Ratan Tata Success Story : రతన్ టాటా సక్సెస్ స్టోరీ.. యువతరానికే స్ఫూర్తిదాయకం.. వ్యాపార దిగ్గజంగా ఎలా ఎదిగారంటే?

Ratan Tata Success Story : రతన్ టాటా సక్సెస్ స్టోరీ యువతరాలకు అత్యంత స్ఫూర్తిదాయకం. అలాంటి రతన్ టాటా తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించారు? అనేక విజయాలను అందుకుంటూ గొప్ప మానవతావాది ఎలా గుర్తింపు తెచ్చుకున్నారంటే?

Ratan Tata Success Story : రతన్ టాటా సక్సెస్ స్టోరీ.. యువతరానికే స్ఫూర్తిదాయకం.. వ్యాపార దిగ్గజంగా ఎలా ఎదిగారంటే?

Ratan Tata Success Story (Image Source : Google )

Updated On : October 9, 2024 / 11:55 PM IST

Ratan Tata Success Story : రతన్ టాటా.. పరిచయం అక్కర్లేని పేరు.. ఒక ప్రముఖ వ్యాపార దిగ్గజంగానే కాదు.. పరోపకారి.. ఆయనో మానవతావాది కూడా.. టాటా గ్రూప్ వారసుడిగా అత్యున్నత గౌరవాన్ని పొందారు. రతన్ టాటా సక్సెస్ స్టోరీ యువతరాలకు అత్యంత స్ఫూర్తిదాయకం. అలాంటి రతన్ టాటా తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించారు? అనేక విజయాలను అందుకుంటూ గొప్ప మానవతావాది ఎలా గుర్తింపు తెచ్చుకున్నారు అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.

1868లో స్థాపించిన టాటా గ్రూప్ భారత ప్రఖ్యాత మల్టీనేషనల్ కంపెనీ. ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఆటోమోటివ్, స్టీల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్స్ వంటి అనేక రంగాల్లో సేవలను అందిస్తోంది. 1990 సంవత్సరం నుంచి 2012 వరకు టాటా గ్రూప్‌కు రతన్ టాటా ఛైర్మన్‌గా ఉన్నారు. ఆ తర్వాత అక్టోబరు 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా రతన్ టాటా కొనసాగారు. తన కెరీర్ ప్రారంభం నుంచే ఆయన ఎన్నో సేవలిందించారు. ఒక మానవతావాదిగా ఆయన అసాధారణ నైపుణ్యాలు ప్రపంచవ్యాప్తంగా అనేక తరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.

Read Also : Ratan Tata : రతన్‌ టాటా ఆరోగ్య పరిస్థితి విషమం.. ముంబై ఆస్పత్రి ఐసీయూలో చికిత్స..!

రతన్ టాటా ఎవరంటే? :
రతన్ నావల్ టాటా.. నావల్ టాటా కుమారుడు. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జమ్‌సెట్జీ టాటా కుమారుడు రతన్‌జీ టాటా దత్తత తీసుకున్నారు. ఆయన కార్నెల్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్ డిగ్రీతో పట్టా పొందారు. 1961లో టాటా కంపెనీలో చేరారు. అక్కడే ఆయన టాటా స్టీల్ షాప్ ఫ్లోర్‌లో పనిచేశారు. ఆ తర్వాత 1991లో టాటా సన్స్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.

రతన్ టాటా వ్యక్తిగత జీవితం :
1937లో డిసెంబర్ 28న ముంబైలో పార్సీ జొరాస్ట్రియన్ కుటుంబంలో రతన్ టాటా జన్మించారు. ఆయన సూరత్‌లో నావల్ టాటా, జమ్‌సెట్‌జీ మేనకోడలు సూని టాటా తరువాత టాటా ఫ్యామిలీలోకి ఆయన్ను దత్తత తీసుకున్నారు. టాటా కుటుంబంలో ఒక సభ్యుడు అయ్యారు. 1948లో రతన్ టాటాకు 10ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఆయన తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తరువాత టాటా అమ్మమ్మ, నవాజ్‌బాయి టాటా ఆయన్ను దత్తత తీసుకున్నారు. సిమోన్ టాటాను తండ్రి నావల్ టాటా రెండో వివాహం చేసుకున్నారు.

