Top 5 Electric Cars : కొత్త EV కారు కావాలా? రూ. 15 లక్షల లోపు ధరలో టాప్ 5 టాటా ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. టియాగో నుంచి టిగోర్ వరకు..
Top 5 Electric Cars : 2025లో భారత మార్కెట్లో రూ. 15 లక్షల లోపు టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు లభ్యమవుతున్నాయి. ఈ టాటా కార్లకు సంబంధించి వివరాలివే..

Top 5 Tata Electric Cars
Top 5 Electric Cars : కొత్త ఎలక్ట్రిక్ కార్ల కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో అద్భుతమైన ఈవీ కార్లను సరసమైన ధరకే కొనుగోలు చేయొచ్చు. 2025లో ఎలక్ట్రిక్ కార్లకు (Top 5 Electric Cars) ఫుల్ డిమాండ్ పెరిగింది. పెరుగుతున్న ఇంధన ధరలు, గ్రీన్ మొబిలిటీపై అవగాహనతో వాహనదారులు ఈవీ కార్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
అలాగే, కార్ల కంపెనీలు సైతం లాంగ్ రేంజ్, భారీ ఫీచర్లతో సరసమైన ధరకు మార్కెట్లో ప్రవేశపెడుతున్నాయి. అద్భుతమైన డిజైన్‌లతో ఎలక్ట్రిక్ కార్లను అందిస్తున్నాయి. మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే రూ. 15 లక్షల కన్నా తక్కువ ధరలో 5 బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం..
1. టాటా టియాగో EV :
భారత మార్కెట్లో టాటా టియాగో ఈవీ అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి. ధర రూ. 10 లక్షల కన్నా తక్కువగా ఉంటుంది. ఈ కారు 315 కి.మీ (MIDC) రేంజ్ అందిస్తుంది. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సెటప్, కనెక్టివిటీ కార్ టెక్నాలజీ, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లతో నిండి ఉంది. కాంపాక్ట్‌గా సిటీ డ్రైవింగ్‌కు బెస్ట్ ఈవీ కారు.
2. టాటా పంచ్ EV :
2025 ప్రారంభంలో టాటా పంచ్ ఈవీ SUV కారు కలిగి ఉంది. ఎలక్ట్రిక్ పరేడ్‌కు 421 కి.మీ (LR వేరియంట్) అధికారిక రేంజ్ కలిగి ఉంది. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, మల్టీ డ్రైవ్ మోడ్‌లతో సహా అన్ని లేటెస్ట్ ఫీచర్లతో వస్తుంది. సుమారు రూ. 11 లక్షల ధర కలిగి ఉంటుంది. చూసేందుకు ఫ్యాషన్‌గా ఉన్నప్పటికీ ఎకో ఫ్రెండ్లీ కోసం చూస్తున్న ఫ్యామిలీలకు అద్భుతమైన కారు అని చెప్పొచ్చు.
3. సిట్రోయెన్ eC3 :
సిట్రోయెన్ eC3 కారు అవుట్-ఆఫ్-ది-బాక్స్ స్టైలింగ్, ప్లష్ రైడ్ క్వాలిటీతో వస్తుంది. ధరల రేంజ్ సుమారు రూ.12 లక్షల నుంచి ఉంటుంది. ఈ హ్యాచ్‌బ్యాక్‌లో స్థలంతో పాటు 320 కి.మీ రేంజ్ అందిస్తుంది. కానీ కారు స్టయిల్, ఫ్రెంచ్ కంఫర్ట్-సాఫ్ట్ సస్పెన్షన్ స్టైలింగ్ కలిగి ఉంది.
4. ఎంజీ కామెట్ ఈవీ :
ఎంజీ కామెట్ ఈవీ కారు చిన్న సైజులో మెట్రోపాలిటన్ ప్రాంతాలకు బెస్ట్. ఈ కారు ధర సుమారు రూ. 7.98 లక్షల నుంచి ఉంటుంది. 230 కి.మీ రేంజ్ అందిస్తుంది. ఆఫీసులకు వెళ్లి వచ్చేవారికి సరైన కారు. ఇంటీరియర్‌లో మోడ్రాన్‌గా ఉంటుంది. డ్యూయల్ 10.25 అంగుళాల డిస్‌ప్లే, స్మార్ట్ కనెక్టివిటీ, టర్నింగ్ రేడియస్ సిటీ డ్రైవింగ్‌కు బెస్ట్ అని చెప్పొచ్చు.
5. టాటా టిగోర్ ఈవీ :
టాటా టిగోర్ EV కారు 315 కి.మీ రేంజ్‌తో సెడాన్ సైజు ప్రాక్టికాలిటీని అందిస్తుంది. ఈ కారు ధర రూ.12.5 లక్షల నుంచి ప్రారంభం కానుంది. బిగ్ బూట్, ప్లష్ సీట్లు, టాటా సేఫ్టీ కోసం కాన్ఫిగర్ చేసింది. మీ బడ్జెట్ ధరలోనే అదనపు లగేజ్ స్టోరేజీ కోసం చూస్తుంటే కొనుగోలుదారులకు ఇదే బెస్ట్ కారు.