Stock markets: స్టాక్ మార్కెట్లు ఢమాల్.. బంగారం కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్..

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. ప్రస్తుతం ఔన్సు ధర 2,860 డాలర్ల వద్ద కదలాడుతోంది. రాబోయే రోజుల్లో బంగారం రేటు..

Stock markets: స్టాక్ మార్కెట్లు ఢమాల్.. బంగారం కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్..

Stock Market

Updated On : February 28, 2025 / 1:47 PM IST

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సుచీలు శుక్రవారం భారీ నష్టాలతో మొదలు పెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపాయి. దీంతో ప్రారంభంలోనే స్టాక్ మార్కెట్లు పెద్దెత్తున నష్టాల్లోకి జారుకున్నాయి. దీంతో ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్ టెల్, ఎంఅండ్ఎం, టీసీఎస్ వంటి ప్రధాన షేర్లలో విక్రయాలతో మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. మరోవైపు ఐటీ, మెటల్ స్టాక్స్ కుదేలయ్యాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ 87.33 వద్ద కొనసాగుతుండగా.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. బంగారం ఔన్సు 2,860 డాలర్ల వద్ద కదలాడుతోంది.

Also Read: Gold Rate: భారీగా తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్, విజయవాడలో తులం గోల్డ్ రేటు ఎంతంటే?

దేశంలోనూ బంగారం ధరలపై ప్రభావం పడింది. దీంతో బంగారం ధరలు వరుసగా మూడోరోజూ దిగొచ్చాయి. మూడు రోజుల్లో కలిపి బంగారం రేటు రూ.1250 తగ్గింది. దీంతో 22 క్యారట్ల గోల్డ్ రూ. 80వేల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 24 క్యారట్ల 10గ్రాముల గోల్డ్ రేటు 86,840 కాగా.. 22 క్యారట్ల రూ. 79,600గా నమోదయ్యాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్ లో గురువారం రాత్రి గోల్డ్ రేటు ఒకశాతంపైగా తగ్గి ఔన్సు 2,900 డాలర్ల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం ఔన్సు 2,860 డాలర్లుగా ఉంది. ఇటీవల గోల్డ్ రికార్డు స్థాయిలో 2,956 డాలర్లు దాటింది. అనూహ్యంగా ఈవారం గోల్డ్ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో ఔన్సు గోల్డ్ 80డాలర్లకు పైగా తగ్గింది. ఇవాళ యూఎస్ ద్రవ్యోల్బణ డేటా వెలువడనుండటంతో ఇన్వెస్టర్లు గోల్డ్ పై పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు.

Also Read: SIF Investment Funds : రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లకు అలర్ట్.. రూ.10 లక్షల పెట్టుబడితో ‘సిఫ్’.. సెబీ కొత్త రూల్స్!

గోల్డ్ ధర ఇంకా తగ్గుతుందా..?
మెక్సికో, కెనడా ఉత్పత్తులపై మార్చి 4న సుంకాలు పెరగనున్నాయని ట్రంప్ ప్రకటించడంతో అమెరికాలో ద్రవ్యోల్బనం రేటు గరిష్ట స్థాయికి చేరుకోవచ్చుననే వార్తలు వస్తున్నాయి. దీంతో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచొచ్చునని అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో గోల్డ్ రేట్లు రాబోయే రోజుల్లో తగ్గే అవకాశం ఉందని ఇండస్ట్రీ ఎక్సఫర్ట్స్ తీపి కబురు చెబుతున్నారు. ఈ అంశంపై మార్కెట్ అనలిస్ట్ గీతానంద్ మాట్లాడుతూ.. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు శ్రీకారం చుట్టడంలో కొంత వరకు గోల్డ్ ధరలు తగ్గాయి. అయితే, ఈ ధరల తగ్గుదల తాత్కాలికమేనని చెప్పొచ్చునని పేర్కొన్నారు. త్వరలో మళ్లీ గోల్డ్ రేట్లు పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేశారు.

Also Read: Gold: బంగారం మరో నాలుగు నెలల తర్వాత అక్కడ తగ్గుతుందా? 50 ఏళ్ల నుంచి ట్రెండ్‌ ఇలాగే ఉంది మరి..

మార్చిలో గోల్డ్ రేట్లు ఎలా ఉండబోతున్నాయి..
బంగారం ఔన్సు ధరలో 2,810 యూఎస్డీల వద్ద గట్టి మద్దతు లభిస్తుంది. ఈ స్థాయి నుంచి తిరిగి పుంజుకోవటానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ 2,810 స్థాయిని కోల్పోతే.. 2,732 స్థాయి వరకు పతనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేజరిగితే బంగారం ధర తగ్గే అవకాశం ఉంటుంది. కానీ, పెరుగుదలను చూస్తే ఔన్సు ధర 2,914 స్థాయి వద్ద నిలకడగా ఉంటుంది.. ఆ స్థాయిని దాటితే బంగారం రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని మార్కెట్ అనలిస్ట్ గీతానంద్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తరువాత అంతర్జాతీయంగా వ్యాపార పరిస్థితుల్లో అనిచ్చితి ఏర్పడింది. ట్రేడ్ టారిఫ్ వార్స్ జరిగే అవకాశం.. ట్యాక్స్ టారిఫ్ వార్ జరిగే అవకాశం ఉంది. ఇటువంటి సమయంలో సురక్షితమైనదిగా గోల్డ్ నే చూసుకునే అవకాశాలు ఉండటంతో రాబోయే రోజుల్లో బంగారం రేటు పెరిగే అవకాశం ఉంటుందని మార్కెట్ అనలిస్ట్ గీతానంద్ పేర్కొన్నారు.