అతిక్రమిస్తే తీవ్ర పరిణామాలు : Cable, DTH ఆపరేటర్లకు TRAI వార్నింగ్

కేబుల్, డీటీహెచ్ ఆపరేటర్లకు టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ సోమవారం (ఏప్రిల్ 22, 2019) హెచ్చరికలు జారీ చేసింది.

  • Published By: sreehari ,Published On : April 22, 2019 / 02:32 PM IST
అతిక్రమిస్తే తీవ్ర పరిణామాలు : Cable, DTH ఆపరేటర్లకు TRAI వార్నింగ్

Updated On : April 22, 2019 / 2:32 PM IST

కేబుల్, డీటీహెచ్ ఆపరేటర్లకు టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ సోమవారం (ఏప్రిల్ 22, 2019) హెచ్చరికలు జారీ చేసింది.

కేబుల్, డీటీహెచ్ ఆపరేటర్లకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సోమవారం (ఏప్రిల్ 22, 2019) హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల తీసుకొచ్చిన కొత్త ట్రారిఫ్ నిబంధనలను, ఆదేశాలను ఉల్లంఘస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదులతో Cable, DTH ఆపరేటర్లపై ట్రాయ్ సీరియస్ అయింది. తమకు నచ్చిన ఛానళ్ల ఎంపిక విషయంలో ఆపరేటర్లు కస్టమర్లకు ఇబ్బంది కలిగిస్తున్నట్టు ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 

ఇందులో సాఫ్ట్ వేర్ అండ్ సిస్టమ్స్ కు సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువ అందినట్టు ట్రాయ్ చైర్మన్ RS శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. TRAI కొత్త నిబంధనల ప్రకారం.. వినియోగదారుల చాయిస్, వారి ఆసక్తి విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో ఆపరేటర్లు వినియోగదారులను ఇబ్బందిపెట్టి నిబంధనలను అతిక్రమిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని శర్మ హెచ్చరించారు.
Also Read : అదిరిపోయే ఫీచర్లు : Realme 3 Pro వచ్చేసింది

ఇప్పటికే సబ్ స్ర్కైబర్ నిర్వహణ, ఆపరేటర్ల ఐటీ సిస్టమ్స్ పై  త్వరలో ఆడిట్ ప్రారంభం కానున్నట్టు వాచ్ డాగ్ హామీ ఇచ్చింది. ట్రాయ్ నిబంధనల ప్రకారం ఫిబ్రవరి 1 నుంచి కొత్త టారిఫ్ విధానం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. 

New Tariff Order  విధానం కింద గతంలో జనవరి 31వరకు ఛానళ్ల జాబితాను ఎంచుకునేందుకు ఇచ్చిన గడువును మరోసారి పొడిగించింది. మార్చి 31,2019వరకు యూజర్లు తమకు కావాల్సిన ఛానళ్లను ఎంచుకోవచ్చని తెలిపింది. కొత్త టారిఫ్ విధానం కింద ఇంకా ఛానళ్లను ఎంపిక చేయని యూజర్లను బెస్ట్ ఫిట్ ప్లాన్ కింద ప్యాకేజీలను ఎంపిక చేసుకోవాలని ట్రాయ్ ఇదివరకే సూచించింది.

ఇదే అదునుగా చూసుకొని టీవీ వీక్షకుల నుంచి బెస్ట్ ఫిట్ ప్లాన్ ఎంచుకోవాలంటూ టీవీ యూజర్ల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూల్ చేయొద్దని కూడా ఆపరేటర్లను ట్రాయ్ హెచ్చరించింది. 
Also Read : మే 31న సర్వీసు స్టాప్ : బ్లాక్ బెర్రీ మెసేంజర్ షట్ డౌన్