Silver Price Decreased : వెండి ధర ఢమాల్..! గంటలోనే రూ.21వేలు డౌన్.. భారీగా తగ్గడానికి కారణాలు ఇవే.. ఇంకా తగ్గుతుందా..

Silver Price Decreased : భారతదేశంలో భారీగా పెరుగుతున్న వెండి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. కొన్ని గంటల్లోనే భారీ పతనాన్ని చవిచూసింది.

Silver Price Decreased : వెండి ధర ఢమాల్..! గంటలోనే రూ.21వేలు డౌన్.. భారీగా తగ్గడానికి కారణాలు ఇవే.. ఇంకా తగ్గుతుందా..

Silver Price Decreased

Updated On : December 29, 2025 / 8:35 PM IST

Silver Price Decreased : నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ వేళ వెండి (Silver) కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా..? అయితే, మీకు భారీ శుభవార్త. వెండి రేటు (Silver Price Decreased) ఒక్కసారిగా భారీగా తగ్గింది. గంటల వ్యవధిలోనే రూ.21వేలు పతనమైంది.

కొద్దిరోజులుగా వెండి ధర ఆకాశమే హద్దుగా దూసుకెళ్తుంది. ఫలితంగా సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. అయితే, మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో మార్చి కాంట్రాక్ట్ వెండి కిలో ధర గంటలోనే రూ.21వేలు మేర తగ్గింది. నాన్-స్టాప్ ర్యాలీ తర్వాత కేజీ వెండి ధర రూ. 254,174 నుంచి రూ. 233,120కు చేరింది.

రాజకీయ, భౌగోళిక కారణాల వల్ల వరుసగా పెరుగుతూ వచ్చిన వెండి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. గ్లోబల్ మార్కెట్లో 50 డాలర్ల దిగువన ట్రేడవుతూ.. ఔన్సుకు 80డాలర్ల మార్కును దాటేసింది. గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్ కారణంగా వెండి రేటు భారీగా దిగొచ్చింది.

వెండి ధర పతనం అవ్వడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి. రష్యా- యుక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం విషయంలో కీలక అడుగు పడింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధానికి తెరపడుతుందనే అంచనాలు బలపడ్డాయి. ఈ క్రమంలో వెండి ధర పతనం అయింది. అంతేకాక.. వెండిలో అమ్మకాల ఒత్తిడికి చికాగో మర్చంట్ ఎక్స్ఛేంజీ కూడా మరో కారణంగా తెలుస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు వెండి రేటు 181శాతం మేర పెరిగింది. గరిష్టాల నేపథ్యంలో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగడమూ వెండి ధర పతనానికి కారణమని అనలిస్టులు పేర్కొంటున్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 2026 జనవరి నెలలో వెండి రేటు పతనమయ్యే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చేనెలలో రష్యా, యుక్రెయిన్ యుద్ధంకు ముగింపు పలికే విషయంలో మరిన్ని చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ చర్చలు అన్ని విధాల సఫలం అయితే.. వెండి రేటు మరింత తగ్గుతుందనే వాదన కూడా ఉంది.

Also Read : AP Cabinet Meeting : ఏపీ క్యాబినెట్‌‌లో కీలక నిర్ణయాలు ఇవే.. 17జిల్లాల్లో మార్పులు.. పూర్తి వివరాలు ఇలా..