Tax free Gold : ఈ దేశంలో 10 గ్రాములు బంగారం రూ.37,000.. ఎటువంటి ట్యాక్సులు లేకుండా కొనేయొచ్చు..

ఈ దేశంలో 10 గ్రాములు బంగారం రూ.37,000..ఎటువంటి ట్యాక్సులు లేకుండా కొనుక్కునే అవకాశం కల్పించింది. ముఖ్యంగా భారతీయులకు ఇటువంటి అవకాశాన్ని కల్పించిందీ దేశం.

Tax free Gold : ఈ దేశంలో 10 గ్రాములు బంగారం రూ.37,000.. ఎటువంటి ట్యాక్సులు లేకుండా కొనేయొచ్చు..

Tax free Gold In Bhutan

Updated On : March 9, 2023 / 5:14 PM IST

Tax free Gold : భారతీయులకు బంగారం అంటే ఒక అలకారం మాత్రమే కాదు ఓ పొదుపు సాధనం కూడా. భారతీయ మహిళలకు బంగారం అంటే ఎంత మక్కువో తెలిసిందే. అంటే బంగారాన్ని మహిళలు కేవలం ఆభరణాలుగా మాత్రమే చూడరు. ఇంట్లో ఏ డబ్బు అవసరం వచ్చినా బంగారం ఉందనే ధీమాతో ఉంటారు. భర్తలకు వ్యవసాయానికి పెట్టుబడి కావాలన్నా..వ్యాపారాలకు పెట్టుబడి కావాలన్నా బంగారం భరోసాగా ఉంటుందనే ఆలోచనతో బంగారం కొనటానికి ఆసక్తి చూపిస్తుంటారు. అలా 90 శాతం బంగారం ఎన్నో అవసరాలకు ఉపయోగపడుతుంటుంది.

అటువంటి బంగారం కొనాలంటే ట్యాక్స్ కట్టాల్సిందే. మన డబ్బులతో మనం బంగారం కొన్నా గవర్నమెంట్ కు పన్నురూపంలో కట్టాల్సిందే. కానీ ఓ దేశంలో మాత్రం బంగారం ఎంత కొన్నా ఎటువంటి పన్ను కట్టనవసరంలేదు. అబ్బా అలా అయితే ఆదేశమేదో అక్కడికి పోయి బంగారం కొనుక్కుంటే బాగుంటుందిగా అనుకుంటున్నారా? మరి ఆదేశమేంటో ఎందుకు అక్కడ బంగారం కొంటే పన్ను కట్టనవం లేదో తెలుసుకుందాం..

Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..

ఆదేశమే భూటాన్. భూటాన్ లో బంగారం కొంటే ఎటువంటి పన్ను కట్టనవరం లేదు. ముఖ్యంగా భారతీయులు భూటాన్ లో బంగారం కొంటే ప్నురహితంగానే బంగారం కొనుక్కునేలా అనుమతి ఇచ్చింది భూటాన్ ప్రభుత్వం. ఎందుకంటే భారతీయులు భూటాన్ ను సందర్శించానికి ఎక్కువ సంఖ్యలో వెళుతుంటారు. అలా వెళ్లినవారికి ఎటువంటి పన్ను కట్టకుండానే బంగారం కొనుక్కునే అవకాశం కల్పించింది భూటాన్ ప్రభుత్వం. ఇదంతా పర్యాటక రంగాన్ని పెంచుకోవటానికే ఇటువంటి అనుమతులు ఇచ్చింది భూటాన్.

భూటాన్.. పర్యాటకాన్ని ప్రోత్సహించాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా భారత పర్యాటకులను ఆకర్షించటానికి డ్యూటీ ఫ్రీ బంగారాన్ని విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ రుసుము చెల్లించే పర్యాటకులు భూటాన్‌ రాజధాని థింఫు, పుట్‌షోలింగ్ నగరాల నుండి సుంకం (పన్ను) లేని బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.

చాలామంది భారతీయులు బంగారం కొనటానికి దుబాయ్ వెళుతుంటారు. ఎందుకంటే అక్కడ బంగారం కొనుగోళ్లపై పన్ను తక్కువగా ఉంటుంది. పైగా ధర కూడా తక్కువగా ఉంటుంది. ఫంట్‌షోలింగ్,థింఫు నగరాల్లో ఫిబ్రవరి 21 న భూటాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భూటాన్ కొత్త ఏడాది, భూటాన్ రాజు హిజ్ మెజెస్టి ది కింగ్స్ జన్మదినం పురస్కరించుకుని ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది భూటాన్. సాధారణంగా లగ్జరీ వస్తువులను విక్రయించే డ్యూటీ ఫ్రీ అవుట్‌లెట్ల ద్వారా బంగారాన్ని విక్రయిస్తారు. ఇది భూటాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది.  భారతదేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.567,820. (ఇది ఆయా రోజులను బట్టి ధర మారుతుంటుంది) అయితే, భూటాన్‌లో అదే మొత్తంలో బంగారం ధర భూటానీస్ న్గుల్ట్రమ్ BTN 37,588.59గా ఉంది. భారత రూపాయి దాదాపు ఒక BTNకి సమానం.

కరోనా ప్రపంచం మొత్తాన్ని ఎక్కడిక్కడ నిలిపివేసింది. ఆర్థికంగా దెబ్బతీసింది. ముఖ్యంగా పర్యటక రంగం పూర్తిగా నిలిచిపోయింది. ఈక్రమంలో భూటాన్ మళ్లీ పర్యాటకుల కోసం తలుపులు తెరిచాక భూటాన్ జాతీయ అసెంబ్లీ కొత్త చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ప్రకారం..పర్యాటకులు పర్యాటక పన్ను చెల్లించడం తప్పనిసరి చేయబడింది. దీనిని సుస్థిర అభివృద్ధి రుసుము (SDF) అని పిలుస్తారు. దీని కారణంగా ప్రతి భారతీయుడు రోజుకు రూ. 1,200 చెల్లించాలి..ఇతర దేశాల నుండి వచ్చే పర్యాటకులు 65 నుండి 200 డాలర్ల వరకు చెల్లించాలి.

Today Gold Rate: మహిళలకు గుడ్‌న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర!

చాలా మంది భారతీయులు భూటాన్‌కు వెళుతున్నందున కొత్త పథకం నుండి భారతీయులు ఎక్కువ ప్రయోజనం పొందాలంటే భూటాన్ పర్యాటక శాఖ ధృవీకరించిన హోటల్‌లో కనీసం ఒక రాత్రి గడిపినంత కాలం SDF-చెల్లించే పర్యాటకులందరూ డ్యూటీ-ఫ్రీ బంగారాన్ని కొనుగోలు చేయడానికి అర్హులు. మార్చి 1 నుంచి భూటాన్‌లోని ఫంట్‌షోలింగ్,థింఫు నగరాల్లో బంగారం కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.ఈ మేరకు భూటాన్ అధికారిక పత్రిక డైలీ కౌన్సెల్ పేర్కొంది.

చాలా మంది భారతీయులు దుబాయ్ వెళ్లి బంగారం కొంటున్నారు. భారత్‌తో పోలిస్తే అక్కడ ధరలు కాస్త తక్కువగా ఉంటాయి. ట్యాక్స్ కూడా తక్కువగా ఉంటుంది. కానీ భూటాన్ ప్రకటించిన ఈ ఆఫర్ భారతీయులకు బహుబాగు అనేలా ఉంది.