Poco M6 4G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? పోకో M6 4జీ ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 11నే లాంచ్!

Poco M6 4G Launch : పోకో M6 5జీ, పోకో M6 ప్రో 5జీ, పోకో M6 ప్రో 4జీ హ్యాండ్‌సెట్‌లలో చేరే ఫోన్ లాంచ్ తేదీని కూడా కంపెనీ ప్రకటించింది. బీఐఎస్ సర్టిఫికేషన్ సైట్‌లలో పోకో M6 ప్లస్ 5జీ వేరియంట్ కనిపించింది.

Poco M6 4G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? పోకో M6 4జీ ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 11నే లాంచ్!

Poco M6 4G Price, Design, Key Features Revealed ( Image Source : Google )

Poco M6 4G Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం పోకో నుంచి సరికొత్త 4జీ ఫోన్ వచ్చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 11న పోకో M6 4జీ ఫోన్ లాంచ్ కానుంది. ఈ మేరకు కంపెనీ ధృవీకరించింది. పోకో స్మార్ట్‌ఫోన్ డిజైన్, కలర్ ఆప్షన్లు, ముఖ్య ఫీచర్లను కూడా వెల్లడించింది.

Read Also : Vivo Watch GT Launch : 21 రోజుల బ్యాటరీ లైఫ్, ఇసిమ్ సపోర్ట్‌తో వివో జీటీ స్మార్ట్‌వాచ్.. ధర, స్పెసిఫికేషన్‌లు ఇవే

పోకో M6 5జీ, పోకో M6 ప్రో 5జీ, పోకో M6 ప్రో 4జీ హ్యాండ్‌సెట్‌లలో చేరే ఫోన్ లాంచ్ తేదీని కూడా కంపెనీ ప్రకటించింది. ఇటీవల, బీఐఎస్ సర్టిఫికేషన్ సైట్‌లలో పోకో M6 ప్లస్ 5జీ వేరియంట్ కనిపించింది. ఇంతలో, రాబోయే పోకో M6 4జీ ఫోన్ ర్యామ్, స్టోరేజీ ఆప్షన్లతో పాటు ప్రారంభ ధరలు కూడా అధికారికంగా రివీల్ అయ్యాయి.

పోకో M6 4జీ ఫోన్ ధర ఎంతంటే? :
పోకో M6 4జీ జూన్ 11న లాంచ్ అవుతుందని కంపెనీ ఎక్స్ పోస్ట్ ధృవీకరిస్తుంది. 6జీబీ+ 128జీబీ వేరియంట్‌కు 129 డాలర్లు (దాదాపు రూ. 10,800) ధరలో ఫోన్ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. 8జీబీ+ 256జీబీ కాన్ఫిగరేషన్‌లకు 149 డాలర్లు (దాదాపు రూ. 12,400) ఉండవచ్చు. పోకో M6 4జీ ఫోన్ పోకో గ్లోబల్ వెబ్‌సైట్‌లో బ్లాక్, పర్పుల్, సిల్వర్ అనే మూడు కలర్ ఆప్షన్‌లతో వస్తుంది.

పోకో ఎమ్6 4జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
పోకో ఎమ్6 4జీ ఫోన్ 6.79-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (2,460 x 1,080 పిక్సెల్‌లు) డాట్‌ డిస్‌ప్లే, 90Hz వరకు రిఫ్రెష్ రేట్, ట్రిపుల్ టీయూవీ రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంటుంది. మాలి-జీ52 ఎమ్‌సీ2 జీపీయూతో మీడియాటెక్ హెలియో జీ91 అల్ట్రా ఎస్ఓసీ, 8జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జీబీ వరకు ఇఎమ్ఎమ్‌సీ 5.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో ఫోన్ పవర్ ఆన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత షియోమి హైపర్‌ఓఎస్‌తో ఫోన్ వస్తుందని ఆన్‌లైన్ లిస్టింగ్ వెల్లడించింది.

ఆప్టిక్స్ విషయానికివస్తే.. పోకో ఎమ్6 4జీ ఫోన్ 1080పీ వరకు వీడియో రికార్డింగ్‌కు సపోర్టుతో డ్యూయల్ బ్యాక్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. 2ఎంపీ మాక్రో సెన్సార్‌తో పాటు 108ఎంపీ ప్రైమరీ రియర్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 13ఎంపీ సెన్సార్‌ను ఉపయోగిస్తుంది.

పోకో ఎమ్6 4జీ ఫోన్ యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ద్వారా 33డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,030mAh బ్యాటరీని లిస్టింగ్ చూపిస్తుంది. ఈ ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ పోర్ట్‌తో వస్తుంది. వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.4 కనెక్టివిటీని అందిస్తుంది. బరువు 205 గ్రాముల పరిమాణం 168.6 x 76.28 x 8.3ఎమ్ఎమ్ ఉంటుంది.

Read Also : Vivo X Fold 3 Pro Launch : శాంసంగ్, వన్‌ప్లస్‌‌కు పోటీగా.. వివో కొత్త మడతబెట్టే ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?