దాంతో రతన్ టాకు ఒక తమ్ముడు జిమ్మీ టాటా, సవతి సోదరుడు నోయెల్ టాటా ఉన్నారు. టాటా తన చిన్నతనంలో ఎక్కువ భాగం భారత్‌లోనే గడిపారు. లాస్ ఏంజిల్స్‌లో ఉండగా దాదాపు ప్రేమ, పెళ్లి వ్యవహారం వరకు వెళ్లింది. కానీ, దురదృష్టవశాత్తు.. రతన్ టాటా అమ్మమ్మ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన భారత్‌కు వెళ్లవలసి వచ్చింది. తన కాబోయే జీవిత భాగస్వామి తనతో కలిసి భారత్ వెళ్లాలని భావించారు. అప్పట్లో ఇండో-చైనా యుద్ధం కారణంగా భారత్‌లో నెలకొన్న అస్థిరత కారణంగా ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదు. అక్కడితో వారిద్దరి అనుబంధం ముగిసింది.

విద్య, వృత్తి సాగిందిలా :
రతన్ టాటా ముంబైలోని క్యాంపియన్ స్కూల్‌లో 8వ తరగతి వరకు చదువుకున్నారు. అనంతరం ముంబైలోని కేథరల్ అండ్ జాన్ కానన్ స్కూల్లో చదివారు. ఆపై సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్‌లో కూడా చదివారు. న్యూయార్క్‌లోని రివర్‌డేల్ కంట్రీ స్కూల్‌లో కూడా చదువుకున్నారు. 1955 ఏడాదిలో హైస్కూల్ నుంచి పట్టా పొందాక టాటా కార్నెల్ యూనివర్శిటీలో చేరారు. అక్కడే ఆయన 1959లో ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

2008లో టాటా కార్నెల్‌కు 50 మిలియన్ డాలర్ల బహుమతిగా అందించి యూనివర్శిటీ చరిత్రలోనే అతిపెద్ద అంతర్జాతీయ దాతగా నిలిచారు. 1970లో టాటా గ్రూప్‌లో టాటాకు మేనేజిరియల్ పదవిని కూడా పొందారు. 21ఏళ్లలోనే టాటా గ్రూప్ ఆదాయం 40 రెట్లు పెరిగింది. కంపెనీ లాభం 50 రెట్లు పెరిగింది. రతన్ టాటా కంపెనీ బాధ్యతలు చేపట్టినప్పుడు అత్యధిక విక్రయాలతో జోరుమీద ఉంది. కానీ, ఆ తర్వాత అత్యధిక విక్రయాలు కంపెనీ బ్రాండ్ నుంచే వచ్చాయి.

టాటా గ్రూప్‌లో ప్రవేశం :
1991లో టాటా సన్స్‌కు చెందిన జేఆర్డీ టాటా చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. రతన్ టాటా ఆయన వారసుడిగా బాధ్యతల స్వీకరణతో ప్రయాణం మొదలైంది. రుస్సీ మోడీ (టాటా స్టీల్), దర్బారీ ఎగ్జిక్యూటివ్‌లుగా నియమితులయ్యారు. సేథ్ (టాటా టీ, టాటా కెమికల్స్), అజిత్ కెర్కర్ (తాజ్ హోటల్స్) నాని పాల్ఖివాలా (అనేక టాటా కంపెనీల బోర్డులలో డైరెక్టర్) జేఆర్డీ టాటా వారసుడిగా భావిస్తున్నారు. ఇది వారి మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. చాలామంది ఈ నిర్ణయంతో విభేదించారు. అప్పట్లో మీడియా కూడా రతన్ టాటా నిర్ణయాన్ని తప్పుగా ఎత్తిచూపింది.

కానీ, రతన్ టాటా పట్టుదల, అంకితభావంతో పనిచేస్తూనే ఉన్నారు. తన పదవీ కాలంలోనే పదవీ విరమణ వయస్సును కూడా నిర్ణయించారు. దాని ప్రకారం.. పదవీ విరమణ వయస్సు 70కి నిర్ణయించారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు 65 ఏళ్ల వయస్సులో పదవీ విరమణ చేస్తారు. సేథ్, కెర్కర్ వయస్సు పరిమితి దాటగా వారు పదవీ విరమణ చేశారు. అనారోగ్య కారణాల వల్ల పాల్ఖివా ఉద్యోగం నుంచి నిష్క్రమించారు. వారసత్వ సమస్య పరిష్కరించిన తర్వాత రతన్ టాటా ముఖ్యమైన వాటిపై దృష్టి సారించడం ప్రారంభించారు.

