Jio సరికొత్త Offer: అదిరిపోయే బెనిఫిట్స్ మీకోసం!
ఎన్నిరోజులు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ కింది అంశాలను ఓసారి చదవాల్సిందే.

ఎన్నిరోజులు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ కింది అంశాలను ఓసారి చదవాల్సిందే.
ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో.. ఈ వారమే న్యూ ఇయర్ థీముడ్ స్కీమ్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇండియాలోని జియో ఫోన్ యూజర్లు, స్మార్ట్ ఫోన్ యూజర్ల అందరికి ఈ New Year 2020 ఆఫర్ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది.
రూ.2,020తో రీఛార్జ్ చేసుకునే కస్టమర్లకు బండిలింగ్ Unlimited సర్వీసులను ఆఫర్ చేస్తోంది. జియో అందించే ఆఫర్ తో స్మార్ట్ ఫోన్ యూజర్లకు, జియో ఫోన్ యూజర్లకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి. ఎన్నిరోజులు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ కింది అంశాలను ఓసారి చదవాల్సిందే.
ఎప్పటినుంచి అంటే?
రిలయన్స్ జియో లేటెస్ట్ 2020 Happy New Year ఆఫర్ (డిసెంబర్ 24, 2019) నుంచే అందుబాటులోకి వచ్చేసింది. జియో యూజర్లు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది.. ఈ ఆఫర్ కేవలం Limited Period (పరిమిత సమయం) మాత్రమే అందుబాటులో ఉంటుంది.
స్మార్ట్ ఫోన్ యూజర్లకు :
రిలయన్స్ జియో స్మార్ట్ ఫోన్ యూజర్లకు Unlimited Voice కాల్స్ ఆఫర్ చేస్తోంది. రోజుకు 1.5GB డేటాను అందిస్తోంది. అంతేకాదు… హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్ కింద SMSలతో పాటు కంపెనీ ష్యూట్ యాప్స్ యాక్సస్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ ప్లాన్ పై 365 రోజుల వరకు వ్యాలిడెటీ పొందవచ్చు.
కొత్త ఏడాది ప్లాన్ కింద యూజర్లు రూ.2,020 తో రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. నాన్ జియో వాయిస్ కాల్స్ పై FUP లిమిట్ ఉంటుందనే విషయం మరవద్దు. ఈ FUP లిమిట్ దాటితే నిబంధనల ప్రకారమే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
జియో ఫోన్ యూజర్లకు :
ఈ న్యూ ఇయర్ స్కీమ్ కింద జియో యూజర్లు రూ.2,020 చెల్లిస్తే కొత్త Jio Phone స్మార్ట్ ఫీచర్ ఫోన్ పొందవచ్చు. 12 నెలల సర్వీసు కూడా ఉచితంగా పొందవచ్చు. అంతేకాదు.. రోజుకు 0.5GB డేటాతో పాటు SMSలు కూడా ఫీచర్ ఫోన్ యూజర్లు పొందవచ్చు. రిలయన్స్ జియో యాప్స్ కూడా యాక్సస్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడెటీ 12 నెలలు మాత్రమే ఉంటుంది.
బోనస్ ఆఫర్ :
ఇండియాలోని తమ కస్టమర్ల కోసం రిలయన్స్ జియో ఇటీవలే పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్లలో రూ.98, రూ.149 ప్లాన్లను పున: ప్రవేశపెట్టింది. రూ.98తో రీఛార్జ్ చేస్తే.. రిలయన్స్ జియో యూజర్లు 2GB డేటా, 300SMS లు పొందవచ్చు.
జియో యాప్స్ కూడా యాక్సస్ చేసుకోవచ్చు. జియో టూ జియో నెట్ వర్క్ కు ఉచితంగా అపరిమిత వాయిస్ కాల్స్ పొందవచ్చు. ఉచిత IUC నిమిషాలతో కలిపి ఈ ప్లాన్ ఆఫర్ చేస్తోంది జియో. రూ.98 ప్లాన్ కాల పరిమితి 28 రోజుల వరకు ఉంటుంది.