ఇంకా తగ్గాలి : ఇల్లు, కారు అప్పులపై వడ్డీ తగ్గింపు
రిజర్వ్ బ్యాంక్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ ఫూల్ కాకుండా.. నిజం అంటోంది. బ్యాంకుల నుంచి తీసుకునే హోంలోన్, కారు లోన్, పర్సనల్ లోన్ లపై వడ్డీ తగ్గించింది.

రిజర్వ్ బ్యాంక్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ ఫూల్ కాకుండా.. నిజం అంటోంది. బ్యాంకుల నుంచి తీసుకునే హోంలోన్, కారు లోన్, పర్సనల్ లోన్ లపై వడ్డీ తగ్గించింది.
రిజర్వ్ బ్యాంక్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ ఫూల్ కాకుండా.. నిజం అంటోంది. బ్యాంకుల నుంచి తీసుకునే హోంలోన్, కారు లోన్, పర్సనల్ లోన్ లపై వడ్డీ తగ్గించింది. ఇక నుంచి బ్యాంకుల నుంచి తీసుకునే అప్పులతోపాటు.. గతంలో ఫ్లోట్ విధానంలో ఉన్న హోం, కార్ లోన్లపై కూడా వడ్డీ తగ్గనుంది. 2019, ఏప్రిల్ 4వ తేదీన సమావేశం అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు చైర్మన్ శక్తికాంత్ సింగ్.
రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది RBI. దీంతో ప్రస్తుతం ఉన్న 6.25శాతం రెపోరేటు.. 6శాతానికి దిగి వచ్చింది. ఈ మేరకు బ్యాంకుల నుంచి తీసుకునే అప్పులపై వడ్డీ తగ్గనుంది. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలకు ఊరట ఇచ్చే అంశం. లక్షలు పోసి బ్యాంకు లోన్ తో ఇల్లు తీసుకున్న వారికి కొంతంలో కొంత ఊరట ఇచ్చే అంశం.
కొత్త రెపోరేటు లెక్కన.. 30 లక్షల హోంలోన్ పై నెలకు 400 రూపాయల వరకు వడ్డీ తగ్గనున్నట్లు అంచనా వేస్తున్నారు. అంటే ఏడాదికి 4వేల 800 రూపాయలు ఆదా కానుంది. RBI నిర్ణయం మేరకు బ్యాంకులు కూడా వడ్డీలు తగ్గించాల్సి ఉంటుంది.
Read Also : ప్రపంచం మెచ్చింది : నా కోడిపిల్లను కాపాడండీ.. పాకెట్ మనీతో ఆస్పత్రికి పరిగెత్తిన బుడతడు