Swiggy New Charges : స్విగ్గీ కొత్త ఛార్జీల బాదుడు.. ప్రతి ఆర్డర్‌పై రూ.2 చెల్లించాల్సిందే.. ఎందుకో తెలుసా?
Swiggy New Charges : స్విగ్గీ యాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? స్విగ్గీ ఆర్డర్లపై కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చేశాయి. స్విగ్గీలో చేసిన ప్రతి ఆర్డర్‌పై యూజర్లు అదనంగా రూ.2 చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకో తెలుసా?

Swiggy starts charging Rs 2 per food order from users to earn money, improve performance
Swiggy New Charges : ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయాలి అనగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది స్విగ్గీ (Swiggy) యాప్. ఈ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా క్షణాల్లోనే నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. నిర్దేశిత సమయంలోనే ఫుడ్ కూడా ఇంటికే డెలివరీ అవుతుంది. అందుకే.. ఎక్కువ మంది వినియోగదారులు స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే, ఇప్పుడు స్విగ్గీ ఫుడ్ ఆర్డర్‌పై కొత్త ఛార్జీలు వసూలు చేసేందుకు రెడీ అయింది. ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ.. నామమాత్రపు ‘ప్లాట్‌ఫారమ్ ఫీజు’ (Platform Fee) కింద యూజర్ల నుంచి రూ. 2 చొప్పున వసూలు చేయనుంది. ఫుడ్ ఆర్డర్ చేసిన కార్ట్ వాల్యూతో సంబంధం లేకుండా స్విగ్గీ అదనంగా ఛార్జీలు విధించనుంది. అంటే.. మీరు మీ కార్ట్‌లో 5 వస్తువులు లేదా ఒక ఆర్డర్ మాత్రమే చేసే వీలుంది.
ప్రతి ఆర్డర్‌పై రూ. 2 ఛార్జ్ చేస్తుంది. మీ ఆర్డర్ పరిమాణం లేదా కార్ట్ వాల్యూ ప్రకారం రుసుము పెరగదని గమనించాలి. ఫుడ్ డెలివరీ యాప్ తమ వ్యాపారంలో మందగమనం కారణంగా ప్రభావితమైన ఆదాయాన్ని మెరుగుపరచేందుకు, ఖర్చులను తగ్గించడానికి యూజర్లను నుంచి ఛార్జీల రూపంలో వసూలు చేయనుంది. బెంగుళూరు,హైదరాబాద్‌లోని యూజర్లకు అదనపు ఛార్జీని ముందుగా ప్రవేశపెట్టింది. కానీ, ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో ఇంకా అమలు చేయలేదు. ప్రస్తుతానికి, ప్లాట్‌ఫారమ్ రుసుము కేవలం ఆహార ఆర్డర్‌లపై మాత్రమే విధిస్తోంది. ఇతర కామర్స్ లేదా ఇన్‌స్టా మార్ట్ ఆర్డర్‌లపై కొత్త ఛార్జీలను విధించడం లేదు.
త్వరలో ఇతర ప్రాంతాల్లోనూ కొత్త ఛార్జీలు :
స్విగ్గీ సీఈఓ (Swiggy CEO) సహ-వ్యవస్థాపకుడు, శ్రీహర్ష మెజెటీ (Sriharsha Majety), డెలివరీ వ్యాపారంలో మందగమనానికి ప్లాట్‌ఫారమ్ ఛార్జీలను విధించాలని నిర్ణయించినట్టు తెలిపారు. మా అంచనాలకు వ్యతిరేకంగా ఆహార డెలివరీ వృద్ధి రేటు (ప్రపంచవ్యాప్తంగా అనేక పీర్ కంపెనీలతో పాటు) మందగించింది’ అని మెజెటీ తెలిపారు. స్విగ్గీ ప్లాట్‌ఫారమ్ రుసుము చిన్నదే అయినా.. కంపెనీ ప్రతిరోజూ 1.5 మిలియన్లకు పైగా ఆర్డర్‌లను అందిస్తోంది. తద్వారా స్విగ్గీకి గణనీయమైన కార్పస్‌ను పెంచగలదని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇంకా, రుసుము త్వరలో ఇతర ప్రాంతాలకు విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. దాంతో కంపెనీ ఖర్చులను నిర్వహించడంలో సాయపడుతుందని భావిస్తోంది.

Swiggy starts charging Rs 2 per food order from users to earn money, improve performance
జొమాటో కన్నా స్విగ్గీ ఆదాయమే ఎక్కువ :
స్విగ్గీ (Swiggy) పోటీదారు అయిన జొమాటో (Zomato) కూడా ఆర్థిక మందగమన ప్రభావాన్ని ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో స్వీగ్గీ తమ కంపెనీలో 380 మంది ఉద్యోగులను తొలగించింది. ఆర్థిక అనిశ్చితి కారణంగానే కంపెనీలో ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని మెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలిపింది. జొమాటో సీఈఓ (Zomato CFO), అక్షంత్ గోయల్, కంపెనీ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసిక ఫలితాలలో ఈ విషయాన్ని ప్రస్తావించారు, దేశవ్యాప్తంగా ఈ ట్రెండ్ కనిపించిందని, మొదటి 8 నగరాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పారు. అయితే, జొమాటో ఇంకా ఎలాంటి ప్లాట్‌ఫారమ్ ఫీజులను ప్రవేశపెట్టలేదు.
అదనపు రుసుమును ప్రవేశపెట్టడం వల్ల స్విగ్గీ తన ఖర్చులను తగ్గించడంలో సాయపడుతుందని అంచనా వేస్తోంది. జొమాటో కన్నా చాలా ఎక్కువనే చెప్పాలి. ఫుడ్ ఆర్డర్‌లపై ప్లాట్‌ఫారమ్ రుసుము నామమాత్రపు ఫ్లాట్ ఫీజు విధించనున్నట్టు స్విగ్గీ ప్రతినిధి ధృవీకరించారు. ఆదాయాల పరంగా చూస్తే.. జొమాటో ఆదాయం రూ. 4,100 కోట్ల (సుమారు 550 మిలియన్లు)తో పోలిస్తే.. స్విగ్గీ ఆదాయం దాదాపు రూ. 5,700 కోట్లు (సుమారు 763.4 మిలియన్ డాలర్లు) ఎక్కువగా ఉన్నట్టు నివేదికల్లో వెల్లడైంది.