Reliance Tira Beauty Store : హైదరాబాద్‌లో ఓమ్ని ఛానల్ రిలయన్స్ బ్యూటీ రిటైల్ ‘టీరా’ ఫస్ట్ స్టోర్ ప్రారంభం..

Reliance Tira Beauty Store : హైదరాబాద్‌లోని శరత్ సిటీ మాల్‌లో రిలయన్స్ రిటైల్ ఓమ్మీ చానల్ బ్యూటీ రిటైల్ ‘టీరా’ ఫస్ట్ స్టోర్ ప్రారంభమైంది.

Reliance Tira Beauty Store : హైదరాబాద్‌లో ఓమ్ని ఛానల్ రిలయన్స్ బ్యూటీ రిటైల్ ‘టీరా’ ఫస్ట్ స్టోర్ ప్రారంభం..

Reliance Retail's beauty platform Tira expands presence in India, opens store in Hyderabad

Updated On : September 29, 2023 / 11:57 PM IST

Reliance Tira Beauty Store : రిలయన్స్ రిటైల్ ఓమ్ని-ఛానల్ బ్యూటీ రిటైల్ ప్లాట్‌ఫారమ్ టీరా (Tira First Store in Hyderabad) హైదరాబాద్‌లో తన మొదటి స్టోర్‌ను ప్రారంభించింది. ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్ (Jio World Drive) ఇన్ఫినిటీ మాల్ మలాడ్‌లో స్టోర్‌ ద్వారా సక్సెస్ అందుకుంది. ఈ స్టోర్ ఆధారంగా బ్రాండ్ హైదరాబాద్ స్టోర్ శరత్ సిటీ (Sarat City Mall) మాల్‌లో కొత్త టీరా స్టోర్ ప్రారంభించింది. టీరా వినియోగదారులకు ఉన్నతమైన షాపింగ్ అనుభవాన్ని అందించడానికి గ్లోబల్, హోమ్‌గ్రోన్ బ్యూటీ బ్రాండ్‌లను అందిస్తుంది.

Read Also : Google Chrome Users : గూగుల్ క్రోమ్ యూజర్లు తస్మాత్ జాగ్రత్త.. మీ బ్రౌజర్ వెంటనే అప్‌డేట్ చేయండి.. లేదంటే.. మీ పీసీ కంట్రోల్ హ్యాకర్ల చేతుల్లోకి..!

కస్టమర్ల కోసం టచ్ పాయింట్లు :
తీరా స్టోర్‌ను విజిట్ చేయగానే కస్టమర్ల కోసం అనేక టచ్ పాయింట్‌లు ఉన్నాయి. అత్యంత ప్రజాదరణ పొందిన వెండింగ్ మెషీన్ ప్రతి కస్టమర్ ఇంటికి తీసుకెళ్లడానికి బ్యూటీ ట్రీట్లు, శాంపిల్స్‌ను పంపిణీ చేస్తుంది. మరో స్పెషల్ ఫీచర్ ‘టీరా సిగ్నేచర్ లుక్స్’ కస్టమర్లను మరింత ఆకట్టుకునేలా ఉంది. నైపుణ్యం కలిగిన గ్లామర్ అడ్వైజర్ల ద్వారా కాంప్లిమెంటరీ గ్లామర్ లుక్‌ను పొందవచ్చు. స్పెషల్ ఎన్‌గ్రేవింగ్ మిషన్ సహా ఇతర గిఫ్ట్ స్టేషన్‌లు కస్టమర్‌లు వారి కొనుగోళ్లను కేటగిరీ చేయడంలో సాయపడతాయి. వినియోగదారులకు బహుమతులను ప్రత్యేకంగా తయారు చేయడంలో సాయపడతాయి.

Reliance Retail's beauty platform Tira expands presence in India, opens store in Hyderabad

Reliance Tira Beauty Store

టీరా స్టోర్‌లో ప్రత్యేక బ్యూటీ ఎక్స్‌పీరియన్స్ :
ఈ స్టోర్‌లో ‘Fragrance Finder‘ వంటి వినూత్న అంశాలను పొందుపరిచారు. కేటగిరీ చేసిన ఫ్రాగ్రాన్స్ నోట్ల ఆధారంగా సువాసనలను ఎంచుకోవడంలో కస్టమర్‌లకు సాయపడేలా టూల్ రూపొందించారు. టీరా హైదరాబాద్ స్టోర్ రిటైల్ బ్యూటీ ఎక్స్ పీరియన్స్ విప్లవాత్మకంగా మార్చాలని భావిస్తోంది. బ్యూటీ ప్రాధాన్యతలను అన్వేషించడానికి కస్టమర్‌లకు ఇంటరాక్టివ్, టెక్-ఆధారిత వాతావరణాన్ని అందిస్తోంది. టీరా నిరంతరం బ్యూటీ రిటైల్ ల్యాండ్‌స్కేప్‌ను పునర్నిర్మించడంతో ఔత్సాహికులందరిని ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది.

టీరా ఇటీవల కరీనా కపూర్ ఖాన్, కియారా అద్వానీ, సుహానా ఖాన్ వంటి ప్రముఖలు కలిగిన ‘ఫర్ ఎవ్రీ యూ’ పేరుతో స్టార్టప్ హై-ఇంపాక్ట్ 360-డిగ్రీ క్యాంపెయిన్ ఆవిష్కరించింది. ఈ క్యాంపెయిన్‌లో వినియోగదారులు ఎదుర్కొనే విభిన్న పాత్రలు, భావోద్వేగాలు, మనోభావాలకు నివాళులు అర్పిస్తుంది, అంతేకాకుండా, టీరా యాప్ పాపులారిటీని సూచిస్తూ 1.5 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌ల మైలురాయిని పొందింది. టీరా భారత్ అంతటా 98 శాతం పిన్ కోడ్‌లను కవర్ చేస్తుంది. 100కి పైగా నగరాల్లోని వినియోగదారులకు చేరువైంది.

Read Also : Google Pixel 8 India Launch : గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ వచ్చేస్తోంది.. అక్టోబర్ 4నే లాంచ్.. భారత్‌లో ధర ఎంత ఉండొచ్చుంటే?