభ్యుడు మాత్రమే ఈ పథకం నుంచి ప్రయోజనాలను పొందగలరు. మొదటి విడత సాధారణంగా ఏప్రిల్, జూలై మధ్య, రెండవ విడత ఆగస్టు నుంచి నవంబర్ వరకు, మూడవ విడత డిసెంబర్ నుంచి మార్చి వరకు పంపిణీ అవుతాయి. రాబోయే విడత ఏప్రిల్, జూలై మధ్య విడుదలయ్యే అవకాశం ఉంది.

Read Also : Samsung Galaxy Z Flip 6 : బంపర్ ఆఫర్.. భారీగా తగ్గిన శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్.. ఇలా చేస్తే ఇంకా తక్కువకే వస్తుంది..!

మొత్తం 9.70 కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నారు. పీఎం కిసాన్ యోజనకు సంబంధించిన ఏవైనా సమస్యల కోసం రైతులు (pmkisan-ict@gov.in) వద్ద ఇమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు లేదా 155261, 1800115526 (టోల్ ఫ్రీ) లేదా 011-23381092 నంబర్లలో హెల్ప్‌లైన్‌కు కాల్ చేయవచ్చు.