Budget Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? రూ. 15వేల లోపు ధరలో టాప్ 5 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు మీకోసం.. ఇప్పుడే కొనేసుకోండి!

Budget Smartphones : కొత్త ఫోన్ కొంటున్నారా? రూ. 15వేల లోపు ధరలో టాప్ 5 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. నచ్చిన ఫోన్ కొనేసుకోండి.

Budget Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? రూ. 15వేల లోపు ధరలో టాప్ 5 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు మీకోసం.. ఇప్పుడే కొనేసుకోండి!

Budget Smartphones

Updated On : October 25, 2025 / 5:55 PM IST

Budget Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం భారత మార్కెట్లో బడ్జెట్-ఫ్రెండ్లీ మొబైల్ ఫోన్లు లభ్యమవుతున్నాయి. బ్యాటరీ బ్యాకప్ లైఫ్, అద్భుతమైన కెమెరా క్వాలిటీతో లభిస్తోంది. రూ.15వేల కన్నా తక్కువ ధరలో టాప్ 5 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నాయి. ఇందులో మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.

రెడ్‌మి నోట్ 14 5జీ :
భారత మార్కెట్లో బడ్జెట్ ఫోన్ల విషయానికి వస్తే.. షావోమీ (Budget Smartphones) రెడ్‌మి సిరీస్ ఈ మీడియా టెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్, 120Hz అమోల్డ్ డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీ-లైఫ్ పరంగా అద్భుతంగా ఉంటుంది. 64MP డ్యూయల్-కెమెరా సెటప్, అద్భుతమైన షాట్‌లను అందిస్తుంది. మల్టీ టాస్కింగ్, హెవీ గేమింగ్ కూడా బాగుంటుంది.

రియల్‌మి నార్జో 70 5జీ :
రియల్‌మి నార్జో సిరీస్ 70 ఫోన్ 6.7 FHD+ డిస్‌ప్లే కలిగి ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో డైమెన్సిటీ 6100 ప్లస్ ద్వారా పవర్ అందుతుంది. ఈ ధర బ్యాండ్‌లో ప్రీమియం ఎక్స్‌పీరియన్స్, ఇమేజింగ్ క్లాస్-లీడింగ్ ఆప్షన్ కలిగి ఉంది.

Read Also : Bluetooth Neckbands : టాప్ 5 బ్లూటూత్ నెక్‌బ్యాండ్స్.. జస్ట్ రూ. 1000 లోపు ధరకే.. సింగిల్ ఛార్జ్‌తో 50 గంటల ప్లేబ్యాక్ టైమ్.. డోంట్ మిస్!

శాంసంగ్ గెలాక్సీ M15 5జీ :
శాంసంగ్ గెలాక్సీ M15 5G ఎక్సినోస్ 6100 చిప్‌సెట్, సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే అందిస్తుంది. భారీ 6000mAh బ్యాటరీతో వస్తుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా అందిస్తుంది. శాంసంగ్ వన్ యూఐ ద్వారా పవర్ అందిస్తుంది.

పోకో X6 లైట్ 5జీ :
పోకో X6 లైట్ 5G ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్, 120Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్, 67W ఫాస్ట్ ఛార్జింగ్ ఆకట్టుకునే ప్యాకేజీ కలిగి ఉంది. బడ్జెట్‌ పర్ఫార్మెన్స్ కూడా అందిస్తుంది. డిజైన్‌లో ఎడ్జీ, ట్రెండీగా ఉంటుంది.

ఇన్ఫినిక్స్ జీరో 6 5G :
ఇన్ఫినిక్స్ జీరో 6 5G స్మార్ట్‌ఫోన్‌ అద్భుతంగా ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్, 108MP ప్రైమరీ కెమెరా, డిస్‌ప్లే, కెమెరా క్వాలిటీలో 33W ఫాస్ట్ ఛార్జింగ్-ఆల్ రౌండ్ పెర్ఫార్మర్‌ అందిస్తుంది. 2025 నాటికి రూ. 15వేల కన్నా తక్కువ ధరలో హై-ఎండ్ మోడళ్లలో అనేక స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అద్భుతమైన కెమెరా 5G సపోర్టు, భారీ బ్యాటరీ లైఫ్ కూడా అందిస్తుంది.