మీరు రెడీనా? : పెరగనున్న జియో టారిఫ్ ధరలు?
ప్రముఖ టెలికం ఇండస్ట్రీ దిగ్గజం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ టారిఫ్ ధరలు పెంచబోతుందా?

ప్రముఖ టెలికం ఇండస్ట్రీ దిగ్గజం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ టారిఫ్ ధరలు పెంచబోతుందా?
ప్రముఖ టెలికం ఇండస్ట్రీ దిగ్గజం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ టారిఫ్ ధరలు పెంచబోతుందా? ఫ్రీ డేటాతో ఆరంభమై.. జియో యూజర్లకు చౌకైన ధరకే అందించిన జియో డేటా టారిఫ్ ప్లాన్లు అమాంతం పెరిగిపోనున్నాయా? అంటే అవును… టారిఫ్ రేట్లు పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. 400 మిలియన్ల (40కోట్ల మంది) సబ్ స్ర్కైబర్లకు చేరడమే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తున్న రిలయన్స్ జియో.. ఇలాంటి సంచలన నిర్ణయాన్ని తీసుకునేందుకు రెడీగా ఉందా? అనేదానిపై విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రిలయన్స్ జియో ఆర్థిక సంవత్సరంలో స్పెషల్ పర్పస్ వెహికల్స్ (SPVs), జియో ఫైబర్స్, టవర్ల ఆస్తులకు సంబంధించిన దీర్ఘకాలిక లీజింగ్ డీల్స్ కోసం రూ.9వేల కోట్లు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది.
Also Read : చెక్ చేశారా? : Paytmలో క్రెడిట్ స్కోరు ఫీచర్
అదనంగా 4G సర్వీసులపై ఫోకస్ :
ఈ క్రమంలో జియో టారిఫ్ ధరలు పెంచాలనే యోచనలో జియో ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. జియో కంపెనీ పెరుగుతున్న 4G సర్వీసులపై ఫోకస్ పెట్టిందని, ఈ ఆర్థిక సంవత్సరంలో టారిఫ్ ధరలు పెంచే యోచనలో ఉన్నట్టు జేఎమ్ ఫైనాన్షియల్ జేపీ మోర్గాన్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే జియో మొబైల్ డేటా నెట్ వర్క్ సర్వీసును అందిస్తున్న రిలయన్స్ జియో.. బ్రాడ్ బ్యాండ్ (FTTH)సర్వీసును కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫైబర్ నెట్ వర్క్ సర్వీసును కూడా 50 మిలియన్ల సబ్ స్ర్కైబర్లు చేరడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఇందుకు జియో క్యాపిటల్ ఎక్స్ పెండేచర్ (మూలధనం ఖర్చు) చేయాల్సి అవసరం పడుతోంది. టవర్, ఫైబర్ ఆస్తుల విభజనతో మూలధన వ్యయం నాటకీయంగా తిరోగమనం చెందే అవకాశం ఉంది. జియో టారిఫ్ ధరలు పెంచడం వల్ల ప్రయోజనదారులకు పెద్ద రిలీఫ్ కలుగనుంది. టారిఫ్ రేట్ల పెంపుతో కోల్పోయిన నష్టాన్ని తిరిగి పొందే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
టారిఫ్.. పెంచాల్సిన అవసరం లేదు :
టారిఫ్ ధరలు పెంపుతో మొబైల్ బ్రాడ్ బ్యాండ్ సబ్ స్ర్కైబర్లు 65శాతానికి పడిపోయే అవకాశం ఉన్నట్టు అంచనా. 2016 నుంచి జియో 4G సర్వీసులను లాంచ్ చేసిన జియో.. అప్పటి నుంచి 300 మిలియన్ల మంది సబ్ స్రైబర్లు యూజర్లుగా చేరిపోయారు. 4జీ సర్వీసు ప్రారంభంలో 6 నెలల పాటు ఫ్రీగా ఈ సర్వీసును యూజర్లకు జియో అందించింది. ఈ సర్వీసుపై కనీస టారిఫ్ కింద ఫ్రీ వాయిస్ కాల్స్, చీప్ డేటా టారిఫ్ లు అందించింది. కొందరు విశ్లేషకులు మాత్రం.. జియో సర్వీసును యాక్సస్ చేసుకునేందుకు ప్రతినెల అధిక సంఖ్యలో యూజర్లు చేరుతున్నారని, రిలయన్స్ జియో టారిఫ్ రేట్లను పెంచాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
Also Read : మీ ఆధార్ కార్డు పోయిందా? : e-Aadhaar డౌన్ లోడ్ చేసుకోండిలా
మార్చి నెల నాటికి జియో కంపెనీలో 9.5 మిలియన్ల (95లక్షల మంది) సబ్ స్రైబర్లు చేరిపోయారు. జియో 4జీ సర్వీసు, జియో ఫోన్ల సర్వీసుతో కలిపి 50-60 శాతం షేర్లను సాధించగలదని జేఎం ఫైనాన్షియల్ ఎనాలిస్ట్ అంచనా వేశారు. 2019 మార్చి త్రైమాసికం ముగిసే నాటికి నెట్ ప్రాఫిట్ రూ.840 కోట్లతో 65శాతం ఎగసినట్టు నివేదిక వెల్లడించింది. 2018లో జియో కొత్త 4జీ సర్వీసుపై 60 శాతం షేర్లు సాధించగా, 2018 డిసెంబర్ చివరి నాటికి 4జీ సబ్ స్ర్కైబర్లు 65శాతానికి పెరిగిపోయారు. 2018లో 4జీ డేటా ట్రాఫిక్ 70శాతానికి పెరిగితే.. మొత్తం మీద ట్రాఫిక్ 61శాతానికి పెరిగింది.
జియో క్యాపెక్స్ నాల్గో క్వార్టర్లో ఆర్థిక సంవత్సరం FY20 నాటికి రూ.21వేల 500 కోట్లు పెరగగా.. మొత్తం క్యాపెక్స్ ఆర్థిక సంవత్సరంలో 10 బిలియన్ డాలర్లు (రూ.70వేల కోట్లు ) వరకు పెరిగినట్టు అంచనా. మరోవైపు రిలయన్స్ జియో పోటీని తట్టుకునేందుకు VIL, ఎయిర్ టెల్ తమ 4G సర్వీసులను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నాయి. ఇందుకోసం రూ.25వేల కోట్లతో ప్లాన్ చేస్తున్నట్టు నివేదిక చెబుతోంది.