విశాఖ-సింగపూర్ విమాన సర్వీసు ప్రారంభం

విశాఖ సింగపూర్ ల మధ్య కొత్త విమాన సర్వీసు ప్రారంభమయ్యింది. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన చవక విమానయాన సంస్థ స్కూట్.. ఈ విమాన సేవలు ప్రారంభించింది. వారానికి ఐదు సార్లు ఈ సర్వీసును నిర్వహించనుంది.
సోమ, బుధ, శుక్ర, శని, ఆదివారాల్లో రాత్రి 11 గంటలకు వైజాగ్ నుంచి బయలుదేరే ఈ విమానం, ఉదయం 5.40కి సింగపూర్ చేరుకుంటుంది.
మళ్లీ అవే రోజుల్లో సింగపూర్‌లో సాయంత్రం 8.45కి బయలుదేరి, రాత్రి 10 గంటలకు వైజాగ్ చేరుకుంటుంది. వైజాగ్‌తో పాటు కోయంబత్తూరు నుంచి కూడా విమాన సేవల్ని స్కూట్ ప్రారంభించింది.