ఎక్కువ వసూల్ చేశారంటే : టీవీ ఆపరేటర్లకు ట్రాయ్ వార్నింగ్

టీవీ వీక్షకుల నుంచి బెస్ట్ ఫిట్ ప్లాన్ ఎంచుకోవాలంటూ టీవీ యూజర్ల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూల్ చేయొద్దని ఆపరేటర్లను ట్రాయ్ హెచ్చరించింది. 

  • Published By: sreehari ,Published On : February 13, 2019 / 02:31 PM IST
ఎక్కువ వసూల్ చేశారంటే : టీవీ ఆపరేటర్లకు ట్రాయ్ వార్నింగ్

టీవీ వీక్షకుల నుంచి బెస్ట్ ఫిట్ ప్లాన్ ఎంచుకోవాలంటూ టీవీ యూజర్ల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూల్ చేయొద్దని ఆపరేటర్లను ట్రాయ్ హెచ్చరించింది. 

టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిబంధనల ప్రకారం ఫిబ్రవరి 1 నుంచి కొత్త టారిఫ్ విధానం అమల్లోకి వచ్చేసింది. ఇప్పటికే టీవీ వీక్షకులు తమకు ఇష్టమైన ఛానళ్లు, ప్యాకేజీలను ఎంచుకునే పనిలో పడ్డారు. కొంతమంది యూజర్లు నచ్చిన ఛానళ్లను ఎంచుకున్నప్పటికీ అది ఎలా యాక్టివేషన్ చేసుకోవాలో తెలియక సతమతమవుతున్న పరిస్థితి ఉంది. మరికొంతమంది యూజర్లకు ఛానళ్లను ఎంచుకోవడం తెలియక తికమక పడుతున్నారు.

ఛానళ్ల ఎంపికపై లోకల్ కేబుల్ ఆపరేటర్లు.. డిపిఓ ఆపరేటర్లు అవగాహన కల్పించకపోవడంతో టీవీ వీక్షకుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. కొత్త టారిఫ్ విధానం కింద ఇంకా ఛానళ్లను ఎంపిక చేయని యూజర్లను బెస్ట్ ఫిట్ ప్లాన్ కింద ప్యాకేజీలను ఎంపిక చేసుకోవాలని ట్రాయ్ సూచించింది. ఇదే అదునుగా చూసుకొని టీవీ వీక్షకుల నుంచి బెస్ట్ ఫిట్ ప్లాన్ ఎంచుకోవాలంటూ టీవీ యూజర్ల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూల్ చేయొద్దని ఆపరేటర్లను ట్రాయ్ హెచ్చరించింది. 

ప్రస్తుతం నెలవారీగా చెల్లిస్తున్న మొత్తానికి కంటే ఎక్కువ మొత్తంలో వసూల్ చేయొద్దని ట్రాయ్ సెక్రటరీ ఎస్కే గుప్తా ఆపరేటర్లకు సూచించారు. ఎక్కువ బిల్లులు వసూల్ చేస్తున్నారంటూ టీవీ వీక్షకులు ఫిర్యాదు చేస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితులను ట్రాయ్ అంతా గమనిస్తూనే ఉంటుందని ఆయన అన్నారు. మరోవైపు ఇంకా ఛానళ్లను ఎంచుకోని టీవీ యూజర్ల కోసం ట్రాయ్ మార్చి 31, 2019 వరకు గడువు పొడిగించింది.

టీవీ వీక్షకులు మాట్లాడే భాషకు అనుగుణంగా బెస్ట్ ఫిట్ ప్లాన్ డిజైన్ చేయాలని ట్రాయ్ ఆపరేటర్లకు సూచించింది. గడువు తేదీ ముగిసేనాటికి టీవీ యూజర్లు నచ్చిన ప్లాన్ ఏంటో ఎంపిక చేసుకోవాల్సిందిగా సూచించింది. యూజర్లు తమ బెస్ట్ ప్లాన్ ఎంచుకున్న 72 గంటల్లో వారికి ఛానళ్లను డిపొఒ ఆపరేటర్లు అందించాల్సి ఉంటుంది.  

Also Read: ఊరట : ఛానళ్ల సెలక్షన్ మరో రెండు నెలలు

Also Read: పబ్‌జీకు మించిన గేమ్ వచ్చేసింది..

Also Read: ఐఫోన్‌లో కొత్త ఫీచర్.. మీ కారుకు ఫుల్ సెక్యూరిటీ

Also Read: బ్లూవేల్‌కు మించి: ‘టిక్ టాక్’ App బ్యాన్ చేయాల్సిందే