Redmi 13C 4G Launch : రెడ్‌మి 13C 4G ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
Redmi 13C 4G Launch : షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి నుంచి కొత్త 4G ఫోన్ వచ్చేస్తోంది. రెడ్‌మి 13C 4G ఫోన్ లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీకయ్యాయి. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Redmi 13C 4G Images, Colour Options Leaked, Specifications Tipped
Redmi 13C 4G Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమీ (Xiaomi) సబ్ బ్రాండ్ రెడ్‌మి నుంచి (Redmi 13C 4G) ఫోన్ అతి త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గత డిసెంబర్ 2022లో ప్రవేశపెట్టిన (Redmi 12C)కి ఈ ఫోన్ అప్‌గ్రేడ్ వెర్షన్ అని చెప్పవచ్చు.
కంపెనీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని ధృవీకరించనప్పటికీ, ఈ ఏడాది చివరిలో రెడ్‌మి 13C ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గతంలో, ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లు, డిజైన్ రెండర్‌లు లీక్ అయ్యాయి. కొత్త నివేదిక ప్రకారం.. లీక్ అయిన లైవ్ ఇమేజ్‌లను, హ్యాండ్‌సెట్ రిటైల్ బాక్స్‌లను చూడవచ్చు. రాబోయే హ్యాండ్‌సెట్ ముఖ్య స్పెసిఫికేషన్‌లతో పాటు కలర్ ఆప్షన్లను సూచిస్తుంది.
ఫీచర్లు, స్పెషిఫికేషన్లు, ధర (అంచనా) :
రెడ్‌మి 13C 4G ఫోన్ రిటైల్ బాక్స్‌తో బ్లాక్, బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్లలో కనిపిస్తుంది. ముందు కెమెరా డిస్‌ప్లే పైభాగంలో వాటర్‌డ్రాప్ నాచ్ ఉంటుంది. అయితే, ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు బ్యాక్ ప్యానెల్‌లోని టాప్ లెఫ్ట్ కార్నర్‌లో 2 వృత్తాకార కెమెరా మాడ్యూల్స్‌లో ఉంటాయి. ఈ హ్యాండ్‌సెట్ కుడి అంచున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ కనిపిస్తాయి.
నివేదిక ప్రకారం.. రెడ్‌మి 13C ఫోన్ బ్లాక్, బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్లలో వస్తుందని భావిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో ఈ 4G ఫోన్ ధర 100 డాలర్లు (సుమారు రూ. 8,300) కన్నా తక్కువగా ఉంటుంది. ఈ ఏడాది నవంబరు నాటికి ఫోన్‌ను లాంచ్ చేయవచ్చని నివేదిక తెలిపింది. రెడ్‌మి 13C ఫోన్ 3 ర్యామ్ స్టోరేజ్ వేరియంట్‌లలో (4GB + 128GB, 6GB + 128GB, 8GB + 256GB) వస్తుందని అంచనా వేస్తున్నట్లు నివేదిక తెలిపింది.

Redmi 13C 4G Colour Options Leaked
రెడ్‌మి 13C ఫోన్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.71-అంగుళాల HD+ డిస్‌ప్లే, 120Hz టచ్ శాంప్లింగ్ రేట్, 500నిట్స్ గరిష్ట ప్రకాశం స్థాయిని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. మీడియా టెక్ హెలియో G96 SoC ద్వారా పవర్ పొందే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12-ఆధారిత ఎంఐయూఐ 13పై రన్ అవుతుంది. ప్రైమరీ రియర్ కెమెరా సెన్సార్ 50MP సెన్సార్‌తో రానుందని భావిస్తున్నారు.
భారత్‌లో రెడ్‌మి 12C మోడల్ ఫోన్ 4GB + 128GB వేరియంట్ ధర రూ. 9,999 ఉండవచ్చు. మ్యాట్ బ్లాక్, మింట్ గ్రీన్, రాయల్ బ్లూ, లావెండర్ పర్పుల్ కలర్ ఆప్షన్‌లలో ఫోన్ అందుబాటులో ఉండవచ్చు. 6.71-అంగుళాల HD+ (1600 x 720 పిక్సెల్‌లు) LCD 60Hz డిస్‌ప్లేతో ఉన్న ఫోన్, ఆక్టా-కోర్ మీడియా టెక్ హెలియో G85 SoC, 10W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉండవచ్చు.