Government Schemes : మహిళల కోసం టాప్ 5 ప్రభుత్వ పథకాలు.. ఇలా పెట్టుబడి పెట్టారంటే లక్షల్లో సంపాదించుకోవచ్చు!

Government Schemes : మహిళల కోసం ప్రత్యేకించి 5 అద్భుతమైన ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉన్నాయి.. ఏయే పథకాలతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయంటే?

Government Schemes : మహిళల కోసం టాప్ 5 ప్రభుత్వ పథకాలు.. ఇలా పెట్టుబడి పెట్టారంటే లక్షల్లో సంపాదించుకోవచ్చు!

Government Schemes

Updated On : October 28, 2025 / 1:13 PM IST

Government Schemes : పెట్టుబడి కోసం ప్లానింగ్ చేస్తున్నారా? అయితే, ప్రభుత్వ పథకాల్లో పెట్టబడి పెట్టడం ద్వారా అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. గత కొన్ని ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలు చాలానే ఉన్నాయి. ప్రత్యేకించి మహిళల కోసమే ప్రభుత్వం అనేక పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఆయా పథకాలలో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ (Government Schemes), సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ మహిళలు, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సుభద్ర స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వంటి టాప్ 5 స్కీమ్స్ అందిస్తోంది. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం.

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ :
ఈ మహిళా సమ్మాన్ స్కీమ్ పూర్తిగా సురక్షితం. మీరు ఈ పథకంలో పోస్టాఫీసు ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో 7.5శాతం రాబడిని అందిస్తుంది. మీరు కేవలం రూ.1,000తో ప్రారంభించవచ్చు. ఈ పథకంలో అనుమతించే గరిష్ట పెట్టుబడి మొత్తం రూ. 2 లక్షలు. ఒక ఏడాది తర్వాత 40 శాతం ఫండ్ విత్‌డ్రా చేసుకోవచ్చు.

సుకన్య సమృద్ధి యోజన (SSY) :
ఈ సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని కుమార్తెల భవిష్యత్తు కోసం ప్రారంభించారు. 10 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్లల పేరుతో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మహిళలు సంవత్సరానికి 8.2శాతం వడ్డీ రేటును పొందవచ్చు. ఆసక్తిగల పెట్టుబడిదారులు సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు. విద్య, వివాహం, ఇతర దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది.

Read Also : Google Pixel 9a Price : సూపర్ డిస్కౌంట్ బ్రో.. గూగుల్ పిక్సెల్ 9a అతి చౌకైన ధరకే.. ఈ క్రేజీ డీల్ డోంట్ మిస్!

సీనియర్ మహిళలు, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు :

60 ఏళ్లు పైబడిన మహిళలకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD) సురక్షితమైన ఆప్షన్. సాధారణ రేట్ల కన్నా 0.50 శాతం ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తాయి. అదనంగా, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) కూడా అధిక వడ్డీ రేట్లు, దీర్ఘకాలిక భద్రతను అందిస్తుంది.

సుభద్ర స్కీమ్ :
ప్రత్యేకించి ఒడిశాలో నివసించే మహిళలకు ఈ స్కీమ్ అందుబాటులో ఉంది. ఈ పథకం కింద ఒడిశాలోని మహిళలకు ఆర్థిక సాయం అందుతుంది. 21 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కింద 5 ఏళ్లలో రూ. 50 వేలు పొందవచ్చు.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) :
ఈ స్కీమ్ సాధారణంగా 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల మధ్య మెచ్యూరిటీ వ్యవధితో అందించే స్థిరమైన డిపాజిట్ పథకం. పెట్టుబడిదారులు స్థిరమైన వడ్డీ రేటును పొందవచ్చు. దీర్ఘకాలికంగా సురక్షితమైన స్థిరమైన రాబడిని పొందవచ్చు. ఈ పథకంలో పెట్టుబడులపై సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. అంటే.. ఈ ప్రభుత్వ పథకంలో పెట్టబడి పెట్టడం ద్వారా ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.