Reliance Digital India Sale : రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్.. జూలై 14 నుంచి అదిరే ఆఫర్లు.. రూ.10వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్.. డోంట్ మిస్..!
Reliance Digital India Sale : రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్ త్వరలో ప్రారంభం కానుంది. జూలై 14 నుంచి జూలై 16 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ల నుంచి ల్యాప్‌టాప్‌ల వరకు అనేక ఎలక్ట్రానిక్స్‌పై అదిరే ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది.

Reliance Digital Brings Digital India Sale with Attractive Discounts and Offers
Reliance Digital India Sale : ప్రముఖ రిలయన్స్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ రిటైల్ స్టోర్ (Reliance Digital) మొదటి దశ డిజిటల్ ఇండియా సేల్ (Reliance Digital India Sale)ను ప్రారంభించింది. జూలై 14, 2023 నుంచి అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ సేల్ ప్రారంభమవుతుంది. ప్రముఖ క్రెడిట్‌పై రూ.10వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌తో సహా అనేక అద్భుతమైన ఆఫర్‌లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
ధరకు సంబంధించి వినియోగదారులు ఏవైనా (Reliance Digital) స్టోర్‌లు లేదా (My Jio) స్టోర్‌ల నుంచి జూలై 16 వరకు ఈ లిమిటెడ్ పిరియడ్ ఆఫర్‌లను పొందవచ్చు. ఆసక్తి గల కొనుగోలుదారులు రిలయన్స్ డిజిటల్ (www.reliancedigital.in) కు లాగిన్ అవ్వండి. సులభమైన ఫైనాన్సింగ్, EMI ఆప్షన్లతో పాటు, కస్టమర్‌లు సరికొత్త టెక్నాలజీ, విస్తృత శ్రేణి ఉత్పత్తులపై వేగవంతమైన డెలివరీ, ఇన్‌స్టాలేషన్‌ను కూడా పొందవచ్చు.
డిజిటల్ ఇండియా సేల్‌లో అద్భుతమైన ఆఫర్లను పొందవచ్చు. కొత్తగా లాంచ్ అయిన (OPPO Reno 10 Pro 5G) సిరీస్‌ను పొందాలంటే.. కేవలం రూ. 39,999కు సొంతం చేసుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ (Samsung Galaxy S23 Ultra)కి రూ. 1,06,999కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఇంటెల్ 11వ జెన్ కోర్ i5, 8GB RAM, 512GB స్టోరేజీతో Dell Inspiron 3511 వంటి అద్భుతమైన ల్యాప్‌టాప్ డీల్‌లను పొందవచ్చు. ఈ ల్యాప్‌టాప్ కేవలం రూ. 49,499 లేదా ఇంటెల్ 12వ Gen Core i5, 16GB RAM, 512GB స్టోరేజీతో HP పెవిలియన్ 15కి సొంతం చేసుకోవచ్చు.
ఈ ల్యాప్‌టాప్ ధర కేవలం రూ.53,499 (ఎక్స్‌ఛేంజ్ ప్రోగ్రామ్, క్యాష్‌బ్యాక్, ప్రోమో తర్వాత) మాత్రమే. బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ ద్వారా 65 UHD TV టీవీని ధర రూ. 46,990కు పొందవచ్చు. ఎంపిక చేసుకున్న వాషింగ్ మెషీన్‌లను కొనుగోలు చేయడం ద్వారా రూ. 3,850 విలువైన మిక్సర్ గ్రైండర్‌ను ఉచితంగా పొందవచ్చు. రిఫ్రిజిరేటర్‌ని ఎంచుకుంటే.. రూ. 7,990 విలువైన స్మార్ట్‌వాచ్‌ని ఉచితంగా పొందవచ్చు.

Reliance Digital Brings Digital India Sale with Attractive Discounts and Offers
అయితే, రిలయన్స్ డిజిటల్ భారత మార్కెట్లో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ రిటైలర్ స్టోర్. 585+ పెద్ద ఫార్మాట్ రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లు, 1800+ My Jio స్టోర్‌లతో 800కి పైగా నగరాల్లో విస్తరించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో వినియోగదారులకు సేవలను అందిస్తోంది. సరికొత్త టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తెచ్చింది.
300 కన్నా ఎక్కువ అంతర్జాతీయ, జాతీయ బ్రాండ్‌లు, 5000 కన్నా ఎక్కువ ప్రొడక్టులతో అందుబాటులో ఉంది. రిలయన్స్ డిజిటల్ కస్టమర్ల కోసం అతిపెద్ద మోడల్‌లను కలిగి ఉంది. రిలయన్స్ డిజిటల్‌లో ప్రతి స్టోర్‌లో శిక్షణ పొందిన సిబ్బంది ప్రతి ప్రొడక్టుకు సంబంధించిన ప్రతి వివరాల గురించి కస్టమర్‌లకు సూచనలు చేస్తుంటారు. ముఖ్యంగా, రిలయన్స్ డిజిటల్ అన్ని ప్రొడక్టులపై మరెన్నో సేవలను అందిస్తుంది.