ముందే కొనేసుకోండి.. జనవరి నుంచి కార్ల ధరలు పెరుగుతున్నాయి!

ముందే కొనేసుకోండి.. జనవరి నుంచి కార్ల ధరలు పెరుగుతున్నాయి!

Updated On : December 19, 2020 / 10:34 AM IST

Car Prices to Hike from January 2021 : కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే త్వరపడండి.. ధరలు పెరిగిపోతున్నాయి.. వచ్చే ఏడాది జనవరి నుంచి కార్ల ధరలు అమాంతం పెరిగిపోనున్నాయి. ఇప్పటికే పలు వాహనాల తయారీదారు కంపెనీలు ధరలు పెంచుతున్నట్టు ప్రకటించగా.. మరో కంపెనీ రెడీ అయింది. జనవరి 1 నుంచి అన్నిరకాల మోడల్ కార్లపై రూ.28వేల వరకు ధరలను పెంచనున్నట్టు రెనాల్ట్ కంపెనీ ప్రకటించింది.

రెనాల్ట్ తయారుచేసే కారు మోడళ్లలో కివిడ్, డస్టర్, ట్రిబర్ మోడల్ కార్ల ధరలు పెరగనున్నాయి. ఈ ధరల పెరుగదలకు స్పెక్ర్టామ్ లో ఇన్ పుట్ కాస్ట్ క్రమంగా పెరిగిపోవడంతో స్టీల్, అల్యూమినియం, ప్లాస్టిక్ ఉత్పత్తి వ్యయం కూడా పెరగిపోతోంది.

దాంతో కారు మోడళ్ల ధరలను పెంచాల్సి వచ్చిందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. మహమ్మారి సమయంలో ప్లాస్టిక్ సహా ఇతర ఉత్పత్తుల వ్యయం పెరగడంతో ధరలు పెంచాలనే నిర్ణయానికి వచ్చినట్టు పేర్కొంది. ఆటో మొబైల్ తయారీదారుల్లో మారుతి సుజూకీ ఇండియా, ఫోర్డ్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు కూడా తమ కార్ల ధరలను జనవరి 1 నుంచి పెంచనున్నట్టు ప్రకటించాయి.

ఇటీవల వారంలోనే ద్విచక్ర వాహనాల్లో ప్రధానంగా హీరో మోటోకార్పోరేషన్ కూడా బైక్ ధరలను పెంచనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. జనవరి 1, 2021 నుంచి ఇన్ పుట్ కాస్ట్ పెరగనుంది. దీంతో ద్విచక్రవాహనాల ధరలు కూడా మరింత ప్రియం కానున్నాయి.