ఐదేళ్ల గరిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం

  • Published By: venkaiahnaidu ,Published On : January 13, 2020 / 02:51 PM IST
ఐదేళ్ల గరిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం

Updated On : January 13, 2020 / 2:51 PM IST

పెరిగిన ఆహార ధరలు,ముఖ్యంగా కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకడంతో రిైటైల్ ద్రవ్యోల్బణం ఐదేళ్ల గరిష్ఠానికి చేరుకుంది. సోమవారం(జనవరి-13,2020)కేంద్రగణాంకాల శాఖ విడుదల చేసిన  వినియోగదారుల ధరల సూచీ(CPI)డేటా ప్రకారం డిసెంబర్ 2019లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.35శాతం పెరిగింది. 2014జులై నుంచి ఇదే అత్యధికమని అధికార డేటా చెబుతోంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)నిర్దేశించిన 4శాతం లక్ష్యాన్ని 2శాతం మార్జిన్ తో రిటైల్ ద్రవ్యోల్బణం అధిగమించింది. డిసెంబర్ లో 7.35శాతం రిటైల్ ద్రవ్యోల్బణం ఉండగా,నవంబర్ లో 5.54శాతం నమోదైంది. అయితే 2018 డిసెంబర్ లో రిటైల్ ద్రవ్యోల్బణం 2.11శాతం ఉన్న విషయం తెలిసిందే. అంతకుముందు రిటైల్ ద్రవ్యోల్బణం గరిష్ఠంగా 2016 జులైలో 6.07శాతంగా నమోదైంది. 

మరోవైపు ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం డిసెంబర్ 2019లో 14.12శాతం పెరిగింది. అయితే 2018 డిసెంబర్ లో -2.65శాతంగా ఉంది. 2019 డిసెంబర్ లో ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం 10.01శాతంగా ఉంది. ఇక ఇంధన ధరలు మాత్రం నవంబర్ 2019లో 1.9శాతంతో పోల్చుకుంటే డిసెంబర్ లో 2019లో 0.7శాతం తగ్గాయి. మాంసం,చేపల ధరలు కూడా దాదాపు 10శాతం పెరిగాయి. పప్పు ధాన్యాలు సంబంధిత ఉత్పత్తుల ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 15.44శాతం పెరిగింది.