Tomato prices to go down : కొత్త పంట వస్తే టమోటా ధరలు తగ్గుతాయి…కేంద్ర మంత్రి వెల్లడి

కొత్త పంట వస్తే టమోటా ధరలు తగ్గుముఖం పడతాయా? అంటే అవునంటున్నారు కేంద్ర వినియోగదారుల శాఖ సహాయమంత్రి అశ్వినీ కుమార్ చౌబే. రిటైల్ మార్కెట్‌లో టమోటా ధరలు పెరిగిన నేపథ్యంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల నుంచి కొత్త పంట రావడంతో టమాటా ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్ర సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే చెప్పారు....

Tomato prices to go down : కొత్త పంట వస్తే టమోటా ధరలు తగ్గుతాయి…కేంద్ర మంత్రి వెల్లడి

Tomato prices to go down

Updated On : July 22, 2023 / 11:57 AM IST

Tomato prices to go down : కొత్త పంట వస్తే టమోటా ధరలు తగ్గుముఖం పడతాయా? అంటే అవునంటున్నారు కేంద్ర వినియోగదారుల శాఖ సహాయమంత్రి అశ్వినీ కుమార్ చౌబే. రిటైల్ మార్కెట్‌లో టమోటా ధరలు పెరిగిన నేపథ్యంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల నుంచి కొత్త పంట రావడంతో టమాటా ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్ర సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే చెప్పారు. ( new crop arrival)

West Bengal : బెంగాల్‌లోనూ మణిపూర్ తరహా ఘటన…ఇద్దరు మహిళలను కొట్టి అర్ధనగ్నంగా ఊరేగించారు…

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో ఎంపీ కార్తికేయ శర్మ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ విషయం వెల్లడించారు. ప్రస్తుతం పెరుగుతున్న టమోటా ధరలను అరికట్టేందుకు, వినియోగదారులకు సరసమైన ధరలకు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి కింద వీటిని కొనుగోలు చేసి అధిక రాయితీపై వినియోగదారులకు అందుబాటులో ఉంచడం ప్రారంభించిందని మంత్రి (Minister of State for Consumer Affairs Ashwini Kumar Choubey) తెలిపారు.

Seema,Sachin Love story : సీమా, సచిన్‌లకు అస్వస్థత…భారత పౌరసత్వం కల్పించాలని రాష్ట్రపతికి లేఖ

నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ (నాఫెడ్) ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని మండీల నుంచి నిరంతరం టమోటాలను కొనుగోలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. వినియోగదారులకు సబ్సిడీ ఇచ్చిన తర్వాత వాటిని ఢిల్లీ-ఎన్‌సిఆర్, బీహార్, రాజస్థాన్‌లోని ప్రధాన వినియోగదారుల కేంద్రాల్లో సరసమైన ధరలకు టమోటాలను అందుబాటులో ఉంచుతున్నాయని మంత్రి చెప్పారు. తాజాగా టమోటా ధరలను 70 రూపాయలకు తగ్గించామని మంత్రి వివరించారు. ప్రస్తుతం టమాటా ధరలు పెరగడం వల్ల రైతులు ఈ పంటను ఎక్కువగా పండించేలా ప్రోత్సహించామని, రాబోయే నెలల్లో ధరలు స్థిరంగా ఉండవచ్చని మంత్రి అన్నారు.