రాయల్ ఎన్‌ఫీల్డ్ సరికొత్త క్లాసిక్ 350 ABS రూ .1.53 లక్షలు

  • Published By: veegamteam ,Published On : February 27, 2019 / 06:37 AM IST
రాయల్ ఎన్‌ఫీల్డ్ సరికొత్త క్లాసిక్ 350 ABS రూ .1.53 లక్షలు

Updated On : February 27, 2019 / 6:37 AM IST

రాయల్ ఎన్‌ఫీల్డ్ తాజాగా తన క్లాసిక్ 350 బేస్ వేరియంట్‌ను అప్‌డేట్ చేసింది. డ్యూయెల్ చానల్ ABS ఫీచర్‌ను జతచేసింది. బైక్ ఢిల్లీ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1,53,245. నాన్ ABS వేరియంట్‌తో పోలిస్తే తాజా బైక్ ధర దాదాపు రూ.6,000 ఎక్కువ. డ్యూయెల్ చానల్ ABS ఫీచర్ జతచేసినప్పుడు బైక్ ధర ఇంత తక్కువ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. 

ABS మినహా అప్‌డేటెడ్ క్లాసిక్ 350 బైక్‌లో వేరే ఇతర మార్పులు ఏమీ లేవు. ఈ బైక్‌లో 346 CC ఇంజిన్, సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. కాగా కంపెనీ ఇప్పటికే క్లాసిక్ 350 రేంజ్‌ను డ్యూయెల్ చానల్ ABS తో అప్‌డేట్ చేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350, 350 ES బైక్స్‌లో ఈ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది. ఏప్రిల్ 1లోపు వీటిల్లోనూ డ్యూయెల్ చానల్ ABS ఫీచర్ అందుబాటులోకి రావొచ్చు.