టాటా బ్రాండ్ నేమ్‌ను ఉపయోగించుకున్నందుకు టాటా సన్స్‌కి రాయల్టీ చెల్లించమని గ్రూప్ కంపెనీలను ఒప్పించాడు. వ్యక్తిగత కంపెనీలను గ్రూప్ ఆఫీసుకు రిపోర్టు చేయమన్నారు. సాఫ్ట్‌వేర్ వంటి ఇతర వాటిపై దృష్టిని పెంచింది. టెలికాం వ్యాపారం, ఫైనాన్స్ రిటైల్‌లో కూడా టాటా గ్రూపు ప్రవేశించింది. అదే సమయంలో విమర్శలు వచ్చినప్పటికీ జేఆర్డీ టాటా రతన్ టాటాకు మార్గదర్శకుడిగా మార్గనిర్దేశం చేశారు.

రతన్ టాటా సాధించిన విజయాలివే :
కెరీర్ ప్రారంభంలో అనుభవం లేని కారణంగా అనేక విమర్శలను ఎదుర్కొన్నారు. టాటా గ్రూప్ పగ్గాలను చేపట్టారు. 65శాతం ఆదాయాలు విదేశాల నుంచి వచ్చే విధంగా నాయకత్వం వహించారు. ఆయన నాయకత్వంలో కంపెనీ గ్రూపు ఆదాయాలు 40 రెట్లు పెరిగాయి. రానురానూ కంపెనీ లాభాలు 50 రెట్లు పెరిగాయి. వ్యాపారాన్ని ప్రపంచీకరణ చేసే లక్ష్యంతో టాటా గ్రూప్ రతన్ టాటా నాయకత్వంలో అనేక వ్యూహాత్మక కొనుగోళ్లు చేసింది. ఇందులో లండన్‌కు చెందిన టెట్లీ టీని 431.3 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.

దక్షిణ కొరియాకు చెందిన డేవూ మోటార్స్ ట్రక్కుల తయారీ యూనిట్‌ను 102 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఆంగ్లో-డచ్ కంపెనీ కోరస్ గ్రూప్‌ను 11.3 బిలియన్ డాలర్లకు స్వాధీనం చేసుకుంది. టాటా టీ ద్వారా టెట్లీ, టాటా మోటార్స్ ద్వారా జాగ్వార్ ల్యాండ్ రోవర్, టాటా స్టీల్ ద్వారా కోరస్‌తో సహా ఈ కొనుగోళ్లు టాటా గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించేలా చేశాయి. దాదాపు 100 దేశాలకు పైగా టాటా కంపెనీ వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. భారతీయ పారిశ్రామిక రంగంలో కూడా ఎంతో ప్రోత్సాహాన్ని అందించింది.

టాటా నానో అరంగ్రేటం :
2015లో రతన్ టాటా టాటా నానో కారును ప్రవేశపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా మధ్య, దిగువ-మధ్య-ఆదాయ వినియోగదారులకు అత్యంత సరసమైనదిగా మారింది. ఐదుగురు కూర్చునే సామర్థ్యం కలిగిన ఈ కారు ప్రారంభ ధర 2వేల డాలర్లు. టాటా నానో అనేది స్థోమత పరంగా సామాన్యుల కారుగా పేరుగాంచింది.

రతన్ టాటా దాతృత్వ విరాళాలు :
రతన్ టాటా సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌ను స్థాపించారు. రతన్ టాటా సంపాదించిన లాభాలలో దాదాపు 60 నుంచి 65శాతం దాతృత్వ ప్రయోజనాల కోసం విరాళంగా అందించారు.

బిరుదులు, గౌరవ డాక్టరేట్స్ :
రతన్ టాటాకు భారత రెండో అత్యున్నత పౌర పురస్కారం, పద్మ విభూషణ్, మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్ లభించాయి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ, ఒహియో స్టేట్ యూనివర్శిటీ, ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ ఐఐటి ఖరగ్‌పూర్‌తో సహా పలు ప్రతిష్టాత్మక సంస్థల నుంచి గౌరవ డాక్టరేట్‌లను కూడా అందుకున్నారు.

