Truecaller: ఫ్యామిలీ ప్లాన్ తీసుకొచ్చిన ట్రూకాలర్.. ఒకేసారి ఎంతమంది సబ్‌స్క్రిప్షన్ చేసుకోచ్చంటే?

స్పామ్‌, స్కామ్‌ కాల్స్‌ ద్వారా జరిగే మోసాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ట్రూకాలర్‌ ఫ్యామిలీ ప్లాన్‌ సబ్‌స్క్రిప్షన్‌ ద్వారా యూజర్లు తమ కుటుంబసభ్యులు, స్నేహితులకు సైబర్‌ మోసాల నుంచి భద్రత కల్పించవచ్చని కంపెనీ పేర్కొంది. గత నెలలో ట్రూకాల్‌ గవర్నమెంట్ డిజిటల్ డైరెక్టరీ పేరుతో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. దీనితో ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల పేరుతో జరిగే మోసాలకు సులభంగా అడ్డుకట్ట వేయొచ్చు.

Truecaller: ఫ్యామిలీ ప్లాన్ తీసుకొచ్చిన ట్రూకాలర్.. ఒకేసారి ఎంతమంది సబ్‌స్క్రిప్షన్ చేసుకోచ్చంటే?

Truecaller launches new premium Family Plan subscription; check benefits, other details

Updated On : December 14, 2022 / 9:15 PM IST

Truecaller: ట్రూకాలర్‌ యాప్ ఫ్యామిలీ ప్లాన్‌ పేరుతో కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ కింద ఐదుగురు యూజర్లు ఒకేసారి ట్రూకాలర్‌ ప్రీమియం సేవలను పొందొచ్చట. ఫ్యామిలీ ప్లాన్ నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ ధర 132 రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం ట్రూకాలర్ నెలవారీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ 39 రూపాయలు, ప్రీమియం కనెక్షన్‭కు 75 రూపాయల రుసుమును వసూలు చేస్తున్నారు. ట్రూకాలర్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లో భాగంగా యూజర్లకు యాడ్ ఫ్రీ సేవలతోపాటు పలు రకాల అధునాతన సర్వీస్‌లను అందిస్తున్నారు.

Supreme Court Advocate joined TMC : తృణమూల్ కాంగ్రెస్ లో చేరిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది

స్పామ్‌ కాల్స్‌ రాకుండా అడ్డుకోవడం, ట్రూకాలర్ ప్రొఫైల్‌ ఎవరెవరు చూశారనేది తెలుసుకోవడం, ప్రీమియం బ్యాడ్జ్‌, అన్‌లిమిటెడ్‌ కాంటాక్ట్ రిక్వెస్టులు‌, ఇన్‌కాగ్నిటో మోడ్‌, కాలర్‌ అనౌన్స్‌మెంట్‌, ఘోస్ట్ కాల్స్‌ వంటివి వీటికి అదనం పొందవచ్చు. దాంతోపాటు యాపిల్‌ వన్‌, స్పోటిఫై ఫ్యామిలీ సబ్‌స్క్రిప్షన్‌ తరహాలో ట్రూకాలర్ ఫ్యామిలీ సబ్‌స్క్రైబర్లు ఒకరి వ్యక్తిగత వివరాలను మరొకరితో పంచుకోలేరని కంపెనీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ సేవలను అమెరికా మినహా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోని యూజర్లకు అందుబాటులో ఉన్నట్లు ట్రూకాలర్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఎప్పటినుంచి ఎప్పటివరకంటే? డోంట్ మిస్..!