RIL గ్రూపుతో చర్చలు : Network18లో వాటా కొంటున్న Sony

  • Published By: sreehari ,Published On : November 21, 2019 / 11:18 AM IST
RIL గ్రూపుతో చర్చలు : Network18లో వాటా కొంటున్న Sony

Updated On : November 21, 2019 / 11:18 AM IST

జపాన్‌కు చెందిన సోనీ కార్పొరేషన్ కంపెనీ ముఖేశ్ అంబానీ మీడియా గ్రూపు Network 18లో షేర్లు కొనబోతోంది. అంబానీ సొంత రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) ప్రమోటెడ్ మీడియా గ్రూపు నెట్ వర్కింగ్ 18 మీడియా అండ్ ఇన్వెస్ట్ మెంట్స్ లిమిటెడ్‌లో వాటాను కొనుగోలు చేయనుంది. దీనికి సంబంధించి ఇరు కంపెనీల మధ్య చర్చలు కొనసాగుతున్నట్టు సమాచారం. బ్లూమ్ బెర్గ్ రిపోర్టు ప్రకారం.. సౌత్ ఇండియన్ నేషన్ ఇండియాలో మీడియా కంటెంట్ కు భారీ డిమాండ్ ఉండటంతో జపాన్ దిగ్గజం సోనీ.. ఇండియన్ టెలివిజన్ నెట్‌వర్క్ లో వాటా కొనాలని భావిస్తోంది.

ప్రస్తుతం టోక్యో ఆధారిత కంపెనీ సోనీ.. నెట్ వర్క్18లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఈ విషయాన్ని పేరు చెప్పేందుకు అంగీకరించని వ్యక్తి ఒకరు తెలిపారు. అనుబంధ సంస్థల ద్వారా అంబానీ నెట్ వర్కింగ్ 18లో వాటాపై నియంత్రణ ఉంది. భారత్ లో మీడియా కంటెంట్ కు రోజురోజుకీ భారీ డిమాండ్ పెరుగుతుండటంతో సోనీ కంపెనీ నెట్ వర్కింగ్ 18లో వాటా కొనుగోలు చేసేందుకు ఉత్సాహం కనపరుస్తోందని బ్లూమ్ బెర్గ్ రిపోర్టు తెలిపింది. నెట్ వర్కింగ్ 18 కంపెనీతో ఒప్పందానికి సంబంధించి ఎన్నో అంశాలను సోనీ పరిగణనలోకి తీసుకుంటోంది.

నెట్ వర్కింగ్ 18 కంపెనీలో వాటా కోసం బిడ్ వేయడం లేదా భారత్ లోని తమ వ్యాపారాన్ని న్యూస్18 ఎంటర్ టైన్ మెంట్ ఛానళ్లతో విలీనం చేయడంపై సోనీ సమీక్షిస్తోందని రిపోర్టు తెలిపింది. అయితే, ఈ చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని, లావాదేవీలతో ముగియకపోవచ్చునని నివేదిక పేర్కొంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. మీడియాలో వచ్చే ఊహాగానాలు, పుకార్లపై తాము స్పందించబోమన్నారు.

‘ కంపెనీ కొనసాగుతున్న ప్రాతిపదికన పలు అవకాశాలను అంచనా వేస్తుంది. సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్క్లోజర్ రెక్వైర్మెంట్స్) రెగ్యులేషన్స్ 2015 స్టాక్ ఎక్స్ఛేంజీలతో ఒప్పందాల ప్రకారం బాధ్యతలకు అనుగుణంగా అవసరమైన ప్రకటనలు చేస్తాము’ అని ప్రతినిధి ఒకరు తెలిపారు. గురువారం మధ్యాహ్న సమయం 12.37 గంటలకు BSEలో నెట్‌వర్క్18 షేర్లు రూ.29.60 దగ్గర ట్రేడవుతున్నాయి. అంతకు ముందు ముగింపులో రూ .3.90 లేదా 15.18 శాతం పెరిగింది.