రిలయన్స్ జియో కొత్త Postpaid Plus ప్లాన్లు.. ఉచితంగా OTT సబ్ స్ర్కిప్షన్

ప్రముఖ టెలికం సంస్థ రిలయన్స్ జియో కొత్త పోస్టు పెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ప్రత్యేకించి జియో పోస్టు పెయిడ్ యూజర్ల కోసం ఈ కొత్త ప్లాన్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రారంభ ధర రూ.399లతో JioPostpaid Plus ప్లాన్లను అందిస్తోంది.
ఇందులో OTT యాప్స్ Netflix, Amazon Prime, Disney+ Hotstar ఉచితంగా సబ్ స్ర్కిప్షన్ కూడా పొందొచ్చు.. ఎంటర్ టైన్మెంట్ యాప్స్ సర్వీసుల కోసం 500GB డేటాను ఈ ప్లాన్‌పై అందిస్తోంది.
USA, UAE కు ఉచితంగా ఇంటర్నేషనల్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఇతర టెలికం పోస్టు పెయిడ్ యూజర్లు ఎవరైనా జియో కనెక్షన్లకు మారితే వారి క్రెడిట్ లిమిట్ తోనే ఉచితంగా కొత్త SIM కార్డులను హోం డెలివరీ చేయనుంది రిలయన్స్ జియో.
నెలవారీ జియో టారిఫ్ ప్లాన్లు :
రూ.399, రూ.599, రూ.799, రూ.999, రూ.1,499 నెలవారీ ప్యాకులను అందిస్తోంది. ఈ టారిఫ్ ప్లాన్లలో వేర్వేరుగా ఆఫర్లు అందిస్తున్నాయి. డేటా లిమిట్ కూడా అందిస్తోంది రిలయన్స్ జియో.
* JioPospaid plus :
– Netflix, Amazon Prime and Disney+ Hotstar ఉచితంగా సబ్ స్ర్కిప్షన్ పొందొచ్చు.
– జియో యాప్‌లో 650+ live TV channels, video content, songs, newspapers యాక్సస్ చేసుకోవచ్చు.
* Features plus
– రూ.250 కనెక్షన్ తీసుకుంటే ఫ్యామిలీ మొత్తం ఈ ప్లాన్ వినియోగించుకోవచ్చు.
– 500GB వరకు డేటాను అందిస్తోంది.
– ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికైనా Wi-Fi కాలింగ్ చేసుకోవచ్చు.
* International plus
విదేశాలకు వెళ్లే భారతీయ విమాన ప్రయాణికులకు ఈ కొత్త ప్లాన్ అందిస్తోంది.
– USA, UAEలో ఉచితంగా అంతర్జాతీయ రోమింగ్ సర్వీసులను అందిస్తోంది.
– ఇండియా నుంచి అంతర్జాతీయ రోమింగ్ పై @ Re 1తో Wi-fi కాలింగ్ చేసుకోవచ్చు.
– నిమిషానికి 50 పైసల నుంచి అంతర్జాతీయ కాలింగ్ (ISD) చేసుకోవచ్చు.
ఈ పోస్టు పెయిడ్ అన్ని ప్లాన్ల కింద అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ పొందవచ్చు..
* నెట్ ఫ్లెక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్, హాట్ స్టార్ ఓటీటీ నుంచి ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా సబ్ స్ర్కిప్షన్ పొందవచ్చు.
* JioPostpaid Plus ప్లాన్ల కోసం www.jio.com/postpaid for more details విజిట్ చేయండి.
సెప్టెంబర్ 24నుంచి JioPostpaid Plus ఆఫర్ అన్ని జియో స్టోర్లలో ప్రారంభం కానుంది. ఈ ప్లాన్ యాక్సస్ కోసం ఉచితంగా హోం డెలివరీ కూడా అందిస్తోంది.