Elon Musk: మస్క్‌కు వ్యతిరేకంగా ట్విట్టర్ బోర్డు తీసుకొచ్చిన పాయిజన్ పిల్

బిలియనీర్ ఎలన్ మస్క్ ట్విట్టర్ కంపెనీలో 100 శాతం వాటాను కొనుగోలు చేయాలకుంటున్న ప్రతిపాదనపై ట్విట్టర్ అధికారికంగా స్పందించింది. లేటెస్ట్ అప్‌డేట్‌లో, మస్క్ ఆఫర్‌ను నిరోధించడానికి..

Elon Musk: మస్క్‌కు వ్యతిరేకంగా ట్విట్టర్ బోర్డు తీసుకొచ్చిన పాయిజన్ పిల్

Elon Musk

Updated On : April 16, 2022 / 8:30 AM IST

Elon Musk: బిలియనీర్ ఎలన్ మస్క్ ట్విట్టర్ కంపెనీలో 100 శాతం వాటాను కొనుగోలు చేయాలకుంటున్న ప్రతిపాదనపై ట్విట్టర్ అధికారికంగా స్పందించింది. లేటెస్ట్ అప్‌డేట్‌లో, మస్క్ ఆఫర్‌ను నిరోధించడానికి Twitter డైరెక్టర్ల బోర్డు.. కొత్త వాటాదారుల హక్కుల ప్రణాళిక”ను జారీ చేసింది. ట్విటర్‌పై పూర్తి నియంత్రణ సాధించేందుకు వ్యాపార దిగ్గజం ఎలన్ మస్క్ చేస్తున్న ప్రయత్నాలకు ఇది పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది.

డైరెక్టర్ల బోర్డు అధికారిక పత్రికా ప్రకటనలో “ట్విటర్‌ని పొందేందుకు అయాచిత, కట్టుబడి లేని ప్రతిపాదనను అనుసరించి హక్కుల ప్రణాళికను స్వీకరించారు” అని పేర్కొన్నారు.

మస్క్ ప్రపోజల్‌ను Twitter షేర్ హోల్డర్ చాలా తక్కువగా పరిగణిస్తూ తిరస్కరించారు. సౌదీ రాజకుటుంబ సభ్యుడు, ప్రధాన ట్విటర్ పెట్టుబడిదారు అల్ వలీద్ బిన్ తలాల్ అల్(Al valid bin thalal Al) సౌద్ మాట్లాడుతూ.. ట్విట్టర్ వృద్ధిని పరిగణనలోకి తీసుకుంటే మస్క్ ఆఫర్ చాలా తక్కువ అని అన్నారు.

Read Also : ట్విట్టర్‌ను కొనేస్తాను.. ఎలాన్ మస్క్ బంపరాఫర్..!

మస్క్ ట్విట్టర్‌ను $43 బిలియన్లకు చేయడానికి ప్రతిపాదన చేశాడు. ఈ ప్రతిపాదన సమయంలో ట్విటర్ షేర్ ధర కంటే మస్క్ ఒక్కో షేరుకు 30 శాతం ఎక్కువ చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాని ప్రకటించాడు.