రిపబ్లిక్ డే ఆఫర్లు: BSNL కొత్త ఆఫర్
రిపబ్లిక్ డే సందర్భంగా టెలికం రంగ దిగ్గజాలు తమ కస్టమర్ల కోసం భారీ ఆఫర్లు అందిస్తున్నాయి. . ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BSNL కూడా ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రిపబ్లికే డే ఆఫర్లతో ముందుకొచ్చింది.

రిపబ్లిక్ డే సందర్భంగా టెలికం రంగ దిగ్గజాలు తమ కస్టమర్ల కోసం భారీ ఆఫర్లు అందిస్తున్నాయి. . ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BSNL కూడా ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రిపబ్లికే డే ఆఫర్లతో ముందుకొచ్చింది.
రిపబ్లిక్ డే సందర్భంగా టెలికం రంగ దిగ్గజాలు తమ కస్టమర్ల కోసం భారీ ఆఫర్లు అందిస్తున్నాయి. ఎయిర్ టెల్, ఐడియా, రిలయన్స్ జియో రిపబ్లిక్ డే ఆఫర్లతో ఆకట్టుకుంటుండగా.. ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BSNL కూడా ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రిపబ్లికే డే ఆఫర్లతో ముందుకొచ్చింది. ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రూ.269 రీఛార్జ్ కొత్త ప్యాక్ ను ప్రవేశపెట్టింది. BSNL ప్రీపెయిడ్ యూజర్లు ఈ కొత్త ప్యాక్ తో రీఛార్జ్ చేసుకుంటే 26 రోజుల కాల పరిమితిపై 2.6జీబీ డేటా పొందొచ్చు. అంతేకాదు.. 2600 నిమిషాల ఉచిత కాల్స్, 260 ఉచిత ఎస్ఎంఎస్ లు పొందొచ్చు. ఈ లిమిటెడ్ ఆఫర్ జనవరి 26 (రిపబ్లిక్ డే) నుంచి జనవరి 31 వరకు మాత్రమే వర్తిస్తుంది. ఇటీవలే బీఎస్ఎన్ఎల్ రూ.99 రీఛార్జ్ ప్యాక్ (అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్) ఆఫర్ ను రివైజ్ చేసింది.
తొలుత 26 రోజుల కాల పరిమితిపై ఈ ప్యాక్ ను అందించిన బీఎస్ఎన్ఎల్.. ప్రస్తుతం 24 రోజుల కాలపరిమితిపై అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న మరో కొత్త ప్యాక్ రూ.899 రీఛార్జ్. ఈ ప్యాక్ ను (ముంబై, ఢిల్లీ సర్కిల్స్ మినహా) 180 రోజుల కాలపరిమితిపై రోజుకు 1.5 జీబీ డేటా, 50 ఎస్ఎంఎస్, అన్ లిమిటెడ్ వాయిల్ కాల్స్ అందిస్తోంది. BSNL SIM మార్పిడిపై కూడా ఛార్జీలను పెంచేసింది. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ సిమ్ కార్డుల మార్పిడిపై రూ. 100కు పెంచేసింది. రిలయన్స్ జియో అందిస్తోన్న గిగాఫైబర్ కు కౌంటర్ గా BSNL భారత్ పైబర్ పేరిట బ్రాడ్ బ్యాండ్ సర్వీసును ప్రారంభించింది. ఈ సర్వీసుపై ఈయర్లీ ప్రీపెయిడ్ రీఛార్జ్ ఆప్షన్ కూడా అందిస్తోంది.