Gold Bond: గోల్డ్‌లో పెట్టుబడి పెట్టారా? 2016-17 సిరీస్ IV రిడెంప్షన్‌ ధరను ప్రకటించిన ఆర్‌బీఐ.. ఎంతంటే?

సావరిన్ గోల్డ్ బాండ్స్ 2016-17 సిరీస్ IVను 2017 మార్చి 17న జారీ చేశామని ఆర్‌బీఐ తెలిపింది.

Gold Bond: గోల్డ్‌లో పెట్టుబడి పెట్టారా? 2016-17 సిరీస్ IV రిడెంప్షన్‌ ధరను ప్రకటించిన ఆర్‌బీఐ.. ఎంతంటే?

Updated On : March 14, 2025 / 9:33 PM IST

బంగారంపై డిజిటల్ రూపంలో పెట్టుబడి పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ పథకాన్ని 2015లో ప్రవేశపెట్టి.. 2025-26 పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో ఈ స్కీమ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

సావరిన్ గోల్డ్ బాండ్స్ 2016-17 సిరీస్ IVకు సంబంధించి రిడెంప్షన్‌ ధరను రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇవాళ ప్రకటించింది. 2025 మార్చి 17 నాటికి కాలపరిమితి పూర్తికానున్న ఎస్‌జీబీలకు సంబంధించిన బాండ్లకు యూనిట్‌ రేటును రూ.8,624గా నిర్ణయించింది.

మార్చి 10 నుంచి మార్చి 13 మధ్య వరకు బంగారం సగటు ముగింపు ధరను గణించి ఎస్‌జీబీలకు యూనిట్ ధరను రూ.8,624గా నిర్ణయించామని ఆర్‌బీఐ తెలిపింది. సావరిన్ గోల్డ్ బాండ్స్ 2016-17 సిరీస్ IVను 2017 మార్చి 17న జారీ చేశామని ఆర్‌బీఐ తెలిపింది. ఈ బాండ్లకు ఎనిమిదేళ్ల కాలపరిమితి ఉంటుంది. ఈ బాండ్లకు సంబంధించిన ఫైనల్‌ రిడెంప్షన్ డేట్ 2025 మార్చి 17. దీంతో రిడెంప్షన్ ధరను ప్రకటించారు.

Gold: భారీగా లాభాలు.. బంగారంలో ఎలా పెట్టుబడులు పెట్టాలి? పూర్తి వివరాలు..

కాగా, ఎనిమిదేళ్ల కాలపరిమితితో ఉండే ఈ సావరిన్‌ గోల్డ్‌ బాండ్లు జారీ చేసిన తేదీ నుంచి 5వ సంవత్సరం తర్వాత ముందస్తు విత్‌డ్రాలకు కూడా అనుమతి ఇస్తారు. కేంద్ర సర్కారు నిబంధనల మేరకు వడ్డీ ఇస్తారు.

ఇండియన్ బులియన్‌ అండ్‌ జువెలర్స్‌ అసోసియేషన్‌ లిమిటెడ్‌ రిపోర్టు చేసిన మూడు పనిదినాల పసిడి ధర సగటును లెక్కలోకి తీసుకుని రిడెంప్షన్‌ ధరను నిర్ణయిస్తారు. అంటే ఇప్పుడు ఈ నెల 10-13 మధ్య వరకు బంగారం సగటు ముగింపు ధరను గణించి ఈ ధరను నిర్ణయించారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టక ముందు వరకు సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను (ప్రభుత్వ సెక్యూరిటీలు) సర్కారు తరఫున ఆర్‌బీఐ జారీ చేసింది. పసిడిని కొనుగోలు చేయాలనుకునేవారు ఫిజికల్ గోల్డ్‌కి ప్రత్యామ్నాయంగా ఇందులో పెట్టుబడులు పెట్టేవారు. అయితే, ఈ పథకాన్ని రద్దు చేస్తున్నట్లు కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న సమయంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.