Real Estate Boom : హైదరాబాద్‎లో నిర్మాణ రంగం జోరు.. ఇళ్లకు పెరుగుతోన్న డిమాండ్‌..!

Real Estate Boom In Hyderabad : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో అఫర్డబుల్ హౌసింగ్ అందుబాటులో ఉన్నప్పటికీ, ఇళ్లకు మాత్రం డిమాండ్ తగ్గడం లేదు.  ఈ పరిస్థితి హైదరాబాద్ పరిధిలో రియాల్టీ రంగానికి ఉన్న క్రేజ్‌ చెప్పకనే చెబుతోంది.

Real Estate Boom : హైదరాబాద్‎లో నిర్మాణ రంగం జోరు.. ఇళ్లకు పెరుగుతోన్న డిమాండ్‌..!

Real Estate Boom In Hyderabad

Updated On : March 23, 2024 / 11:15 PM IST

Real Estate Boom : అన్ని రంగాల్లో జోరుమీదున్న హైదరాబాద్‌.. రియాల్టీ రంగంలోనూ దూకుడుమీదుంది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు… డబుల్‌ బెడ్‌ రూమ్ ఇళ్ల నుంచి లగ్జరీ విల్లాల వరకు అన్నింటిలో హైదరాబాద్‌ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలుస్తోంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో అఫర్డబుల్ హౌసింగ్ అందుబాటులో ఉన్నప్పటికీ, ఇళ్లకు మాత్రం డిమాండ్ తగ్గడం లేదు.  ఈ పరిస్థితి హైదరాబాద్ పరిధిలో రియాల్టీ రంగానికి ఉన్న క్రేజ్‌ చెప్పకనే చెబుతోంది.

Read Also : Dream Home : నెరవేరనున్న సొంతింటి స్వప్నం.. హైదరాబాద్‌లో భారీగా రానున్న హౌసింగ్‌ ప్రాజెక్టులు

సొంతిల్లు.. ఇది ప్రతి ఒక్కరి కల :
సొంతిల్లు.. ఇది ప్రతి ఒక్కరి కల. లైఫ్‌లో సెటిల్ అయ్యామంటే చాలు… చిన్నదో పెద్దదో ఏదో ఒక సొంత ఇల్లు ఉండాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. దీంతో హైదరాబాద్‌లో ఇళ్లకు డిమాండ్‌ ఏటా పెరుగుతూనే ఉంది. దీనికి అనుగుణంగా నిర్మాణ రంగం కూడా వేగంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు సరౌండింగ్‌ ఏరియాస్‌లో ఎటూ చూసినా కొత్త ప్రాజెక్టులే దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరగడమే ఈ డిమాండ్‌కు కారణమని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.

20శాతం పెరిగిన ప్రాపర్టీల ధరలు :
అఫర్డబుల్ హౌసింగ్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న హైదరాబాద్‌లో… ప్రస్తుతం పలు ప్రాంతాల్లోని ప్రాజెక్టుల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. వెస్ట్ జోన్‌తో పాటు, ఈస్ట్ జోన్‌లోని చాలా ప్రాంతాల్లో కొన్నేళ్లుగా ప్రాజెక్టుల విలువలో గణనీయమైన వృద్ధి నమోదవుతోంది. అయినా ఆయా ప్రాంతాల్లో మాత్రం ప్రాపర్టీలకు డిమాండ్ తగ్గడం లేదు.

ఇక విలాసవంతమైన ప్రాజెక్టులు కూడా హైదరాబాద్‌లో భారీగా పెరిగాయి. ప్రపంచ స్థాయి ఎమినిటీస్‌ ఉండే అల్ట్రా లగ్జరీ ప్రాజెక్టులో ఎంత ధరైనా వెచ్చించి ఫ్లాట్‌ను కొనేందుకు కొనుగోలుదారులు ముందుకు వస్తున్నారు. దీంతో అనేక ప్రాంతాల్లో కొనుగోలుదారుల అభిరుచికి అనుగుణంగా ప్రీమియం ప్రాజెక్టులను చేపడుతున్నాయి నిర్మాణ సంస్థలు.

పూర్తిగా కాస్మోపాలిటన్‌ సిటీగా మారుతోన్న మన విశ్వనగరంలో రాబోయే కాలంలో ఇళ్లకు డిమాండ్‌ మరింత పెరగనుంది. ఇప్పటికే ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో వేసిన లేఅవుట్లలో ప్లాట్లను ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు పనులు కూడా పట్టాలెక్కితే త్వరలో అక్కడ కూడా పెద్ద మొత్తంలో కన్‌స్ట్రక్షన్‌ యాక్టివిటీ జరగనుందని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.

Read Also : Hyderabad Development Mantra : అతిపెద్ద సిటీగా హైదరాబాద్? ప్రపంచ నగరాల్లో హైదరాబాద్‌ అభివృద్ధి మంత్ర