75ఏళ్ల వయస్సులో పదవీ విరమణ :
రతన్ టాటా డిసెంబరు 28, 2012న 75 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేశారు. ఆయన తర్వాత షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌కు చెందిన సైరస్ మిస్త్రీ బాధ్యతలు చేపట్టారు. అయితే, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దాంతో మిస్త్రీని 2016లో ఆయన ఆ స్థానం నుంచి తొలగించారు. రతన్ టాటా తాత్కాలిక ఛైర్మన్‌గా పనిచేశారు. 2017 జనవరిలో నటరాజన్ చంద్రశేఖరన్ టాటా గ్రూప్ ఛైర్మన్‌గా, రతన్ టాటా వారసుడిగా నియమితులయ్యారు. ప్రస్తుతం, రతన్ టాటా టాటా ట్రస్ట్స్, టాటా సన్స్‌కి నాయకత్వం వహిస్తున్నారు. జేఆర్డీ టాటా తర్వాత రెండు కంపెనీలకు రెండో అధినేతగా రతన్ టాటా ఉన్నారు.

విద్యారంగంలో నాణ్యమైన విద్య కోసం అనేక విరాళాలను అందించారు. వైద్య రంగానికి కూడా తన వంతు కృషిగా అనేక విరాళాలను అందించారు. గ్రామీణ, వ్యవసాయ అభివృద్ధికి కూడా తన వంతు సహకారం అందించారు. 1991లో సర్ రతన్ టాటా ట్రస్ట్ కూడా ఏర్పాటు చేశారు. రతన్ టాటా ఈ ట్రస్ట్ ద్వారా విధ రంగాలలో వెనుకబడిన వారి సంక్షేమం కోసం సేవలందించారు.

 ఎన్నో సవాళ్లు ఎదురైనా.. :
రతన్ టాటా కెరీర్‌లో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా అలానే ముందుకు సాగి ఎన్నో విజయాలను అందుకున్నారు. కోర్ మేనేజ్‌మెంట్ నుంచి రూ. 50 లక్షల నిధులను మంజూరు చేయకపోవడంతో 1977లో ఎంప్రెస్ మిల్‌ యూనిట్‌ను రతన్ టాటా మూసేయాల్సి వచ్చింది. ఆ యూనిట్ విప్లవాత్మకంగా ఉండాలని ఆయన కలలు కన్నారు. కానీ, దురదృష్టవశాత్తు రతన్ నిరాశకు గురిచేసింది.

1981లో జేఆర్డీ టాటాచే టాటా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ తదుపరి వారసుడిగా ప్రకటించారు. అప్పుడు కూడా రతన్ టాటా అనేక విమర్శలను ఎదుర్కొన్నారు. టాటా గ్రూప్స్ ఉద్యోగులు, పెట్టుబడిదారులు, వాటాదారులతో పాటు అందరూ ఆయన్ను విశ్వసించారు. 1998లో కారు మార్కెట్‌లోకి రావాలని నిర్ణయించుకున్నారు. టాటా ఇండికా పేరుతో తన మొదటి కారు మోడల్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. అయితే, టాటా కారును కొనుగోలు చేసేందుకు వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు.

1999లో మొత్తం కంపెనీని అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. దాంతో ఫోర్డ్ మోటార్స్‌ను ఆయన సంప్రదించారు. కానీ, రతన్ టాటాను ఆ ఫోర్డ్ యజమాని అవమానించారు. అంత పెద్ద వ్యాపారవేత్తకు ఎంతో సమస్యాత్మకమైన పరిస్థితి ఎదురైంది. మీకు ప్యాసింజర్ కార్ల గురించి ఏమీ తెలియనప్పుడు.. వ్యాపారం ఎందుకు ప్రారంభించారు” అని పేర్కొంటూ ఫోర్డ్ రతన్ టాటాను అవమానించింది. 2008లో జాగ్వార్-ల్యాండ్ రోవర్ యూనిట్‌ను కొనుగోలు చేయడంతో ఫోర్డ్‌ను దివాలా నుంచి రక్షించారు. ఈ మాటలకు రతన్ టాటా వెంటనే సమాధానం ఇచ్చారు. ఇందుకోసం టాటా కూడా రూ. 2500 కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.

Read Also : Best Mobile Phones 2024 : కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ నెలలో రూ. 20వేల లోపు 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!