యాహూ.. అద్భుత ఫీచర్లతో వివో ఎక్స్‌200 ప్రో మినీ మోడల్‌ భారత్‌లో విడుదల కానుంది.. లీకైన వివరాలు ఇవే.. 

వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్‌.

యాహూ.. అద్భుత ఫీచర్లతో వివో ఎక్స్‌200 ప్రో మినీ మోడల్‌ భారత్‌లో విడుదల కానుంది.. లీకైన వివరాలు ఇవే.. 

Vivo

Updated On : February 2, 2025 / 3:44 PM IST

చైనా కంపెనీ వివో ఎక్స్‌200 ప్రో మినీ మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో ఎప్పుడు విడుదల అవుతుందన్న విషయంపై స్మార్ట్‌ప్రిక్స్ సంస్థ ఓ లీక్‌ ఇచ్చింది. వివో ఎక్స్‌200 సిరీస్‌లో ఇప్పటికే వివో ఎక్స్‌200, వివో ఎక్స్‌200 ప్రో భారత్‌లో విడుదలయ్యాయి.

వీటిలో వివో ఎక్స్‌200 బేస్ మోడల్. ఇది రెండు కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. 12జీబీ ర్యామ్+ 256 జీబీ స్టోరేజ్‌తో అలాగే, 16జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజీతో భారత మార్కెట్లో లభిస్తోంది.

ఇక వివో X200 ప్రో అనేక స్పెసిఫికేషన్లతో కూడిన హై ఎండ్ మోడల్. ఇది ఒకే కాన్ఫిగరేషన్‌లో లభిస్తోంది. ఇది 16 జీబీ ర్యామ్‌+ 512 జీబీ స్టోరేజ్‌తో మార్కెట్లో ఉంది.

వివో ఎక్స్‌200 సిరీస్‌లోని “వివో ఎక్స్ 200 ప్రో మినీ” భారత్‌లో ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ వేరియంట్ ఈ సిరీస్‌లో ఇతర మోడళ్లలాగే 9400 చిప్‌ ఉంటుంది. ఇందులో 6.31 అంగుళాల అమోలెడ్ స్క్రీన్, 5,700 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఉంటుంది. దీన్ని 90డబ్ల్యూ వద్ద ఛార్జ్ చేయవచ్చు.

Also Read: ఇండియన్ మార్కెట్‌లో చైనీస్ ఫోన్ హవా.. ఐఫోన్, సాంసంగ్‌ని తొక్కుకుంటూ పోతుంది..

ఎప్పుడు లాంచ్‌ అవుతుంది?
“వివో ఎక్స్ 200 ప్రో మినీ”ని భారత్‌లో ఎప్పుడు విడుదల చేస్తామన్న విషయంపై ఆ కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, లీక్ అయిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ విడుదల కానుంది. ఈ అంచనా నిజమైతే భారత్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ ఏప్రిల్‌-జూన్‌ మధ్య ఈ ఫోన్‌ విడుదల అవుతుందన్నమాట.

ఇప్పటికే చైనాలో వివో ఎక్స్‌200 సిరీస్‌లోని “వివో ఎక్స్ 200 ప్రో మినీ” కూడా విడుదలైంది. “వివో ఎక్స్ 200 ప్రో మినీ”ని భారత్‌లోనూ విడుదల చేస్తే ఈ మోడల్‌ విడుదలైన రెండో దేశంగా ఇండియా నిలవనుంది. వివో గత ఏడాది అక్టోబర్‌లో చైనాలో వివో ఎక్స్ 200 సిరీస్‌లోని మూడు మోడళ్లనూ ప్రారంభించింది.

స్పెసిఫికేషన్ల అంచనాలు
ఇప్పటికే చైనాలో విడుదలైన “వివో ఎక్స్ 200 ప్రో మినీ”లో 6.31 అంగుళాల ఎల్‌టీపీవో అమోలెడ్‌ స్క్రీన్ ఉంటుంది. 120హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్, 4,500నిట్స్ బ్రైట్‌నెస్‌ ఉంటాయి. 3ఎన్‌ఎం మీడియాటెక్ మెరిటెక్ 9400 చిప్‌తో పాటు 16జీబీ వరకు ఎల్పీడీడీఆర్‌5ఎక్స్‌ ర్యామ్‌, 1టీబీ వరకు యూఎఫ్‌ఎస్‌ 4.0 స్టోరేజీతో ఇది విడుదలైంది.

ఇందులో ఆండ్రాయిడ్ 15పై పనిచేస్తోంది. ఇది గ్లోబల్ మార్కెట్లలో ఫన్‌టచ్ ఓఎస్ 15తో రావచ్చు. ఫొటోలు, వీడియోల విషయంలో వివో ఎక్స్‌200 ప్రో మినీలో ట్రిపుల్ 50-మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 5జీ, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 5.4, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్‌ కనెక్టివిటీ ఫీచర్లతో వచ్చింది.