ట్రాయ్ ప్రకటన : మొబైల్, ల్యాండ్ లైన్ కాల్స్‌పై రింగర్ టైమ్ ఫిక్స్

  • Published By: sreehari ,Published On : November 2, 2019 / 07:41 AM IST
ట్రాయ్ ప్రకటన : మొబైల్, ల్యాండ్ లైన్ కాల్స్‌పై రింగర్ టైమ్ ఫిక్స్

Updated On : November 2, 2019 / 7:41 AM IST

టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ మొబైల్ కాల్స్, ల్యాండ్ లైన్ ఫోన్ కాల్ రింగ్ టైమ్ ఫిక్స్ చేసింది. మొబైల్ కాల్స్‌పై 30 సెకన్ల పాటు రింగ్ టైమ్ ఫిక్స్ చేయగా, ల్యాండ్ లైన్ ఫోన్ కాల్స్ పై 60 సెకన్ల పాటు రింగ్ టైమ్ ఫిక్స్ చేసింది. మొబైల్, ల్యాండ్ లైన్స్ కాల్స్ విషయంలో కాల పరిమిమితిని ట్రాయ్ ఫిక్స్ చేయడం ఇదే తొలిసారి. ఈ రింగర్ టైమ్.. ఒకవేళ యూజర్ తనకు వచ్చిన ఇన్ కమింగ్ కాల్స్ లిఫ్ట్ చేసినా చేయకపోయినా రింగ్ టైమ్ గా కౌంట్ చేయడం జరుగుతుంది.

ఇన్ కమింగ్ వాయిస్ కాల్స్ సమయంలో టైమ్ డ్యురేషన్ అలర్ట్ ఇస్తుంది. కాల్ అందుకున్న పార్టీ ఆన్సర్ చేసినా లేదా రిజెక్ట్ చేసినా కొన్ని సెకన్ల పాటు అలానే రింగ్ అవుతుంది. సెల్యూలర్ మొబైల్ టెలిఫోన్ సర్వీసులో 30 సెకన్లుగానూ, బేసిక్ టెలిఫోన్ సర్వీసుల్లో అయితే 60 సెకన్లుగాను ఫిక్స్ చేసినట్టు ట్రాయ్ ఒక ప్రకటనలో తెలిపింది. సాధారణ టెలిఫోన్ సర్వీసు, సెల్యూలర్ మొబైల్ టెలిఫోన్ సర్వీసుల్లో నాణ్యమైన సర్వీసు సంస్కరణల్లో ఇదొక సవరణగా ట్రాయ్ పేర్కొంది.

భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాతో సహా పాత ఆపరేటర్లను చట్టవిరుద్ధంగా వైర్-లైన్ నంబర్లను అనవసరమైన సుసంపన్నత కోసం మొబైల్ నంబర్లుగా మారుస్తున్నారని రిలయన్స్ జియో ఆరోపించిన తరువాత టైమ్ లిమిట్ అవసరం అంశం వెలుగులోకి వచ్చింది.

కాల్ కనెక్ట్ ఛార్జీల విషయంలో రెగ్యులేటర్ ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని భారతీ ఎయిర్ టెల్ జియోపై ఆరోపించింది. ఇతర నెట్ వర్క్ యూజర్లను కాల్ బ్యాక్ చేసేలా ఆకర్షించేందుకు టెలికం ఆపరేటర్లు తామే సొంతంగా ఇన్ కమింగ్ కాల్స్ రింగ్ టైమ్ ను తగ్గిస్తున్నాయి.