Gold Rates: ఆల్ టైమ్ గరిష్ఠానికి బంగారం ధరలు.. ఎందుకంటే? పసిడిని కొంటే మీ లక్కు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది..

ఇంతగా ఎందుకు పెరిగిపోయాయన్న వివరాలను నిపుణులు వివరించారు.

Gold Rates: ఆల్ టైమ్ గరిష్ఠానికి బంగారం ధరలు.. ఎందుకంటే? పసిడిని కొంటే మీ లక్కు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది..

gold

Updated On : February 19, 2025 / 9:31 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధిస్తానంటూ చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలో వాణిజ్య యుద్ధం, ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో సురక్షితమైన పెట్టుబడిగా అందరూ బంగారంవైపునకు చూస్తుండడంతో అంతర్జాతీయంగా బంగారు ధరలు బుధవారం ఆల్ టైమ్ గరిష్ఠానికి చేరుకున్నాయి.

బుధవారం బంగారం ధర 0.3 శాతం పెరిగి, ఔన్సుకు 2,943.25 డాలర్లకు చేరుకుంది. అంతకుముందు, ఇది ఆల్ టైమ్ గరిష్ఠాన్ని తాకింది. ఔన్సుకు 9 2,946.75 డాలర్లకు పెరిగింది. ఈ ఏడాది బంగారం ధర రికార్డు స్థాయికి పెరగడం ఇది తొమ్మిదవసారి. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ ధర 0.4 శాతం పెరిగి, ఔన్సుకు 2,961 డాలర్లకు చేరుకుంది.

ఆటోమొబైల్, ఫార్మాస్యూటికల్స్ పై విధించబోయే సుంకాలపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ చేసిన వ్యాఖ్యల వల్ల గోల్డ్ రేట్ అధికమవుతుందని ఓండా మార్కెట్‌పల్స్‌కు చెందిన మార్కెట్ విశ్లేషకుడు జైన్ వావ్డా అన్నారు. ఈ ట్రెండ్‌ అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 3,000 డాలర్లకు తీసుకెళ్లడానికి మార్గం సుగమం చేస్తుందని వివరించారు.

Also Read: అబ్బబ్బ.. అందుకే మార్కెట్లో ఐఫోన్‌కు తిరుగులేదు.. దిమ్మతిరిగిపోయే డిజైన్‌తో ఐఫోన్‌ 17.. ఫీచర్లు ఇవిగో..

అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటివరకు డొనాల్డ్ ట్రంప్ చైనా దిగుమతులపై 10 శాతం సుంకం విధించారు. అలాగే, ఉక్కు, అల్యూమినియంపై 25 శాతం సుంకం విధించారు ఆయన.

సుంకాలపై ట్రంప్‌ తాజాగా మాట్లాడుతూ.. దిగుమతి చేసుకునే కార్లపై సుమారు 25 శాతం పన్ను పెట్టాలని యోచిస్తున్నట్లు చెప్పారు. దిగుమతి చేసుకునే కంప్యూటర్ చిప్స్, మందులపై ఇలాంటి పన్నులను కూడా వర్తింపజేయాలని ఆయన అన్నారు.

సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొంటూనే ఉంటాయని, అవి ఈ ట్రెండ్‌ను ఆపడం తాను ఎన్నడూ చూడలేదని యూబీఎస్ విశ్లేషకుడు జియోవన్నీ స్టౌనోవో చెప్పారు. సెంట్రల్ బ్యాంకులు తమ బంగారు నిల్వలను విక్రయిస్తాయని తాను అనుకోవడం లేదని తెలిపారు.

దానికి బదులుగా, సెంట్రల్ బ్యాంకు అధిక బంగారాన్ని సేకరించడాన్నేకొనసాగిస్తాయని భావిస్తున్నట్లు జియోవన్నీ స్టౌనోవో చెప్పారు. దీంతో బంగారం ధరలు అధికంగానే ఉంటాయని వివరించారు.